Hi Nanna Ott : ఓటీటీలో దుమ్ములేపుతున్న ‘హాయ్ నాన్న’... మూడు లాంగ్వేజీల్లో అదరగొడుతున్న నాని!

Published : Jan 07, 2024, 07:23 PM ISTUpdated : Jan 07, 2024, 07:30 PM IST

నేచురల్ స్టార్ నాని Nani లేటెస్ట్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’Hi Nanna’ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో విజయవంతంగా నడిచిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. 

PREV
16
Hi Nanna Ott : ఓటీటీలో దుమ్ములేపుతున్న ‘హాయ్ నాన్న’... మూడు లాంగ్వేజీల్లో అదరగొడుతున్న నాని!
Nani and Mrunal Thakur‘s Telugu film 'Hi Nanna' on Netflix.

నేచురల్ స్టార్ నాని విభిన్న కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. వరుసగా తన అభిమానులను అలరిస్తూనే వస్తున్నారు. థియేటర్లలో అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 
 

26

ఈ క్రమంలో రీసెంట్ గా బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో పాటు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో వచ్చాడు. అదే ‘హాయ్ నాన్న’ చిత్రం. కొత్త దర్శకుడు శౌర్వ్యూ మొదటిసారైనా చక్కగా తెరకెక్కించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా అద్బుతంగా చిత్రీకరించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బేబీ కియారా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 

36

డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. లాంగ్ రన్ లో రూ.75 కోట్ల వరకు కలెక్షన్ చేసింది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీ Ott ప్లాట్ ఫామ్ లోనూ విడుదలైంది. 

46

నెల రోజులకు ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి చేరింది. న్యూ ఇయర్ స్పెషల్ గా జనవరి 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. 

56

ఓటీటీలోకి వచ్చి మూడురోజులే అవుతున్నా.... ఈ చిత్రం ప్రస్తుతం టాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. తెలుగులో ‘హాయ్ నాన్న’ టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. 
 

66
Hi Nanna earns 12 crore in overseas box office report

అలాగే ఈచిత్రం హిందీ వెర్షన్ లో టాప్ 5లో, తమిళ వెర్షన్ లో టాప్ 10లో ట్రెండింగ్ అవుతుండటం వివేషం. కుటుంబ సమేతంగా చూడగలిగిన చిత్రం కావడంతో సినిమాకు ఓటీటీలో మరింతగా రెస్పాన్స్ దక్కుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories