BrahmaMudi 29th February Episode:కవి క్యారెక్టర్ ని దిగజార్చిన అనామిక, బాధ్యతలు అప్పగించిన రాజ్..!

First Published | Feb 29, 2024, 11:02 AM IST

 నువ్వు నన్నే అంటున్నావన్న విషయం నాకు తెలుసు అని అనామిక అనడంతో... అర్థం అయ్యిందా అయితే.. ఇప్పుడు నిన్నే అంటాను అని డైరెక్ట్ గా తిట్టడం మొదలుపెడుతుంది.

Brahmamudi

BrahmaMudi 29th February Episode: కళ్యాణ్ కవితలే రాసుకుంటాను అని నిర్ణయం తీసుకోవడంతో  ఏం చేయాలా, మళ్లీ ఆఫీసుకు ఎలా పంపాలా అని అనామిక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. నన్ను దెప్పి పొడుద్దాం అని, నీ మంచితనం గురించి వచ్చావా అని అనామిక అంటే.. అది కాదని.. కళ్యాణ్ ప్రేమ గురించి వివరిస్తుంది. కళ్యాణ్.. నీ కోసం కవితలు రాశాడని, ఈ గొడవ జరగకపోయి ఉంటే.. ఆ కవిత నువ్వు చదివి ఉండే దానివి అని.. ఆ చదివితే.. కళ్యాణ్ కి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలిసేదని చెబుతుంది. భర్త ప్రేమ దొరకలంటే చాలా అదృష్టం ఉండాలని, దాని విలువ ఆ ప్రేమ దొరకని వాళ్లకే తెలుస్తుందని.. కళ్యాణ్ మనసు బాధపెట్టొద్దని.. బాగా అర్థం చేసుకో అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అనామిక అర్థం చేసుకోదు.  అంటే మా ఆయన పిచ్చి కవితలు రాసుకుంటూ ఆ లోకంలో ఉండిపోతే.. నువ్వు, మీ ఆయన ఆఫీసును ఏలేద్దాం అనుకుంటున్నారా అని అంటుంది.

Brahmamudi

అప్పుడే దూరం నుంచి స్వప్న ఎంట్రీ ఇస్తుంది. ఏ మెంటల్ అని పిలుస్తుంది. అనామిక సీరియస్ గా చూడటంతో... నిన్ను కాదమ్మా, నా చెల్లిని అంటున్నాను అని అంటుంది. కావ్య పక్కకు వెళ్లి.. ‘ ఓసేయ్ పిచ్చి దానా.. మూర్ఖులను మార్చాలను ఎందుకు ట్రై చేస్తావ్..? పక్కన బురద ఉంది చూసుకొని వెళ్లమ్మా అని చెబితే.. నేను దానిని తొక్కుకుంటూనే వెళతాను అనే మూర్ఖులను మార్చాలి అనుకోవడం నీ పొరపాటు. గాడిదకు ఏం తెలుసు గంధపు వాసన అని.. కవిత్వం గురించి దీనికేం తెలుస్తుంది. నీ దొంగ బుద్ధి నీకు అర్థం కాలేదా? మొగుడిని కంపెనీలో అంత ఎత్తున కూర్చోపెట్టి, ఇంట్లో మహారాణిలా చక్రం తిప్పుదాం అనుకుంటోంది. మీ అత్త గురించి, వాళ్ల అత్త గురించి పాపం తెలీదు. చీపురు పట్టుకొని కొట్టేదాక ఆకాశం వైపు చూస్తూనే ఉంటుంది.’అని.. అనామికను తిడుతూ..  కావ్యకు క్లాస్ పీకుతుంది.

Latest Videos


Brahmamudi

అనామిక సీరియస్ గా స్వప్న అని అరిస్తే.. చూశావా.. నన్ను పేరు పెట్టి పిలుస్తోంది.. దీనికి నీతులు చెప్తావేంటే..? దీని కాపురాన్ని ఎవరో వచ్చి నాశనం చేయాల్సిన అవసరం లేదు.. దీనికి ఇదే నాశనం చేసుకుంటుంది. బుద్ధిలేనిదానా.. అని అనామిక పేరు ఎత్తకుండా కావ్యకు చెబుతూ ఉంటుంది. నువ్వు నన్నే అంటున్నావన్న విషయం నాకు తెలుసు అని అనామిక అనడంతో... అర్థం అయ్యిందా అయితే.. ఇప్పుడు నిన్నే అంటాను అని డైరెక్ట్ గా తిట్టడం మొదలుపెడుతుంది.

‘మా చెల్లి నీ కాపురం నిలపెట్టుకోమని చెబుతుంటే.. నువ్వు దానిని, దాని మొగుడిని అంటావేంటే..? నీకు నా మొగుడులాంటి మొగుడు దొరికితే అప్పుడు తెలిసేదే మొగుడి విలువ. బంగారం లాంటి కళ్యాణ్ మనసు బాధపెడితే.. ఆ తర్వాత.. అతను రాసి పడేసిన కవితల పేపర్లు అమ్ముకొని బతకాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకో.. అసలు’ అనడంతో.. స్వప్నను ఆపేసి.. కావ్య లోపలికి తీసుకువెళ్తుంది. స్వప్న అన్ని మాటలు అనేసరికి అనామిక మరింత రగిలిపోతుంది.
 

Brahmamudi

ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటారు. కళ్యాణ్ రాలేదని రాజ్ అడుగుతాడు. జరిగిన అవమానానికి ఎక్కడో కూర్చొని  ఫీలౌతూ ఉంటాడు అని రుద్రాణి అంటే...కళ్యాణ్ మాత్రమే కాదు.. తన కోడలు కూడా రాలేదు అని, జరిగిన అవమానానికి అనామిక కూడా బాధపడుతోంది అని ,  పిలిచినా కూడా రానందని, మొగుడు మోసం చేయడంతో ఆకలికి కావడం లేదు అని చెప్పిందని ధాన్యలక్ష్మి అంటుంది. నీ కోడలు గురించి బాగానే ఆలోచించావ్ కానీ.. నీ కొడుకు మనసు గురించి కూడా అర్థం చేసుకో అని అపర్ణ సలహా ఇస్తుంది. అయితే.. రుద్రాణి మధ్యలో కలగజేసుకొని తల్లికి ఆ మాత్రం తెలేదా వదిన అంటుంది. వెంటనే.. అపర్ణ.. తెలిసి ఉంటే.. ఇలా కోడలిని వెనకేసుకొని వచ్చేదా అని అపర్ణ అడుగుతుంది.

Brahmamudi

వెంటనే ధాన్యలక్ష్మి నా కోడలు ఏం చేసింది..? తప్పంతా కావ్యదే అని అంటుంది. మధ్యలో కావ్య ఏం చేసింది అని అడిగితే... కళ్యాన్ కవితలు రాసుకుంటూ కూర్చుంటే వద్దని చెప్పలేదు.. కనీసం.. రాజ్ కూడా పట్టించుకోలేదు అని అంటుంది. ఆ మాటకు రాజ్ బాధపడి భోజనం చేయకుండా లేస్తాడు. కావ్య రాజ్ ని ఆపుతుంది. నా తమ్ముడు తినకుండా నేను తినను అని రాజ్ చాలా బాధగా చెబుతాడు. కవి గారిని నేను తీసుకువస్తాను అని చెప్పి రాజ్ ని కూర్చోపెడుతుంది. కావ్య వెళ్లగానే.. ఈ ప్రేమ తమ్ముడి జీవితం మీద కూడా ఉండాలని, ఒక్కపూట తినకపోతే ఏం కాదని.. కానీ, జీవితం సరిగా లేకపోతూ రోజూ బాధపడాల్సి వస్తుందని ధాన్యలక్ష్మి రాజ్ పై సెటైర్లు వేస్తుంది.

అయితే.. ధాన్యలక్ష్మి ప్రవర్తన చూసి సుభాష్ చిరాకుపడతాడు. నీకు మాత్రమే బాధ్యత ఉందా? ఇంట్లో అందరికీ ఉండదా అని సీరియస్ అవుతుంది. అదేంటి అన్నయ్య తల్లిగా.. ఆ మాత్రం బాధ ఉండదా అని రుద్రాణి అంటుంది. ఇన్నాళ్లు ఏమైందని.. కోడలు ఇంటికి రాగానే తెలిసిందా? ఇంతకాలం కళ్యాణ్ చూసుకుంది మనం కాదు రాజ్ మాత్రమే అని సుభాష్ అంటాడు. ఎందుకు బాబాయ్ వేరు చేసి మాట్లాడతావ్ అని రాజ్ అంటే... మీ పిన్ని వేరు చేసి మాట్లాడుతోందని, ఈ దిక్కుమాలిన సలహాలు ఎవరు ఇస్తున్నారో అని అంటాడు. దానికి రుద్రాణి.. నన్ను చూసి అంటావేంటి అన్నయ్య.. మీ ఆవిడ ఏమన్నా చిన్న పిల్ల అనుకున్నావా అని అంటుంది. నీ దిక్కుమాలిన మాటలతో ఎవరినైనా మోసం చేయగలవని అంకుల్ అంటున్నారు అని స్వప్న అంటుంది.
 

Brahmamudi

మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావ్ అని రుద్రాణి స్వప్న పై సీరియస్ అవుతుంది. ఇక్కడ నా చెల్లిని, నా చెల్లి భర్తను అన్ని మాటలు అంటుంటే.. నేను కాకుండా.. నా మొగుడు మాట్లాడతాడా అని మాటకు మాట స్వప్న బదులిస్తుంది. పనిలో పనిగా రాహుల్ పై కూడా సెటైర్లు వేస్తుంది. టాపిక్ కళ్యాణ్ గురించి, నా గురించి కాదు అని రాహుల్ అంటాడు. అందరూ కళ్యాణ్ ని అంటున్నారు కానీ.. అసలు పని చేయనిది నువ్వు కదా అని రాహుల్ అంటుంది. స్వప్నకు సుబాష్ సపోర్ట్ చేస్తూ.. ధాన్యలక్ష్మిని తిడతాడు.

అయితే.. పిన్ని చెప్పింది కరెక్టేఅని, ఇంతకాలం వాడికి నేను ఉన్నాను కదా అనుకున్నాడు.. కానీ వాడు కూడా ఎదగాలని భార్య అనుకోవడంలో తప్పులేదుకదా.. వాడిని మారుస్తాను.. ఏదో ఒకటి చేస్తాను అని రాజ్ అంటాడు. రాజ్ మాటలు విన్న తర్వాత అయినా.. భోజనం మనస్పూర్తిగా చెయ్యి అని ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి చెబుతుంది.

Brahmamudi

మరోవైపు కళ్యాణ్ ని భోజనం కి పిలవాలని కావ్య వస్తుంది. అనామిక తన మనసు అర్థం చేసుకోవడం లేదని కళ్యాణ్ ఫీలౌతే.. నువ్వు అర్థం చేసుకున్నావా అని కావ్య అడుగుతుంది. ఏ భార్య అయినా తన భర్త మంచి స్థానంలో ఉండాలనే కోరుకోవడంలో తప్పు లేదని చెబుతుంది. అంటే.. నాకు రాని బిజినెస్ చేయమంటారా అని కవి అడుగుతాడు. అప్పుడు కావ్య.. రెండూ బ్యాలెన్స్ చేయమని.. కవిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోమని.. ఏదో ఒక రోజు మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారుతుందని మంచిగా చెప్పి కళ్యాణ్ ని భోజనానికి రమ్మని చెబుతుంది.

Brahmamudi

మరోవైపు అనామిక.. తన అంచనాలన్నీ తలకిందులు అవుతున్నాయని.. తాను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాను అని మొండిగా కూర్చుంటుంది. అనామిక దగ్గరకు కళ్యాణ్ వస్తాడు. చాలా ప్రేమగా మాట్లాడాలని చూస్తాడు. అనామిక కోపం పోగొట్టాలని క్షమాపణలు కూడా చెబుతాడు. అర్థం చేసుకోకుండా అనామిక.. అందరి ముందు అరిచి.. నాలుగు గోడల మధ్య సారీ చెబుతావా అని అంత  ఎత్తున ఎగురుతుంది. తనకు ఇష్టం లేకపోయినా నీ కోసమే ఆఫీసుకు వెళ్లానని.. అర్థం చేసుకోమని కళ్యాణ్ అంటే.. నీది చాలా చీప్ క్యారెక్టర్  అని తిడుతుంది.

Brahmamudi

అప్పుడు ఆఫీసుకు ఎందుకు వెళ్లావో.. ఇఫ్పుడు ఎందుకు వచ్చి బుజ్జగిస్తున్నావో నాకు తెలుసు అంటుంది. ఎందుకు అని కళ్యాణ్ అడిగితే.. నాతో పక్క పంచుకోవాలనే కదా అని అనామిక అనడంతో.. కళ్యాణ్ కి బాగా కోపం వస్తుంది. ‘ఇప్పటి వరకు నీ మీద కొంచెం అయినా నమ్మకం ఉండేది. అర్థం చేసుకుంటావనే ఆశ ఉండేది.. కానీ ఇప్పుడు అది కూడా పోయింది.. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది. నేను నీకు మరీ అంత దిగజారిపోయి కనిపిస్తున్నానా, ఇప్పుడు నువ్వంటేనే అసహ్యం వేస్తోంది. ఇప్పుడు చెబుతున్నా చూడు. నీ అంతట నువ్వు నన్ను అర్థం చేసుకొని వచ్చే దాకా కనీసం నీ నీడ కూడా తాకను’ అని చెప్పేసి వెళ్లి పోతాడు.

Brahmamudi

ఇక.. కావ్య బెడ్రూమ్ కి వచ్చి పడుకోబోతుంటే.. తలుపు మూయలేదని రాజ్ అడుగుతాడు. మన కాపురానికి తలుపు మూసినా ఒకటే, మూయకున్నా ఒకటే అని కావ్య అంటుంది. అయితే.. కోపంగా డోర్ రాజ్ క్లోజ్ చేసి వస్తాడు. ‘ కవిగారు కవిగారు అంటూ కళ్యాణ్ ని అలా తయారు చేసింది నువ్వే’ అని రాజ్ అరుస్తాడు. నేనేం చేశాను అని కావ్య అంటే.. కొద్దిరోజులు ఆ కవిత్వం పక్కన పెట్టి బిజినెస్ చూసుకోమని చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. మీరు చెప్పొచ్చు కదా అని కావ్య అంటే... నువ్వు ఎందుకు చెప్పలేదు అని రాజ్ సీరియస్ అవుతాడు. అనామికకు నచ్చిన విధంగా మారిస్తే.. వాళ్ల కాపురం బాగుండేది కదా అని రాజ్ అంటే.. ఆ మాత్రం కాపురాలు బాగు చేసుకోవడం నాకు వస్తే.. నా కాపురం నేనే బాగు చేసుకునేదాన్ని కదా అని కావ్య సమాధానం ఇస్తుంది. 

Brahmamudi

అయినా కవిగారిని మనసుకు నచ్చని పని చేయమని ఎలా చెబుతారు అని...మధ్యలో వాళ్ల కాపురం గురించి తెస్తుంది. ముందు మన కాపురం బాగుంటే కదా.. వాళ్లకు వాళ్ల కాపురం గురించి చెప్పేది అని సెటైర్లు వేసి పడుకుంటుంది. బుద్ధి తక్కువై దీనిని గెలికాను అని రాజ్ అనుకుంటాడు.

Brahmamudi

మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ ఆఫీసుకు బయలుదేరుతుంటే.. రాజ్ ఆపుతాడు. ఈరోజు నుంచి ఖైరతాబాద్ బ్రాంచ్ నువ్వే చూసుకుంటున్నావని అగ్రిమెంట్ పై సైన్ చేయమని చెబుతాడు. అది విని అనామిక, ధాన్యలక్ష్మి సంతోషిస్తారు. ఇంతకాలానికి తమ్ముడి గురించి ఆలోచించావ్ అని, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం తీసుకో అని రుద్రాణి అంటుంది. తనకు ఎవరూ అవకాశం ఇవ్వలేదని.. నీకైనా ఇచ్చారు అని రాహుల్ అంటాడు.  అప్పుడు కూడా స్వప్న రాహుల్ ని తిడుతుంది. కానీ.. కళ్యాణ్ తీసుకోవడానికి నిరాకరిస్తాడు. నా మనసు అర్థం చేసుకోవా అన్నయ్య.. నన్ను కాంప్రమైజ్ అవ్వమని అంటున్నారా అని అడుగుతాడు. అవసరం అయితే తప్పు లేదని రాజ్ చెబుతాడు. నువ్వేనా అన్నయ్య ఇలా మాట్లాడేది అని రాజ్ అడిగితే.. మీ అన్నయ్య కాబట్టే.. మీకు ఏం చేస్తే మంచిదో దాని గురించి ఆలోచిస్తున్నారు అని కావ్య చెబుతుంది. మీరే కదా మనసుకు నచ్చిన పని చెయ్యమని చెప్పారు అని కళ్యాణ్ అడిగితే.. రెండూ చెయ్యమని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!