Bigg Boss Telugu 7: ఊహించని పరిణామం...అనారోగ్య కారణాలతో  శివాజీని ఇంటి నుండి పంపేసిన బిగ్ బాస్?

Published : Nov 25, 2023, 09:49 PM IST

బిగ్ బాస్ ఎలిమినేట్ కాకుండానే శివాజీని ఇంటి నుండి బయటకు పంపేశాడు. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి శివాజీకి బిగ్ బాస్ ఓ విషయం చెప్పాడు. ఇకపై నీ చేయికి ఏదైనా అయితే నీదే బాధ్యత అన్నాడు. దీంతో శివాజీ ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు.   

PREV
16
Bigg Boss Telugu 7: ఊహించని పరిణామం...అనారోగ్య కారణాలతో  శివాజీని ఇంటి నుండి పంపేసిన బిగ్ బాస్?
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ సీజన్ 7 ఊహించని పరిణామాలతో సాగవుతుంది. శివాజీ టైటిల్ ఫెవరేట్ గా ఉన్నాడు. శివాజీ ఎప్పుడు నామినేషన్ లో ఉన్నా... అతడికి అందరి కంటే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయి. వయసులో పెద్దవాడిగా మెచ్యూర్డ్ గేమ్ ఆడుతున్నాడు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ శివాజీ టాప్ లో దూసుకుపోతున్నాడు. 

 

26
Bigg Boss Telugu 7

కాగా శివాజీకి కొన్ని వారాల క్రితం టాస్క్ ఆడే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. అతని భుజానికి గాయమైంది. దీంతో బిగ్ బాస్ హౌస్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఒకసారి బయట హాస్పిటల్ కి కూడా వెళ్ళొచ్చాడు. వారాల పాటు శివాజీకి ట్రీట్మెంట్ జరిగింది. కొన్ని టాస్క్ లలో అతడికి మినహాయింపు దొరికింది. ఇంటి సభ్యులు కూడా గాయం సాకుతో ఏ పనీ చేయకుండా గడుపుతున్నాడనే విమర్శలు చేశారు. 

36
Bigg Boss Telugu 7

ఇక రెండు వారాలుగా అతడి గాయం నయం అయ్యింది. ఎంతో కొంత నొప్పి మాత్రం ఉందని అంటున్నాడు. షో ఫైనల్ కి చేరుతుంది. టాస్క్ లో ఇంకా కఠినంగా ఉంటాయి. కాబట్టి శివాజీకి బిగ్ బాస్ ఒక హెచ్చరిక జారీ చేశాడు. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి... ఇకపై నీ చేయి బాధ్యత నీదే. హౌస్లో ఉండాలి అనుకుంటే ఉండు, లేదంటే వెళ్లిపోవచ్చు అన్నాడు. 


 

46
Bigg Boss Telugu 7

కొంచెం స్ సమయం అడిగిన శివాజీ... తన నిర్ణయం బిగ్ బాస్ కి చెప్పాడు. చేయి అయితే నొప్పిగానే ఉంటుంది. నేను 100 శాతం ఇస్తానని గ్యారంటీ లేదు. కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేశాడు. ఫైనల్ కి ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకో అని బిగ్ బాస్ చెప్పాడు. లేదు నేను వెళ్ళిపోతా బిగ్ బాస్ అని శివాజీ అన్నాడు. 

56
Bigg Boss Telugu 7


కొంచెం సమయం తర్వాత మరలా మా నిర్ణయం చెబుతామని బిగ్ బాస్ అన్నాడు. అనంతరం శివాజీని నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. వెళ్ళిపోతావా అని అడిగాడు. వెళ్ళిపోతా అని శివాజీ అన్నాడు. అయితే నాగార్జున ధైర్యం చెప్పాడు. నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు. అప్పటి వరకు హౌస్లో ఉండని హామీ ఇచ్చాడు. 
 

66
Bigg Boss Telugu 7


దాంతో శివాజీని ఇంటి నుండి బయటకు పంపేయాలని బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ పడింది. కాగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాగా... రతిక, అశ్విని ఎలిమినేట్ అయినట్లు సమాచారం. 
  

click me!

Recommended Stories