Brahmamudi Today Episode: ఇరుక్కున్న స్వాతి, ఇందు.. రేఖపై పగతో రగిలిపోతున్న నందు

Published : Mar 10, 2026, 10:57 AM IST

Brahmamudi Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. zఎగ్జామ్‍కు వెళ్లొచ్చిన ఇందు..రేఖ ఎదుట పడుతుంది. మరి ఇందు దొరికిపోయిందా? ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం.  

PREV
19
టైలర్ నంబర్ అడిగిన రేఖ

ఇంటికి వచ్చిన ఇందును రేఖ..ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. స్వాతి బట్టలు కుట్టించడానికి వెళ్లానని చెప్తుంది. అయితే ఏ టైలర్ దగ్గరికి వెళ్లావ్, అతని నంబర్ ఇవ్వు అని రేఖ అడుగుతుంది. నా దగ్గర లేదని ఇందు చెప్తుంది. నువ్వు నంబర్ ఇవ్వని స్వాతిని అడుగుతుంది..రేఖ. నంబర్ ఇస్తే అక్క ఇందు దొరికిపోతుంది, ఇవ్వకపోతే నా పని అయిపోతుందని భయంతో స్వాతి నంబర్ ఇస్తుంది. 

29
ఇందు వచ్చిందని టైలర్ చెప్పడంతో సైలెంట్ అయిన రేఖ

రేఖ టైలర్‍కు ఫోన్ చేస్తుంది. స్వాతి బట్టలు కుట్టించడానికి ఎవరైనా అమ్మాయి వచ్చిందా అని అడుగుతుంది. ఆ ఇందు మేడం వచ్చారని టైలర్ చెప్పడంతో స్వాతి, అపర్ణ ఊపిరిపీల్చుకున్నారు. ఎక్కడ దొరికిపోతామోనని కంగారు పడతారు. అప్పుడు రేఖ కామ్ అవుతుంది.

39
నేను బయటకు వెళ్తే మీకు వచ్చే నష్టమేంటి?

కిచెన్‍లోకి వెళ్తూ ఇందు...ఒకసారి ఆగి రేఖను అడుగుతుంది. నేను బయటకు వెళ్తే మీకు వచ్చే నష్టమేంటి? ఎందుకు మీరు కంగారు పడుతున్నారని ఇందు ప్రశ్నిస్తుంది. నా ఎదుట మాట్లాడటానికే భయపడే నువ్వు...నన్నే ప్రశ్నిస్తున్నావా? అని రేఖ ఇందుపై ఫైర్ అవుతుంది. నీకెవరైనా నూరి పోస్తున్నారా అని కోప్పడుతుంది. నువ్వు నేను చెప్పింది వినడం తప్ప..నన్ను ప్రశ్నించడానికి కాదని తిట్టి పంపించేస్తుంది.

49
ఆస్తి చేతికొచ్చేవరకు ఇందు బయటకు వెళ్లకూడదన్న రేఖ

ఇంత చిన్న విషయానికి ఎందుకు గొడవ పెట్టావ్ అని భ్రమరాంబ రేఖను అడుగుతుంది. భయపడాలి వదిన..లేదంటే ఆస్తి మన చేతికి రాదు, అప్పటివరకు కాస్త జాగ్రత్త పడాలి అని రేఖ అంటుంది. అవునా అయితే ఆ ఇందు బయటకు వెళ్లకుండా నేను చూసుకుంటా అని భ్రమరాంబ అంటుంది. 

59
ఎక్కడ దొరికిపోతామోనని తెగ టెన్షన్ పడ్డానన్న స్వాతి

నీళ్లు తాగుతున్న ఇందును....ఎగ్జామ్ ఎలా రాశావని అపర్ణ అడుగుతుంది. బాగానే రాశానని చెప్తుంది. పాసవుతావా అని అపర్ణ అడిగితే..నేను నీ మనవరాలిని, ఫస్ట క్లాస్ వస్తుంది అని ఇందు చెప్తుంది. ఇంతలో స్వాతి వచ్చి...నీ ఎగ్జామ్ కోసం ఇన్ని తిప్పలు పడాల్సి వచ్చిందని అంటుంది. ఎక్కడ దొరికిపోతామోనని తెగ టెన్షన్ పడ్డా అని అంటుంది. నాకు ఎగ్జామ్ రాయడానికి నువ్వు హెల్ప్ చేస్తే ఇరికిస్తానా అంటుంది ఇందు.

69
నందు కూడా మనతోనే ఉంటే ఎంత బాగుండేది కదా అన్న అపర్ణ

ఎగ్జామ్ రాయడానికి వెళ్లి టైలర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లావ్..అని స్వాతి అడుగుతుంది. రేఖ ఆంటీకి దొరికిపోతామోననే భయంతో..ఎగ్జామ్ గంట ముందే రాసి టైలర్ దగ్గరికి వెళ్లానని ఇందు అంటుంది. ఎగ్జామ్ హాల్‍లో ఐశ్వర్య కనిపించందని ఇందు చెప్తుంది. నందు కూడా మనతోనే ఉంటే ఎంత బాగుండు అని అపర్ణ అంటుంది. ఇంటి నుంచి వెళ్లిపోయి తప్పు చేసిందని అంటారు. ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో అనుకుంటారు. 

79
రేఖను పొగరు దించాలంటే పోలీస్ అవుతానన్న నందు

ఇక మరో దగ్గర బోకేల అమ్ముకుంటున్న నందు దగ్గరికి కానిస్టేబుల్ బాబాయ్ వస్తాడు. డిగ్రీ కంప్లీట్ చేయకుండా ఇవన్నీ ఎందుకంటాడు. నీకొచ్చే శాలరీ నీ మందులకే సరిపోదు...ఇక నా ఖర్చులు కూడా నువ్వే చూస్తావా అంటుంది నందు. చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నావ్ కదా...ఇప్పుడు కూడా ఎందుకు అంటుంది. పనిచేస్కుంటూ చదువుకుంటాలే, మా అక్క కోసం పోలీస్ అవుతానని నందు అంటుంది. మీ అక్కంటే అంత ఇష్టం కదా..ఎప్పుడూ మీ అక్కని చూడాలని అనిపించలేదా అని బాబాయ్ అడుగుతాడు. అక్కంటే ఎంత ఇష్టముందో...ఆ రేఖ అంటే అంత పగ ఉంది. ఆమెను ఎదురించాలంటే కచ్చితంగా నేను పోలీస్ అవ్వాలని శపథం చేస్తుంది. 

89
నందు కొటేషన్లు కొట్టేసిన వెంకీ

మరోవైపు వెంకీ అనే అబ్బాయి….బోకే షాప్ వద్ద నుంచి మరో అమ్మాయికి సైట్ కొడుతుంటాడు. ఆ అమ్మాయి అక్కడినుంచి వెళ్లిపోవడంతో బోకే కావాలని నందును అడుగుతాడు, అక్కడ గోడపై నందు రాసిన కొటేషన్లు చదువుతూ ఆశ్చర్యపోతాడు. ఇలాంటివాటికే లవ్లో పడిపోతారా అని వెంకీ అంట...ట్రై చేసి చూడు అని నందు అంటుంది. వేరేవాళ్లవి నేనువాడుకునేంత చీప్ మెంటాలిటీ కాదంటూ అక్కడినుంచి వెంకీ వెళ్లిపోతాడు.

ఆఫీస్ దగ్గర ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేముందు..నందు కొటేషన్ గుర్తొచ్చి అదే చెప్తాడు. ఆమెసిగ్గుతో వెంకీ ఇచ్చిన పూల బోకెను పట్టుకుని లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో నందు వచ్చి వేరేవాళ్లవి నేనువాడుకునేంత చీప్ మెంటాలిటీ కాదని చెప్పి ఇప్పుడు ఎలా మాట మార్చుతావ్ అంటుంది. నా కొటేషన్ వాడుకునేందుకు రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. చేసేదేం లేక వెంకీ డబ్బులిస్తాడు.

99
ఆపరేషన్‍కు రూ.10 లక్షలు కావాలన్నా డాక్టర్

ఇక అటువైపు సుభాష్‍ను చూడటానికి డాక్టర్ వస్తారు. ఎలా ఉందని ఇందు అడిగితే...మందులతో కేవలం నొప్పి మాత్రమే తగ్గించగలమని, సర్జరీ చేయకపోతే నడుం పడిపోతుందని డాక్టర్ చెబుతాడు. ఆపరేషన్‍కు ఎంత అవుతుందని ఇందు అడిగితే...రూ.10 లక్షలని డాక్టర్ అంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories