Brahmamudi
BrahmaMudi 14th march Episode: కళ్యాణ్.. అప్పూతో కలిసి కనకం ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. కనకం, మూర్తిలు అప్పూని తిడతారు. ఇంకోసారి కళ్యాణ్ తో మాట్లాడొద్దని చెబుతారు. అయితే.. తమ స్నేహాన్ని ఇప్పటి వరకు మీరు తప్పుగా చూడలేదని.. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కళ్యాణ్ అడుగుతాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవరకు ఈ ఇంటి నుంచి కదలను అని కళ్యాణ్ బీష్మించుకొని కూర్చుంటాడు. చెప్పేవరకు కదలను అంటాడు. దీంతో.. ఇంకెవరు మీ అమ్మ.. కాదంటే అనామిక వచ్చి గొడవ చేసి ఉంటారు అని అప్పూ అంటుంది. అయితే.. ఇద్దరూ కలిసే వచ్చారు అని కనకం చెప్పడంతో.. కళ్యాణ్ ఆవేశంగా ఇంటికి బయలుదేరతాడు. ఈ అబ్బాయి అక్కడికి వెళ్లి ఎంత గొడవ చేస్తాడో అని మూర్తి అంటే.. అసలు వాళ్లు కావ్య అక్కని ఎన్ని మాటలు అంటున్నారో అని అప్పూ అంటుంది.
Brahmamudi
అప్పూ ఊహించినట్లుగానే.. ధాన్యలక్ష్మి, కావ్య ఇద్దరూ.. ఇంట్లోకి రావడం రావడమే... కావ్య అంటూ అరుచుకుంటూ వస్తారు. ఇంట్లో అందరూ షాకై చూస్తూ ఉంటారు. కావ్య రాగానే.. నవ్వు నా కొడుకు, కొడలు కాపురం చేసుకోనివ్వవవా, నా కొడుకు జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఆ మాటలకు కావ్యకు ఏమీ అర్థం కాదు. బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలపడుతుంది.
Brahmamudi
అయితే.. ఆమె మాటలకు స్వప్నకు మండిపోతుంది. ఆమె అలా అరుస్తుంటే.. నువ్వు ఎందుకు అలా బిత్తరచూపులు చూస్తున్నావ్.. కళ్యాణ్, అనామికలను నువ్వు విడదీయాలని చూస్తున్నావంట.. ఆవిడ అడుగుతోంది. బయటకు వెళ్లిరాగానే బుర్రను ఏ పురుగో తొలచినట్లు ఉంది. అని స్వప్న ధాన్యలక్ష్మికి కౌంటర్ ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని ధాన్యం అంటే.. మరి, మీరేం అడుగుతున్నారు..? అని స్వప్న ఎదురు ప్రశ్నిస్తుంది. నేను మీ చెల్లి(కావ్య) తో మాట్లాడుతున్నాను అని ధాన్యం అనడంతో.. కావ్య పాప నోరు తెరుస్తుంది.
Brahmamudi
నేను అడుగుతున్నాను..? మీ కొడుకు,కోడలిని విడదీయడానికి నేను పథకాలు వేస్తున్నానా అని కావ్య అంటే... అవును.. నువ్వు పచ్చగా ఉంటే ఓర్వలేవు అని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడు కావ్య.. అపనిందలు వేయడానికి కూడా ఒక అర్థం ఉండాలని, ఎవరి కాపురాన్ని ఎవరు కూలుస్తున్నారు.? ఎవరు పచ్చగా ఉంటే చూడటం లేదు..? ఒకప్పుడు ఈ ఇల్లు పచ్చగా ఉండేది.. ఇంట్లో అందరూ మరికొరి కోసం ఆలోచించేవారు. ఒకరి సంతోషం మరొకరు ఆలోచించేవారు.. అలాంటి పచ్చని సంసారంలో రోజుకో గొడవ మొదలుపెడుతోంది మీరే.. ఈ రోజు భాగం మొదలుపెట్టారు...? మీ కొడుకు, కోడలు విడిపోవాలని నేను ఎప్పుడు కోరుకున్నాను అని కావ్య అడుగుతుంది.
Brahmamudi
ఇక.. ధాన్యలక్ష్మి తన కొడుకు పిచ్చి కవితలు రాసుకుకునేలా, ఆఫీసుకు రానివ్వకుండా చేసింది నువ్వే అని అంటుంది. దానికి రాజ్ కి కోపం వస్తుంది. పిన్నీ అని అరుస్తాడు. కళావతి చెబితే వినేంత చిన్న పిల్లాడు కాదు కళ్యాణ్. అయినా.. వాడే తనకు ఈ వ్యాపారాలు చేయలేను అని.. కవితలు రాసుకుంటాను అని తేల్చి చెప్పేశాడు కదా.. అదంతా అయిపోయింది కదా..మళ్లీ ఇదంతా ఎందుకు మొదలుపెడుతున్నారు అని రాజ్ అడుగుతాడు.
Brahmamudi
వెంటనే అపర్ణ కూడా అందుకుంటుంది. ఈ అత్తా కోడళ్లు.. ఇంటిని, ఇంటిలా ఉంచడం లేదని తిడుతుంది. నీ కొడుక్కి నువ్వు చెప్పుకో ఆఫీసుకు వెళ్లమని, రావద్దని ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను.. అని అంటుంది. అక్కా.. నీ కోడలు ఏం చేస్తుందో నీకు తెలీదు అని ధాన్యలక్ష్మి అంటే... ఏం చేసింది నా కోడలు.. నీ కోడలులా.. మొగుడి పరువు తీసిందా..? ఇంట్లో వాళ్లను పుచుకు పుల్లా తీసి పారేసిందా అని అడుగుతుంది. అయితే.. కళ్యాణ్ నీ, అప్పూని మళ్లీ కలపాలని చూస్తోంది అని బాంబు పేలుస్తుంది.
Brahmamudi
ఆ మాటకు అందరూ షాకైపోతారు. అసలు విషయం ఇదా అని రుద్రాణి అనుకుంటుంది. వెంటనే స్వప్న అందుకుంటుంది. మీరు కడుపుకు అన్నం తింటున్నారా? అనుమానం తింటున్నారా? కావ్యకు అలాంటి అవసరం లేదు అని చెబుతుంది. మీ చెల్లిని అడిగితే.. నువ్వు దూరిపోతున్నావ్.. ఈ కుట్రలో నీ హస్తం కూడా ఉందా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఇక.. తనను అనడంతో.. లైఫ్, రైట్ వాయించేస్తుంది స్వప్న. తాను హస్తం పెడితే.. మీరంతా బూడిదైపోతారని వార్నింగ్ ఇస్తుంది.
Brahmamudi
అప్పుడు కావ్య... అసలు కవిగారు, అప్పూ కలుసుకుంటే.. ఇంట్లో ఉన్న నాకెలా తెలుస్తుంది అని అడుగుతుంది. కవిగారు పెళ్లి అయిన వెంటనే.. ఆయనను మర్చిపోమ్మని అప్పూకి చెప్పానని.. ఈ రోజు ఎందుకు కలిసిందో కూడా తనకు తెలీదని, కవిగారే వెళ్లి కలిసారా.. లేక.. అప్పూ వెళ్లి కలిసిందో కూడా తనకు తెలీదని కావ్య అంటుంది. వారిద్దరూ కలిసి ఉండటం మీరు చూశారా అని స్వప్న అడుగుతుంది. చూశాను అని ధాన్యం అంటుంది. మరి.. అప్పుడే వెళ్లి మీ కొడుకు ను నిలదీయవచ్చు కదా అని స్వప్న అంటుంది.
అయితే.. ఇదంతా కావ్య చేస్తున్న కుట్ర అని.. అప్పూ స్థానంలో తాను ఈ ఇంట్లోకి వచ్చానని.. ఎలాగైనా నన్ను కళ్యాణ్ కి దూరం చేసి..మళ్లీ అప్పూతో పెళ్లి చేయాలని అనుకుంటోందని అనామిక అంటుంది. నా మొగుడితో నన్ను కాపురం కూడా చేసుకోనివ్వడం లేదు అని ఆరోపిస్తుంది. వీళ్లను నోరు మూయమని వెంటనే ప్రకాశం అంటాడు. దానికి.. ధాన్యం.. అసలు ఈ కావ్య ఏం కుట్రలు చేస్తుందో మీకు తెలుసా అని అడుగుతుంది.
Brahmamudi
అప్పుడే కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి.. నీకు తెలుసా అని అడుగుతాడు. అసలు మీ అత్తాకోడళ్ల గురించి ఏం తెలుసు..? అసలు ఏం జరిగిందో, ఏంటో తెలీకుండా... ఎవరినీ ప్రశ్నించడానికి వెళ్లారు..? ఎవరింటికి వెళ్లి పెంట చేశారు..? ఎవరి కంట కన్నీరు పెట్టించారు..? అసలు మళ్లీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు..? అని కళ్యాణ్ సీరియస్ అవుతాడు. అసలు ఏం జరిగింది రా అని రాజ్ అడుగుతాడు. వీళ్లిద్దరూ కలిసి తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తున్నారు..? వీళ్ల ఏడుపు ఏదో ఏడ్వకుండా.. కావ్య వదిన వాళ్ల ఇంటికి వెళ్లి.. వాళ్ల అమ్మ, నాన్నలను కూడా నానా మాటలు అనేసి వచ్చారు అని చెబుతాడు.
Brahmamudi
నాకు క్యారెక్టర్ లేదా, అప్పూకి లేదా.. మా మధ్య స్నేహం లేదా...? వాళ్లింటికి వెళ్లి వాళ్ల కూతురిని తక్కువ చేసి ఎందుకు మాట్లాడారు..? మీకు ఆ హక్కు ఉంది? నీ కొడుకుని కాబట్టి.. నన్ను అడగొచ్చు..వాళ్లను ఎలా అడుగుతారు? అని కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. నీ భార్యగా నాకు ఆ హక్కు లేదా అని అనామిక అంటే.. దిగజారి మాట్లాడితే మా అమ్మనే ఊరుకోను.. నవ్వెంత నీ లెక్క ఎంత అని అనామికకు కళ్యాణ్ ఇచ్చిపడేస్తాడు. కళ్యాణ్ రెచ్చిపోతుంటే.. ఈ గొడవ జరుగుతుంటే.. రాహుల్, రుద్రాణిలు మాత్రం సంబరపడిపోతూ ఉంటారు.
Brahmamudi
ఇక.. అప్పూని తిట్టావా అని.. అనామికను తిడతాడు. నేను కనుక అప్పూని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే.. ఈ ఇంట్లో ఎవరూ నా ఇష్టాన్ని కాదు అనేవాళ్లు కాదు.. అది తెలీదా నీకు.. ఆలోచించవా..? కళ్యాణమండపంలో అందరి ముందు అప్పూ గుుండె పగిలి బాధపడుతున్నా.. నేను జాలిపడ్డాను తప్ప.. ఏమీ చేయలేకపోయాను. ఎందుకంటే నా కర్మ కాలి...నీ ఆకర్షణలో పడిపోయాను కాబట్టి.. ఈ జన్మకు నువ్వే నా భార్యవి అని నేను ఫిక్స్ అయ్యావ్ కాబట్టి.. అని అంటాడు.
Brahmamudi
ఇక.. కావ్య గొప్పతనం గురించి కళ్యాణ్ అద్భుతంగా మాట్లాడతాడు. తల్లిలా.. నా మంచి గురించి.. పరువు, ప్రతిష్టలు సంపాదించమని చెప్పిందని, నువ్వు పేరుకే కన్నతల్లివి.. ఎప్పుడూ ఇలా చెప్పలేదని తల్లిని కూడా గట్టిగా వాయిస్తాడు. నన్ను మా పెద్దమ్మ, నానమ్మ, పెదనాన్న, అన్నయ్యలు పెంచారు.. నీకు నీ పట్టుచీరల గోలే తప్ప.. నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావా అని నిలదీస్తున్నాడు. గొప్ప కుటుంబంలో చిచ్చు పెడుతున్నావ్.. ఆ చిచ్చుకు నా పెళ్లాం కారణం.. మీ ఇద్దరూ కలిసి.. ఇంటిని ముక్కలు చేద్దాం అనుకుంటున్నారా..? అని నిలదీస్తాడు.
Brahmamudi
పనిలో పనిగా.. ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి చురుకలు వేస్తుంది. కళ్యాణ్ మాట్లాడింది కరెక్ట్ అని.. అత్తా, కోడళ్లకు మంచిగా గడ్డిపెట్టావ్ అని కళ్యాణ్ ని మెచ్చుకుంటుంది. ప్రకాశం తర్వాత.. ధాన్యలక్ష్మిని తిట్టిని లోపలికి తీసుకువెళతాడు. కళ్యాణ్ కూడా కావ్య గురించి గొప్పగా మాట్లాడి.. అనామికను తిడతాడు. అనామిక వెళ్లిన తర్వాత అందరి ముందు కావ్యకు కళ్యాణ్ సారీ చెప్పి లోపలికి వెళ్లిపోతాడు.
Brahmamudi
రాత్రిపూట కూడా కళ్యాణ్ అదే ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య వచ్చి... మా కుటుంబానికి పేరు వచ్చేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది. మీ వల్లనే.. మీ అమ్మ, అనామికలు మాటలు అనేలా చేస్తున్నారు అని.. కళ్యాణ్ దే తప్పు అని కావ్య మాట్లాడుతుంది. కానీ.. తమది స్నేహం అని కళ్యాణ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.