BrahmaMudi 8th march Episode:అనామిక రాకతోనే ఈ సమస్యలు తేల్చేసిన పెద్దావిడ, స్వప్న న్యాయం చేయాల్సిందే..!

First Published | Mar 8, 2024, 11:53 AM IST

మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటైతే.. నిన్ను వంటింటి కుందేలు చేస్తారని చెబుతుంది. ఉంటే తనలా ఉండమని.. అనుకున్నాది సాధించవచ్చని సలహా ఇస్తుంది.

Brahmamudi


BrahmaMudi 8th march Episode:స్వప్న చేసిన పనికి కావ్య చివాట్లు పెడదాం అనుకుంటుంది. లోపలికి తీసుకువచ్చి.. ఇంట్లో అందరూ నిన్ను మోడలింగ్ చేయవద్దని చెప్పారు కదక్కా.. మళ్లీ ఎందుకు ఇలాంటి పని చేశావ్ ? అని అడుగుతుంది. అయితే.. కడుపుతో ఉన్న తనకు.. ఇలాంటి సమయంలో డబ్బుల కోసం కష్టపడాల్సిన అవసరం లేదు అని అంటుంది. మరి ఇలా ఎందుకు చేశావ్ అంటే..? మా అత్త, మొగుడికి బుద్ధి రావాలని చేశానని.. కనీసం క్రెడిట్ కార్డు బిల్లుకు డబ్బులు ఇవ్వమని చెప్పినా ఇవ్వడం లేదని. అందుకే అలా చేశాను అని చెబుతుంది. అత్త, మొగుడితో సమస్య ఉంటే.. అందరి దృష్టిలో చెడ్డదానివి అయిపోతావ్ కదా అని కావ్య అంటే.. నీకులా మంచిదానిలా ఉండమంటావా అని స్వప్న రివర్స్ లో అడుగుతుంది.

Brahmamudi

అవును అని కావ్య చెబితే.. నీలా ఉంటే తొక్కిపడేస్తారని, ఇప్పుడు మీ అత్త నీ మీద ప్రేమతో నిన్ను బాగా చూసుకోవడం లేదని.. వాళ్ల తోటికోడలి మీద కోపంతో చేస్తోందని చెబుతుంది. మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటైతే.. నిన్ను వంటింటి కుందేలు చేస్తారని చెబుతుంది. ఉంటే తనలా ఉండమని.. అనుకున్నాది సాధించవచ్చని సలహా ఇస్తుంది.

Latest Videos


Brahmamudi

ఇక... ఇంటి పెద్దలు సీతారామయ్య, ఇందిరాదేవిలు కూర్చొని  మాట్లాడుకుంటూ ఉంటారు. తమ కుంటుంబంలో వస్తున్న సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని ఇందిరాదేవి అంటుంది. అయితే.. స్వప్న బాధలో న్యాయం ఉందని సీతారామయ్య అంటాడు. స్వప్న సంగతి అంటే ఒకే కానీ.. ధాన్యలక్ష్మికి ఏం అన్యాయం జరుగుతోంది అని అడుగుతుంది. ధాన్యలక్ష్మి కూడా అలా ఫీలౌతుందా అంటే.. పెద్ద గొడవ చేసిందని.. ఆకరికి సుభాష్ పై కూడా ఎదురు తిరిగిందని జరిగిన విషయం చెబుతుంది. నాకు తెలీదే అని సీతారామయ్య అంటే... నువ్వు బాధపడతావని చెప్పలేదని..  ఇలానే ధాన్యలక్ష్మి రెచ్చిపోతే.. ఇంట్లో సమస్యలు పెరుగుతాయని అపర్ణ అంటోందని చెబుతుంది.

Brahmamudi

ధాన్యలక్ష్మి.. అనామిక వచ్చినప్పటి నుంచి మారిపోయిందని, కోడలి కోసం మారిందా, పంతం కోసం అలా చేస్తుందో అర్థం కావడం లేదని ఇందిరాదేవి అంటే....రాజ్ లాగా.. కళ్యాణ్ ని చేయాలని అనుకుంటోందని సీతారామయ్య అంటాడు. కానీ.. ధాన్యలక్ష్మికి తెలియని విషయం ఏమిటంటే... కళ్యాణ్ చాలా సున్నితమైన మనసు అని, అసలు కళ్యాణ్ గురించి తెలిస్తే.. వాడిని మార్చాలని ఎవరూ అనుకోరు అని ఆయన అంటాడు. అనామిక కూడా వాడిని అర్థం చేసుకోవడం లేదని ఫీలౌతారు. తర్వాత.. ముందు కడుపుతో ఉండి కష్టపడుతున్న స్వప్న సమస్య తీర్చాలని  నిర్ణయించుకుంటారు.

Brahmamudi


సీన్ కట్ చేస్తే... కళ్యాణ్ బెడ్రూమ్ లో కవితలు రాసుకుంటూ ఉంటాడు. అనామిక వచ్చి పడుుకోబుతంటే.. కళ్యాణ్.. బయట పడుకోవడానికి వెళ్లడానికి రెడీ అవుతాడు. అనామిక ఆపేస్తుంది. ఇక్కడ గాలి ఆడటం లేదా అని అడుగుతుంది. తనకు స్వేచ్ఛ కావాలని కళ్యాణ్ అంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఇందుకే అనా అడుగుతుంది.. అర్థం చేసుకున్నావని.. పెళ్లి చేసుకున్నాను అని అంటాడు.

Brahmamudi

నువ్వు ఇప్పుడు బయటకు వెళితే.. మన గొడవలు అందరికీ తెలుస్తాయి అని అనామిక అంటే.. చెప్పకపోయినా అందరికీ తెలుసు అని.. నువ్వు నన్ను అర్థం చేసుకున్నరోజే గదిలో పడుకుంటాను అని చెప్పి కళ్యాణ్ వెళ్లిపోతాడు. నువ్వే ఏదో ఒకరోజు నా దారికి వస్తావ్ అని అనామిక అనుకుంటుంది. కళ్యాణ్ హాల్ లో పడుకుంటాడు.

Brahmamudi

అయితే.. కళ్యాణ్ హాల్ లో పడుకోవడం ధాన్యలక్ష్మి చూస్తుంది. అనామికతో గొడవ జరిగిందా అనుకొని వెంటనే వెళ్లి నిద్రపోతున్న తన భర్త ప్రకాశం ని లేపుతుంది. కళ్యాణ్ హాల్ లో పడుకున్నాడనే విషయం చెబుతుంది. కొడుకు, కోడలు మధ్య గొడవ జరిగిందేమో అని,  ఇప్పుడు అక్క చూస్తే దెప్పిపొడుసతుందని.. లోపల పడుకోమని చెప్పండి అంటుంది. అంటే.. కొడుకు కష్టం కన్నా.. తోటికోడలు దెబ్బతొడవడమే ముఖ్యమా అని ప్రకాశం అడిగితే.. నాకు కాదు.. మీ కొడుక్కి చెప్పి గదిలోకి పంపండి అంటుంది. ప్రకాశం కి ఇష్టం లేకపోయినా.. ధాన్యలక్ష్మి పోరు తట్టుకోలేక.. వెళ్లి కళ్యాణ్ ని లేపుతాడు.

Brahmamudi

ఇక్కడ పడుకొని, కోడలి పరువు తీయవద్దని, ఏ దంపతుల మధ్య అయినా సమస్యలు తప్పవని.. ప్రకాశం సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే.. కళ్యాణ్ ఎంత చెప్పినా ప్రకాశం వినిపించుకోడు. దీంతో.. ఇష్టం లేకపోయినా.. తండ్రి బాధపడకూడదని కళ్యాణ్ లోపలికి వెళతాడు. అయితే... ఎవరూ చూడకుండానే తన కొడుకు గదిలోకి వెళ్లాడు అని ధాన్యం సంబరపడుతుంది. దానికి ప్రకాశం క్లాస్ పీకుతాడు. కొడుకు సంతోషం గురించి ఆలోచించమని.. భర్తతో ఎలా ఉండాలో కోడలికి నేర్పమని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు.

Brahmamudi

ఇక.. భాస్కర్ ను కనకం ఇంట్లో వదిలేసి.. కావ్యను ఇక్కడికి తీసుకువచ్చినందుకు రాజ్ సంబరపడిపోతూ ఉంటాడు. అదే విషయం శ్వేత కు ఫోన్ చేసి చెప్పి మరీ సంబరపడిపోతూ ఉంటాడు. తర్వాత కావ్య వస్తోందని ఫోన్ ఫెట్టేస్తాడు. వాళ్ల బావ లేనందుకు ఫీలౌతున్నావా అని కాసేపు కావ్యను ఏడిపిస్తాడు. ఇఖ... మళ్లీ వాళ్ల బావను రంగంలోకి దింపాల్సిందే అని.. ఇందిరా దేవి అనడంతో కావ్య సరే అంటుంది. 

click me!