ఇక.. కనకం అయితే రెచ్చిపోతుంది. నువ్వు పుట్టింటికి వచ్చేయమని.. అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని, కోర్టుకు లాగుదామని, మహిళా సంఘాలను పిలిచి రచ్చ చేద్దామని అంటుంది. ఆ మాటలకు కావ్య రివర్స్ అయిపోతుంది. ఎందుకమ్మా.. ఆయన మన ఇల్లు అప్పులో ఉన్నప్పుడు తీర్చినందుకు ఆయన పరువు తీయాలా..? నీ పెద్ద కూతురు పెళ్లి పీటల మీద నుంచి పారిపోతే... నేను ముసుగేసుకొని కూర్చున్నా.. తాళి కట్టునందుకు ఆయనను కోర్టు కి ఎక్కించాలా..? నేను పుట్టింటికి సహాయం చేయడానికి డబ్బులు తీసుకోవడానికి మొహమాట పడితే ఆయనే స్వయంగా వచ్చి బొమ్మలకు రంగులు వేసిందుకు శిక్షించాలా..? బొమ్మలను దొంగలు ఎత్తుకుపోతే ప్రాణాలకు తెగించి.. వాటిని తీసుకువచ్చిందేకు శిక్షించాలా..? నీ పెద్ద కూతురిపై కులత అనే ముద్ర పడినప్పుడు.. అది తొలగించడానికి నాతో పాటు కష్టపడినందుకు పరువు తీయాలా..? ఎందుకు చేయాలో చెప్పమ్మా అని అడుగుతుంది. మీకు మంచి చేసినప్పుడు అల్లుడు దేవుడు అవుతాడు.. కష్టం తెచ్చినప్పుడు శిక్షించాలా అని అడుగుతుంది.