తెలంగాణ యాసలో మాట్లాడుతూ, వంటలు చేస్తూ కనిపించింది. తనదైన హావభావాలతో ఆకట్టుకుంది గంగవ్వ. ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. లక్షల మంది వాటిని వీక్షించారు. అదే సమయంలో తెలంగాణ కల్చర్‌ని ప్రతిబింబించేలా ఆమె అనేక వీడియోలు చేశారు. అవన్నీ వైరల్ అయ్యాయి. దీంతో గంగవ్వకి గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ షోతో ఆమె మరింత పాప్యులర్ అయ్యారు.
కాగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్న క్రమంలో ఆమె 2022లో చిలుక పంచాంగం వీడియో చేశారు. మే 20న తన యూట్యూబ్‌లో ఛానల్ లో ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు. ఇందులో నిజమైన చిలుకని ఉపయోగించారు. ఇలా యూట్యూబ్ వీడియో కోసం చిలుకని ఉపయోగించడంపై గంగవ్వ, యూట్యూబర్ రాజులపై ఆదులాపురం గౌతమ్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.