Guppedantha Manasu 13th march Episode:రిషి సమక్షంలో బర్త్ డే.. వసుని ఆల్ మోస్ట్ ఇంప్రెస్ చేసేసిన మను..!

First Published | Mar 13, 2024, 8:31 AM IST

మను మాత్రం.. మీకు కచ్చితంగా నచ్చుతుందని.. నచ్చని పని చేస్తే.. మరుక్షణమే నేను ఈ కాలేజీ నుంచి వెళ్లిపోతాను అని మను అంటాడు. దీంతో.. వసుధార ఒప్పుకుంటుంది.
 

Guppedantha Manasu

Guppedantha Manasu 13th march Episode: కాలేజీలో స్టూడెంట్స్ ఇచ్చిన సర్ ఫ్రైజ్ కి వసుధారకు విపరీతంగా కోపం వస్తుంది. అదంతా మను నే చేయించాడు అనుకొని పొరపాటు పడి.. పిచ్చి తిట్లు తిడుతుంది. నీ మనసులో దురుద్దేశం ఉందని..నీకు ఎండీ సీటే కావాలా అని చాలా మాటలు అంటుంది. అయితే.. తర్వాత తన తప్పు తెలుసుకొని మనుకి క్షమాపణలు చెబుతుంది. గతంలో తమను చాలా మంది మోసం చేశారని, అందుకే అందరినీ అనుమానించాల్సి వస్తోందని చెబుతుంది. పర్వాలేదని మను అంటాడు.  అందుకే.. ఎవరినీ అంత తొందరగా జడ్జ్ చేయకూడదని మహేంద్ర.. వసుధారకు హితోపదేశం చేస్తాడు. కానీ.. తెల్లారేసరికి పరిస్థితులు మొత్తం మారిపోతున్నాయని అందుకే.. అలా అనుమానించాల్సి వస్తోందని వసుధార అంటుంది.

Guppedantha Manasu

వసుధార గిల్టీగా ఫీలౌతోంది కాబట్టి.. తాము పిలిచే ఓ చోటుకు రావాలని మను అడుగుతాడు. ఎక్కడికి అని వసు అంటుంది. మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోనవసరం లేదని, మీకు కచ్చితంగా నచ్చే ప్లేస్ కి తీసుకొని వెళ్తాను అని మను అంటాడు. అయితే.. వసు మాత్రం.. ముందే ఎక్కడికో చెబితే... నచ్చితే వస్తానని.. తీరా అక్కడకు వచ్చిన తర్వాత నచ్చకపోతే అనే అనుమానం వ్యక్తం చేస్తుంది. కానీ.. మను మాత్రం.. మీకు కచ్చితంగా నచ్చుతుందని.. నచ్చని పని చేస్తే.. మరుక్షణమే నేను ఈ కాలేజీ నుంచి వెళ్లిపోతాను అని మను అంటాడు. దీంతో.. వసుధార ఒప్పుకుంటుంది.

Latest Videos


Guppedantha Manasu

కళ్లకు గంతలు కట్టి మరీ వసుధారను బర్త్ డే సెలబ్రేషన్స్ దగ్గరకు తీసుకువస్తారు. అక్కడే శైలేంద్ర, దేవయాణి, ధరణి, ఫణీంద్ర, అనుపమ, ఏంజెల్  స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ల ఫ్యామిలీ తప్ప.. మిగిలిన వాళ్లంతా తమ ముఖాలకు రిషి ఫేస్ మాస్క్ లు వేసుకుంటారు. అది చూసి వసుధార ముఖం వెలిగిపోతుంది. అప్పటి వరకు బర్త్ డే సెలబ్రేషన్స్ వద్దు అని చెప్పి...  రిషి మాస్క్ లు చూసిన తర్వాత... మాత్రం నచ్చేస్తాయి. అయితే.. అక్కడికి రాజీవ్ కూడా.. రిషి ఫేస్ మాస్క్ వేసుకొని వస్తాడు.

Guppedantha Manasu

అయితే... ఉదయం చేసింది స్టూడెంట్స్ ప్లాన్ అని, కానీ.. ఇది తన ప్లాన్ అని మను చెబుతాడు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు..  ముఖ్యంగా రిషి సర్ తో మీరు బర్త్ డే చేసుకోవాలని అనుకున్నారు. కానీ.. ఇఫ్పటికిప్పుడు నేను రిషి సర్ ని తీసుకురాలేను కదా.. అందుకే కనీసం ఇలా అయినా రిషి సర్ మీతో ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుందని  ఇలా ప్లాన్ చేశాను అని మను చెబుతాడు. ఇది మీకు కచ్చితంగా నచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను అని మను అంటాడు.

Guppedantha Manasu

వెంటనే ఫణీంద్ర.. నీ సంతోషం కోసమే మను ఇలా చేస్తున్నాడని.. రిషి కనిపించనప్పటి నుంచి నీ ముఖంలో సంతోషం లేదు.. కనీసం ఇలా అయినా నీ ముఖంలో సంతోషం చూస్తాం అని  అంటాడు. తనకు వేరే పని ఉన్నా కూడా, నీ బర్త్ డే దగ్గరుండి చేయాలని వచ్చాను అని ఏంజెల్ అంటుంది. తర్వాత..  ధరణి.. శైలేంద్రతో మీరు కూడా మాస్క్ వేసుకుంటారా అని అడుగుతుంది. శైలేంద్ర విసుక్కుంటాడు. నిన్న పోస్టర్లు అంటించినట్లే.. ఈరోజు బర్త్ డే సెలబ్రేషన్స్ లోనూ మీ హస్తం ఉందా అని అడుగుతుంది. నువ్వు నోరు మూసుకో అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu

ఇక తర్వాత.. వసుధార గురించి గొప్పగా మాట్లాడుతూ.. మను స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ లో... అందరి పేర్లు చెబుతాడు కానీ.. శైలేంద్ర పేరు చెప్పడు. దీంతో శైలేంద్ర ఫీలౌతాడు. తర్వాత.. వసు గొప్పతనం తెలిపేలా ఒక ఏవీ ప్లే చేయాలని అనుకుంటారు. బర్త్ డే అంటే.. కేక్  కట్ చేస్తే సరిపోదా అని దేవయాణి విసుక్కుంటుంది. ఫణీంద్ర వెంటనే తిడతాడు. ఆ తర్వాత ఏవీ మొదలుపెడతారు. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏవీ మొదలౌతుంది.  తర్వాత.. ఏంజెల్ మాట్లాడుతుంది. వసు, రిషిలు మా కాలేజీని మొత్తం మార్చేశారు అని గతంలోని విషయాలను చెబుతుంది. ఈ వసుధార భజన తట్టుకోలేక దేవయాణి తల పట్టుకుంటుంది.

Guppedantha Manasu

తర్వాత.. ఫణీంద్ర, మహేంద్రలు కూడా చాలా గొప్పగా వసుధార గురించి మాట్లాడతారు. తర్వాత.. శైలేంద్ర ఏవీ వస్తుంది. అది చూసి అందరూ షాకౌతారు. శైలేంద్ర కూడా.. వసుధార గురించి పాజిటివ్ గా మాట్లాడటం విశేషం. ఇదెప్పుడు రికార్డు చేశార్రా బాబు అని శైలేంద్రే తలపట్టుకుంటాడు.  

Guppedantha Manasu

శైలేంద్ర మాటలు విని.. ధరణి సంతోషిస్తుంది. చాలా బాగా మాట్లాడారు అని మెచ్చుకుంటుంది. రాజీవ్ మాత్రం.... ఈ శైలేంద్ర మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి చేస్తున్నాడు అని తిట్టుకుంటాడు. ఈ మనుగాడు.. వసుధారను ఇంప్రెస్ చేయాలని తెగ ఆరాటపడుతున్నాడు అని కూడా అనుకుంటాడు.

Guppedantha Manasu

తర్వాత.. ఏవీ పూర్తౌతుంది. దేవయాణిని మాట్లాడమని మను అడుగుతాడు. ఈ సంతోష సందర్భంలో తనకు మాటలు రావడం లేదని దేవయాణి తప్పించుకుంటుంది. ఇంట్లో ఊరికే వాగుతూ ఉంటావు కదా.. ఇప్పుడు మాట్లాడటానికి ఏమైంది అని.. ఫణీంద్ర తిడతాడు. తర్వాత కేక్ కటింగ్ చేయిస్తారు. వసు కేక్ కట్ చేస్తుంటే.. పాప్ సెట్ తిప్పటం రాక.. ధరణి ఇబ్బందిపడుతుంటే... శైలేంద్ర హెల్ప్ చేస్తాడు. అది చూసి వసుధార కూడా షాకౌతుంది. ఇక, దేవయాణి, శైలేంద్రలు కూడా వసుకి కేక్ తినిపించాల్సి వస్తుంది. చివరకు మను ఒక్కడే మిగులుతాడు. 

Guppedantha Manasu

మను నువ్వు కూడ తినిపించు అని మహేంద్ర అనడంతో.. మను కాస్త ఇబ్బందిపడినట్లు ఫీలౌతాడు. కానీ.. కేక్ తినిపిస్తాడు. దూరం నుంచి రాజీవ్ చూసి.. నువ్వు ఎవర్రా నా మరదలికి కేక్ తినిపంచడానికి.. నీ సంగతి చెబుతా అని ఆవేశంగా లేవబోతాడు. కానీ.. ఇప్పుడు కరెక్ట్ టైమ్ కాదు అని ఆగిపోతాడు. ఇక్కడి దాకా వచ్చాను కదా.. నా డార్లింగ్ వసుకి  కేక్ తినిపించాలని అనుకుంటాడు. కానీ.. అందరూ ఒకేసారి రావడంతో... ఇలా ఒకేసారి కేక్ తినిపించొద్దు అని మను ఆపేస్తాడు. రాజీవ్ చేతిల్లో నుంచి కేక్ జారి కింద పడిపోతుంది. రాజీవ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

click me!