
Guppedantha manasu 2nd April Episode:మను తండ్రి విషయంలో శైలేంద్ర టార్చర్ చేస్తాడు. నీ తండ్రి ఎవరో నీకే తెలీదా అని గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటాడు. మధ్యలో మహేంద్ర కలగజేసుకొని నీకు ఎందుకురా అని తిడతాడు. అయినా.. శైలేంద్ర వినకుండా అడగడతంతో మహేంద్ర నోరు జారతాడు. తన తండ్రి ఎవరో మనుకి తెలియకపోవడం అతని లోపమే అనేస్తాడు. శైలేంద్ర అడిగిన ప్రశ్నలకంటే.. మహేంద్ర అన్నమాట మనుని ఇంకా ఎక్కువ బాధపెడుతుంది. మహేంద్ర కావాలని అనకపోయినా.. పొరపాటున అనేస్తాడు. నాది లోపం కాదు సర్.. నాది లోపం కాదు.. అని బాధపడుతూ మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అయితే.. శైలేంద్ర కారణంగానే తాను అలా అనాల్సి వచ్చిందని మహేంద్ర తిడతాడు. నిన్ను ఏం చేసినా పాపం తగలదురా అని అంటాడు. దానికి శైలేంద్ర.. నేనేం చేశాను బాబాయ్..? నేనేదో క్యాజువల్ గా మను తండ్రి ఎవరు అని మాత్రమే అడిగాను. నువ్వే..లోపం అది ఇదీ అంటూ.. మనుని బాధపెట్టావ్. ఇంతకీ లోపం అంటే ఏంటి బాబాయ్ అని అడుగుతాడు.
విసుక్కుంటూ మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతే.. వసుధార కూడా.. శైలేంద్రను తిడుతుంది. నువ్వు అసలు మనిషివేనా..? నువ్వు మారవా అనేసి వసు కూడా వెళ్లిపోతుంది.
ఇక... మను ఆవేశంగా కారులో వెళ్లిపోతాడు. ఒక చోట ఆగి.. తండ్రి ఎవరో తెలియకపోవడం నా లోపమా అని గట్టిగా ఏడుస్తాడు. చిన్నప్పటి నుంచి ఇదే ప్రశ్న తనను బాధపెడుతోందని.. ఇక ఆ ప్రశ్న ఇబ్బంది పెట్టదు అని అనుకున్నానని.. కానీ.. మళ్లీ అదే ప్రశ్న వేధిస్తుందని అనుకోలేదు అని తనకి తానే బాధపడతాడు. సమాధానం చెప్పాల్సిన ఆవిడ నోరు మెదపదని, గట్టిగా అడిగినందుకు ఏకంగా తననే దూరం పెట్టేసిందని బాగా ఏడుస్తాడు. తాను చేసిన తప్పేంటి అని అనుకుంటాడు. ఆ దేవుడు తనను మాత్రమే ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడని మరింత గా ఏడుస్తాడు.
సీన్ కట్ చేస్తే... మనుని బాధపెట్టినందుకు మహేంద్ర కూడా చాలా ఫీలౌతాడు. మనుని తాను సొంత మనిషిలా, కొడుకులా భావించానని అంటాడు. రిషి కోసం చేయించిన కడియం కూడా తనకే ఇద్దామని అనుకున్నానని.. రిషి లేక..బాధల్లో కూరుకుపోయిన మనల్ని పైకి తీసుకువచ్చాడని.. మనకు శత్రువులకు మధ్య నిలపడి అండగా నిలిచాడని వసుధారతో చెబుతాడు. తాను కావాలని మనుని అలా అనలేదని.. శైలేంద్ర రెచ్చ గొట్టడంతో.. అనుకోకుండా నోరు జారాను అని అంటాడు.
అయితే.. వసుధార ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. మీరు కావాలని చేయలేదు కదా మామయ్య.. మను అర్థం చేసుకుంటాడులే అని వసుధార అంటుంది. అయితే.. మను అర్థం చేసుకోవడం కదమ్మా.. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. ఈ రోజు శైలేంద్ర మాటలతో ఇబ్బంది పెట్టినట్లే... రేపు ఇంకొకరు మనుని ఇబ్బంది పెట్టరు అని గ్యారెంటీ ఏంటి..? అంటే.. అసలు మను తండ్రి ఎవరో మనం తెలుసుకోవాలి వసు. దానికి సమాధానం తెలిసిన వ్యక్తి ఒకరే ఒకరు. అదే అనుపమ. ఆమెను ఈ రోజు నిలదీసి అయినా నిజం తెలుసుకోవాలి అని ఆవేశంగా బయలు దేరతాడు. వెనకే వసుధార కూడా పరుగులు తీస్తుంది.
ఇక.. శైలేంద్ర ఇంటికి ఆనందంతో వెళతాడు. మమ్మీ మమ్మీ అంటూ పిలుచుకుంటూ వెళ్లి.. కాలేజీలో జరిగింది మొత్తం చెబుతాడు. ఆ మనుగాడీ వీక్ నెస్ తెలిసిపోయిందని , నరకం చూపించాను అని చెబుతాడు. ఆ మాటలకు దేవయాణి కూడా సంబరపడపుతుంది. మధ్యలో ధరణి దూరి శైలేంద్ర పై సెటైర్లే వేసినా.. ఆమె నోరూ మాయిస్తారు. ధరణి వెళ్లిన తర్వాత.. ఛాన్స్ దొరికినా, దొరకకపోయినా.. ఆ మనుగాడిని ఇబ్బంది పెట్టమని దేవయాణి ఇంకాస్త సపోర్ట్ ఇస్తుంది.
ఇక.. మను బాధపడుతూ..అనుపమ పెద్దమ్మ ఇంటికి వెళ్తాడు. ఆవిడడ.. మను చేతికి కట్టుకడుతుంది. రోడ్డు మీద వెళ్తుంటే.. కుక్కలు మెరుగుతూ ఉంటాయని.. వాటిని పట్టించుకోవద్దని ఆమె చెబుతుంది. అయితే.. తనని అంటే పట్టించుకోను అని.. కానీ.. తన తల్లి మీద మచ్చ పడేలా మాట్లాడుతున్నారని మను బాధపడతాడు. ఈ విషయంలో తాను చిన్నతనం నుంచి చాలా మాటలు పడుతూనే ఉన్నాను అని... కానీ.. ఇఫ్పటికీ సమాధానం దొరకలేదని బాధపడతాడు. ఆ పెద్దావిడ మాత్రం.. మనుని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. నీకు ఏదైనా అయితే.. తాను తట్టుకోలేను అని చెబుతుంది. తనను ఇబ్బంది పెట్టేవారు మాత్రమే కాదని.. తన మంచి కోరుకునేవాళ్లు కూడా అలానే మాట్లాడుతున్నారని.. తండ్రి లేకపోవడం నా లోపం అని అంటున్నారని ఫీలౌతాడు.
ఇంట్లో దేవయాణి కూర్చొని ఉంటుంది. ఈ మధ్య తనలో శాడిజం తగ్గిపోయిందని.. కాసేపు అనుపమకు ఫోన్ చేసి ఆడుకుందాం అని అనుకుంటుంది. వెంటనే అనుపమకు ఫోన్ చేస్తుంది. ఆరోగ్యం ఎలా ఉంది..? గాయం తగ్గిందా అంటూ మాటలు మదొలుపెడుతుంది. నా మీద ఎందుకు అంత ప్రేమ అని అనుపమ అంటే.. నువ్వు మా జగతి స్నేహితురాలివి కదా అని అంటుంది. అయితే... జగతిని టార్చర్ చేసినట్లు నన్ను కూడా టార్చర్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. అలా ఏమీ కాదు అని.. కాలేజీలో బోర్డు మీటింగ్ లో జరిగిన విషయాన్ని చెబుతుంది. శైలేంద్ర.. కాజువల్ గా తండ్రి లేని వాళ్లు కూడా ఉంటారు అన్న మాట అనేసరికి.. మను గాజు గ్లాస్ పగలకొట్టాడు అని చెబుతుంది. ఆ మాట విని అనుపమ షాకౌతుంది.
https:// https://telugu.asianetnews.com/mood-of-andhra-survey
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.