అర్ధరాత్రి బిగ్ బాస్ హౌస్లో ఊహించని ఘటన, పృథ్విరాజ్ కి విష్ణుప్రియ సేవలు!

First Published | Oct 25, 2024, 3:04 PM IST

బిగ్ బాస్ హౌస్లో విష్ణుప్రియ తీరు ఒకింత వివాదాస్పదం అవుతుంది. పృథ్విరాజ్ కాళ్లకు విష్ణుప్రియ అర్ధరాత్రి మసాజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 
 

బిగ్ బాస్ హౌస్లో ప్రేమకథలు సాధారణమే. సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం లవ్ బర్డ్స్ గా వార్తలకు ఎక్కారు. వీరి లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ జంట పట్ల ఆడియన్స్ లో ఒక పాజిటివిటీ ఉండేది. హద్దులు దాటకుండా ఒక లైన్ మైంటైన్ చేశారు. 
 

ఇక సీజన్ 4లో అఖిల్ సార్థక్-మోనాల్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అఖిల్ అంటే మోనాల్ చాలా ఇష్టం కనబరిచేది. అదే సీజన్లో అభిజీత్-హారిక అలేఖ్య సైతం ప్రేమికులుగా ప్రచారం పొందారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉండేవారు. సీజన్ 5లో షణ్ముఖ్ జస్వంత్-సిరి హన్మంత్ ఒకరి కోసం మరొకరు అన్నట్లు గేమ్ ఆడారు. వీరికి మధ్య గిల్లికజ్జాలు చోటు చేసుకునేవి. ఎంత గొడవపడ్డా మరలా కలిసిపోయేవారు. 

ఇక సీజన్ 6లో ఇనాయ సుల్తానా నేరుగా తన ప్రేమను ప్రకటించింది. ఆర్జే సూర్య అంటే తనకెంతో ఇష్టమని కన్ఫెషన్ రూమ్ లో వెల్లడించింది. ఆర్జే సూర్యను వదిలి ఉండేది కాదు. అతడు ఎలిమినేట్ కావడంతో బాగా ఏడ్చింది ఇనాయ సుల్తానా. సీజన్ 7లో చెప్పుకోదగ్గ ప్రేమ జంటలు లేరు. శుభశ్రీ రాయగురుకి గౌతమ్ దగ్గరవ్వాలని చూశాడు. వర్క్ అవుట్ కాలేదు. దానికి తోడు ఆమె త్వరగా ఎలిమినేట్ అయ్యింది. 


లేటెస్ట్ సీజన్లో సోనియా ఆకుల పృథ్విరాజ్, నిఖిల్ లతో సన్నిహితంగా మెలిగింది. వీరిది ప్రేమదేశం తరహా లవ్ స్టోరీ అని ఆడియన్స్ అభిప్రాయ పడ్డారు. అయితే వారిద్దరితో తనది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అని సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యాక క్లారిటీ ఇచ్చింది. అయితే విష్ణుప్రియ మొదటి నుండి పృథ్విరాజ్ అంటే ఆసక్తి చూపుతుంది. విష్ణుప్రియకు సోనియా ఆకుల అడ్డుగా ఉండేది. సోనియా ఎలిమినేషన్ తో విష్ణుప్రియకు లైన్ క్లియర్ అయ్యింది. 

చెప్పాలంటే గేమ్ మీద కంటే కూడా విష్ణుప్రియకు పృథ్వి మీదే ఎక్కువ దృష్టి ఉంది. అతడికి సేవలు కూడా చేస్తుంది. ఎక్కువ సమయం పృథ్విరాజ్ తోనే ఆమె గడుపుతుంది. తాజాగా వీరిద్దరి సంచలన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అర్ధరాత్రి పృథ్వి కాళ్లకు మసాజ్ చేస్తున్న విష్ణుప్రియ అందరి మైండ్ బ్లాక్ చేసింది. 

Bigg boss telugu 8

అసలు అంతగా పృథ్విరాజ్ కి విష్ణుప్రియ దాసోయం అయ్యిందేంటనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే నాగార్జున ఒకసారి విష్ణుప్రియకు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు గేమ్ ని సీరియస్ గా తీసుకోకపోతే... ప్రేక్షకులు కూడా నిన్ను సీరియస్ గా తీసుకోరని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అయినా విష్ణుప్రియ గేమ్ మారిన తీరు కనబడటం లేదు. విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ హోదాలో హౌస్లో అడుగుపెట్టింది. 

కొంచెం గేమ్ పై దృష్టి పెడితే ఆమె టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. విష్ణుప్రియ గ్రాఫ్ పడిపోయిందని ఓటింగ్ చూస్తే అర్థం అవుతుంది. మొదట్లో విష్ణుప్రియ ఓటింగ్ లో టాప్ లో ఉండేది. ఇప్పుడు ఆమె మూడు, నాలుగు స్థానాలకు పడిపోయింది. ఈ వారం ఓటింగ్ లో ప్రేరణ సత్తా చాటుతుంది. ఆమెకు అత్యధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట. 
 

ప్రేరణ, నిఖిల్ తర్వాత మూడో స్థానంలో విష్ణుప్రియ ఉందట. విష్ణుప్రియ ఇలానే గేమ్ ఆడితే ఆమె త్వరలో ఇంటి బాట పట్టడం ఖాయం. ఎనిమిది వారాల సమయం గడుస్తున్నా.. విష్ణుప్రియ ఎలాంటి ప్రభావం చూపలేదు. తనకంటూ ప్రేక్షకుల్లో ఒక మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. విష్ణుప్రియ టైటిల్ రేసులో లేదని తేలిపోయింది. ఫైనల్ కి వెళ్లడం కూడా కష్టమే అనిపిస్తుంది. 

Bigg boss telugu 8

కాగా ఈ వారం ఓటింగ్ లో మెహబూబ్, నయని పావని వెనుకబడ్డారట. వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కలదట. మెహబూబ్, నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు తో షోలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. 

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?

Latest Videos

click me!