బిగ్ బాస్ సీజన్ 9: నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Published : Aug 30, 2025, 02:44 PM IST

Nagarjuna: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం హీరో అక్కినేని నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు? బిగ్‌బాస్ నిర్వాహకులు కింగ్ నాగ్‌తో ఎన్ని కోట్లకు డీల్ ఫిక్స్ చేసుకున్నారనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 

PREV
15
సరికొత్త కాన్సెప్ట్ తో బిగ్ బాస్ 9

Bigg Boss Telugu 9: తెలుగు బుల్లితెర చరిత్రలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటి వరకు ఈ రియాలిటీ హై టీఆర్పీతో 8 సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసింది. తెలుగు ప్రేక్షకుల మదిలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సాధారణ ప్రేక్షకులను ఎంపిక చేసే "బిగ్‌బాస్ అగ్నిపరీక్ష" అనే మినీ షో ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. ఈ సారి మరింత ఎంటర్‌టెయిన్మెంట్‌తో బిగ్‌బాస్ హౌస్ సిద్ధమవుతుంది. ఈ సారి కూడా హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రత్యేక ఆకర్షణ నిలువబోతున్నారు.

25
కంటెస్టెంట్లకు 'అగ్నిపరీక్ష'

బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోకు లక్షాలాది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. కింగ్ నాగార్జున హోస్టింగ్ కు సెపరేట్‌ వ్యూయర్‌షిప్ ఉందంటే.. అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పటి వరకు నిర్వహించిన ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం సీజన్ 9 కోసం సిద్ధమవుతోంది. తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వాహకులు ప్రారంభించారు. అయితే ఈసారి కాస్త భిన్నంగా ఎంపిక జరుగుతోంది. కేవలం ఆడిషన్స్ మాత్రమే కాకుండా, కంటెస్టెంట్స్‌ను అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రత్యేక ఎంపిక ప్రక్రియను కూడా టెలికాస్ట్ చేయబోతుండటం విశేషం.

35
డబుల్ హౌస్ – డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్!

ఇటీవల విడుదలైన ప్రోమోలో హోస్ట్ కింగ్ నాగార్జున స్వయంగా “డబుల్ హౌస్ – డబుల్ డోస్” అంటూ చెప్పడంతో రాబోయే సీజన్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గత 8 సీజన్ల నుంచి కంటెస్టెంట్స్ ఒకే హౌస్‌లో ఉంటే, ఈసారి మాత్రం రెండు హౌస్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు థీమ్‌ను ప్రకటించారు.

ఈ వినూత్న కాన్సెప్ట్‌తో ఈసారి షో పూర్తిగా ఎంటర్‌టైనింగ్, ఎక్సైటింగ్ గా ఉండబోతుందని బిగ్ బాస్ టీమ్ హైప్స్ పెంచేస్తున్నాయి. మరింత ప్రత్యేకత ఏమిటంటే.. ఇప్పటివరకు ఈ షోలో కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనేవారు. కానీ, మొదటి సారిగా కామన్ పీపుల్స్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో కంటెస్టెంట్స్‌గా ఎవరు రాబోతున్నారు? ఎవరు డబుల్ హౌస్‌లో సర్వైవ్ అవుతారు? అనే ఆసక్తి బిగ్ బాస్ లవర్స్ లో ఉంది.

45
"చదరంగం కాదు... రణరంగమే!"

ఇక బిగ్ బాస్ మూడో సీజన్‌ నుంచి ఎనిమిదో సీజన్‌ వరకు అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా 9వ సీజన్ కూడా కింగ్ నాగ్ హోస్టింగ్‌ చేయబోతున్నారు. నాగార్జున తన ప్రత్యేక స్టైల్, వేరియేషన్స్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హోస్ట్‌గా ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో "చదరంగం కాదు... రణరంగమే!" అంటూ షోపై అంచనాలను రెట్టింపు చేశారు. ఈ రియాలిటీ షోకు ఇంతకీ ఫేమ్ తీసుకవచ్చిన కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు? బిగ్‌బాస్ నిర్వాహకులు కింగ్ నాగ్‌కి ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్‌ ఇవ్వబోతున్నారనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

55
నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ రియాలిటీ షోకు కింగ్ నాగార్జున ప్రత్యేక గుర్తింపు తీసుకవచ్చారు. బిగ్ బాస్ అంటే నాగార్జున… నాగార్జున అంటే బిగ్ బాస్ అన్నట్లు ప్రేక్షకుల్లో ఇమేజ్ ఏర్పడింది. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జున భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు టాక్. గత ఏడాది 8వ సీజన్ కోసం హీరో నాగార్జున దాదాపు రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇక తాజా 9వ సీజన్‌కు సంబంధించి కింగ్ నాగ్ రెమ్యునరేషన్ మరింత పెరిగిందని టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ కోసం నాగార్జున దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు తీసుకోబోతున్నట్టు టాక్. తెలుగు టెలివిజన్ హిస్టరీ లో రియాలిటీ షో కోసం ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకోవడం నిజంగా హాట్ టాపిక్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories