Brahmamudi
BrahmaMudi 2nd April Episode:రాజ్ కంపెనీ ఎండీ పదవి నుంచి తప్పుకోవడం గురించి పెద్దావిడ ఇందిరాదేవి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కావ్య వచ్చి... అమ్మమ్మగారు ఇక్కడ ఉన్నారా అనుకుంటూ కావ్య వచ్చేస్తుంది. ఆమె డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతుంది. బుడ్డోడిని ఆఫీసుకు తీసుకువెళ్లినందుకు ఇంట్లో నానా రచ్చ చేశారు అని చెబుతుంది. ఇలా జరుగుతుందని ముందే ఊహించాను అని కావ్య అంటుంది. మరి రాజ్ కి వద్దు అని చెప్పొచ్చు కదా అంటే.. ఆల్రెడీ చెప్పానని.. ఆఫీసులో ఎవరు అడిగినా నా కొడుకు అనే చెబుతాను అన్నాడని చెబుతుంది.
Brahmamudi
ఇప్పుడు అసలు విషయం అది కాదని.. రాజ్ ని ఎండీ పదవి నుంచి తప్పుకోవాల్సిందే అని రుద్రాణి రచ్చ చేయడంతో.. అపర్ణ కూడా రాజ్ ని నిలదీసిందని చెబుతుంది. ఇక.. తనకు పదవి కంటే.. బిడ్డే ముఖ్యం అని చెప్పి, ఎండీ పదవి నుంచి తప్పుకున్నాడు అని చెబుతుంది. అదివిని కావ్య షాకౌతుంది. అసలు ఆ బిడ్డ విషయం శ్వేతకి కూడా తెలియదు అమ్మమ్మగారు అని చెబుతుంది. ఇంట్లో వాళ్లకే చెప్పలేదు.. ఫ్రెండ్ కి ఎలా చెబుతాడు అని ఆవిడ అంటుంది. అయితే.. శ్వేతను అడ్డుపెట్టుకొనే తనను వదిలించుకోవాలనిచూశాడు కదా.. నిజంగా బిడ్డ ఉంటే.. శ్వేతను అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అనే లాజిక్ కావ్య బయటకుతీస్తుంది. నిజమే కదా అని ఇందిరాదేవి అంటుంది. అందుకే.. ఆ బిడ్డ తల్లి ఎవరో కనిపెట్టాలని.. రేపటి నుంచి దాని మీద తన ఫోకస్ అంతా పెడతాను అని చెబుతుంది. ఆ పని చెయ్యమ్మ.. ఇంట్లో గొడవలకు తలనొప్పి వస్తోందని ఆవిడ అంటుంది.
Brahmamudi
సీన్ కట్ చేస్తే.... సుభాష్.. రాజ్ తీసుకున్న నిర్ణయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రాజ్ కూడా అక్కడికి వస్తాడు, తాను తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని తనకు తెలుసు అని.. కానీ తప్పలేదని చెబుతాడు. ఆయన కూడా తన బాధను చెబుతాడు. తర్వాత.. నా తర్వాత ఎండీ పదవి ఎవరికి ఇస్తారు అని అడుగుతాడు. ఇంకా ఏమీ ఆలోచించలేదు అని సుభాష్ అంటే.... తాను ఆలోచించాను అని చెబుతాడు. ఏంటి అని సుభాష్ అడిగితే.. కళ్యాణ్ కి ఇష్టం లేకుండా.. బలవంతంగా అప్పగించడం కరెక్ట్ కాదని.. రాహుల్ కి సమర్థత లేదని చెబుతాడు. అందుకే కావ్యకు అప్పగించమని.. తను మాత్రమే అన్నీ బాధ్యతగా చెయ్యగలదు అని చెబుతాడు. కానీ... అని సుబాష్ ఆలోచిస్తే.. అమ్మకి ఇష్టం ఉండదు తెలుసు కానీ...ఎలాగోలా ఒప్పించమని. కావ్య మాత్రమే తన బాధ్యతలను నిర్వహించగలదు అని చెబుతాడు. బలవంతంగా సుభాష్ ని ఒప్పిస్తాడు. కావ్య గురించి అంత బాగా ఆలోచించే నువ్వు.. తనకు మాత్రం ఎందుకు అన్యాయం చేస్తున్నావ్ అని అడుగుతాడు. దానికి మాత్రం రాజ్ సమాధానం చెప్పడు.
Brahmamudi
ఇక.. రాజ్ తన బెడ్రూమ్ కి వెళ్లే సరికి.. కావ్య బుడ్డోడుని ఆడిస్తూ ఉంటుంది. వాడికోసం చాలా బొమ్మలు తెచ్చి ఆడిస్తూ ఉంటుంది. ఆ సీన్ ని రాజ్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. కావ్య.. తానేమీ అడ్జస్ట్ అవ్వలేదని.. కాంప్రమైజ్ అవ్వలేదని.. ఊరికే ఆడిస్తున్నాను అని చెబుతుంది. తర్వాత.. రాజ్ ని.. ఎండీ పదవి వదులుకున్నందుకు గట్టిగా వాయిస్తుంది.
Brahmamudi
అన్నీ వదులకున్నారని.. ఇప్పుడు కంపెనీని కూడా వదులుకున్నావా అని అడుగుతుంది. కళ్యాణ్ కి ఆ ఫదవి అందుకోవడం ఇష్టం లేదని.. రాహుల్ కి సమర్థత లేదని.. ఇప్పుడు ఆ పదవి ఎవరికి అప్పగిస్తారు అని ప్రశ్నిస్తుంది. ఇంతకన్నా బాగా ఆలోచించే నీకన్నా అర్హత మరెవరికి ఉంటుంది. అని రాజ్ మనస్పూర్తిగా కావ్యను చూసి నవ్వుకుంటాడు.
Brahmamudi
ఇక.. తెల్లారి.. అనామికను రుద్రాణి రెచ్చగొడుతుంది. రాజ్ ఆ స్థానం నుంచి తప్పుకునేలా చేశాను అని... ఇక.. కళ్యాణ్ గురించి అగమని చెబుతుంది. అడిగితే.. అపర్ణ అత్తయ్య ఒప్పుకుంటుందా అని అనామిక సందేహం వ్యక్తం చేస్తే... కచ్చితంగా ఒప్పుకుంటుందని చెబుతుంది. దీంతో.. అనామిక ఆశగా వెళ్తుంది. అయితే.. తనకు కాకుండా.. కళ్యాణ్ కి అప్పగిస్తావేంటి మమ్మీ అని రాహుల్ అంటాడు. దానికి కూడా తన దగ్గర ప్లాన్ ఉందని..నీ భార్య వెళ్లి గొడవ చేస్తే.. నీకు కూడా వస్తుంది అని చెబుతుంది.
Brahmamudi
వీరి ప్లాన్ లో భాగంగా.. స్వప్నకు వినపడేలా.. మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నేను ఎండీ కాలేనా మమ్మీ అని రాహుల్ అంటే.. నీ తరపున ఎవరైనా మాట్లాడితే.. అప్పుడు నీకు ఎండీ పదవి ఇచ్చే అవకాశం ఉంది అని అంటుంది. ఆ మాటలు స్వప్న చెవిన పడటంతో...ఆమె కూడా ఆలోచనలో పడుతుంది. రాహుల్ ఎండీ అయితే... తాను ఈ ఇంటికి మహారాణి అవ్వాలి అని అనుకుంటుంది.
Brahmamudi
వెంటనే.. స్వప్న కిందకు వెళ్తుంది. ఆ వెనకే రాహుల్, రుద్రాణి కూడా వెళతారు. ఇక.. అనామిక రచ్చ మొదలుపెడుతుంది. రాజ్ బావ పదవి నుంచి తప్పుకున్నాడు కాబట్టి.. ఆ పదవికి కళ్యాణ్ కి ఇవ్వాలని పట్టుపడుతుంది. అయితే.. వెంటనే స్వప్న.. కళ్యాణ్ కి.. ఇంట్రెస్ట్ లేదు కాబట్టి.. రాహుల్ కి ఇవ్వమని అంటుంది. వీళ్లిద్దరూ వాదించుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.