Rashmi Gautam: పెళ్లికి సిద్ధమైన రష్మీ గౌతమ్... వరుడు ఎవరంటే? షాక్ లో సుధీర్ ఫ్యాన్స్!

First Published | Nov 26, 2023, 10:07 AM IST


రష్మీ గౌతమ్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈ భామకు పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఏజ్ బార్ అవుతుండగా వివాహం ఎప్పుడని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అయితే ఆమె పెళ్లి చేసుకోనున్నారనే న్యూస్ చక్కర్లు కొడుతుంది. 
 

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీ గౌతమ్... కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. హీరోయిన్ ఫ్రెండ్ గా పలు చిత్రాల్లో నటించింది. బ్రేక్ రాకపోవడంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ షో రష్మీ ఫేమ్ మార్చేసింది. ఆమెకు ఎక్కడలేని ఇమేజ్ తెచ్చిపెట్టింది. 

హాట్ యాంకర్ ఇమేజ్ తో రష్మీ క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. అలాగే సుడిగాలి సుధీర్ తో ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఫుల్ గా వర్క్ అవుట్ అయ్యింది. సుధీర్-రష్మీ అద్భుతమైన రొమాన్స్ కురిపించారు. డాన్సులు, పెళ్లి స్కిట్స్ లో ప్రేక్షకులను అలరించారు. సుధీర్-రష్మీ నిజ జీవితంలో కూడా లవర్స్ అని జనాలు గట్టిగా నమ్మేంతగా వారి జర్నీ సాగింది. 


అందుకే వీరిద్దరిలో ఎవరు మీడియా ముందుకు వచ్చినా మరొకరికి గురించి అడుగుతారు. ఇటీవల కాలింగ్ సహస్ర మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా సుధీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పెళ్లి ఎప్పుడు? రష్మీనే చేసుకుంటారా? రష్మీ హీరోయిన్ గా మీ సినిమా ఎప్పుడు? అంటూ ప్రశ్నలు కురిపించారు. 

Rashmi Gautam

అటు సుధీర్ కూడా వివాహం చేసుకోవడం లేదు. దీంతో రష్మీ-సుధీర్ మధ్య ఎఫైర్ ఉండొచ్చు. ఏదో ఒక రోజు ఆ న్యూస్ బ్రేక్ చేస్తారనే సందేహాలు ఉన్నాయి. ఈ ఊహాగానాల మధ్య రష్మీకి వివాహం అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. దాంతో అందరూ షాక్ అవుతున్నారు. 

ఒరిస్సా అమ్మాయి అయిన రష్మీ గౌతమ్... ఆ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటుంద. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకారం చెప్పుకున్నారు. దీంతో త్వరలో రష్మీ గౌతమ్ పెళ్లి ప్రకటన రానుందని గట్టిగా వినిపిస్తోంది. గతంలో కూడా రష్మీ పెళ్లిపై అనేక పుకార్లు వినిపించాయి. అవి గాలి వార్తలు గానే మిగిలిపోయాయి. 

ఇక రష్మీ కెరీర్ పరిశీలిస్తే ఆమె ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నారు. ఇవి టాప్ రేటెడ్ షోలుగా ఉన్నాయి. రష్మీ గౌతమ్ ఒక్కో ఎపిసోడ్ కి రూ. 1.5 నుండి 2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

హీరోయిన్ గా ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. ఒక దశలో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. దీంతో దర్శక నిర్మాతలు ఆసక్తి తగ్గించారు. ఇటీవల భోళా శంకర్ మూవీలో తళుక్కున మెరిసింది. 

Jabardasth Faima : హాస్పిటల్ బెడ్ పై జబర్ధస్త్ ఫైమా.. ఆందోళణలో అభిమానులు, ఆమెకు ఏమయ్యింది..?

Latest Videos

click me!