మరో షాకింగ్ ఎలిమినేషన్, ఓటింగ్ లో వెనుకబడ్డ క్రేజీ కంటెస్టెంట్, ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే?

First Published | Sep 26, 2024, 10:49 AM IST

బిగ్ బాస్ హౌస్ నుండి ఓ క్రేజీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారట. ఓటింగ్ లో వెనకబడ్డ ఆ కంటెస్టెంట్ ఇంటిని వీడటం ఖాయం అంటున్నారు. 
 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై నాలుగు వారాలు అవుతుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 1న ఈ రియాలిటీ షో గ్రాండ్ గా లాంచ్ చేశారు. మొదటి వారం సోషల్ మీడియా స్టార్ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. 
 

రెండో వారం షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. శేఖర్ బాషాను తోటి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేశారు. ఆదిత్య ఓం, శేఖర్ బాషా లలో ఎవరు బయటకు వెళ్లాలో నిర్ణయించాలని హౌస్ మేట్స్ ని నాగార్జున అడిగారు. మెజారిటీ హౌస్ మేట్స్ శేఖర్ బాషాకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఎలిమినేట్ కావల్సి వచ్చింది. 

ఇక మూడో వారం నటుడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. అభయ్ నవీన్ మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చితే పాప్యులర్ యాక్టర్. పలు హిట్ చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటించాడు. అభయ్ హౌస్లో ఎలాంటి ప్రత్యేకత చాటుకోలేదు. బిగ్ బాస్ పై విమర్శలు గుప్పించడం కూడా అభయ్ కి మైనస్ అయ్యింది. సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అభయ్ అనూహ్యంగా బిగ్ బాస్ ఇంటిని వీడాడు. 


నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ వాడి వేడిగా సాగింది. నాగ మణికంఠ, నబీల్, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, సోనియా, ప్రేరణ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ గా ఉంటాయి. ఓటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రజెంట్ ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే... ఓ క్రేజీ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉందట. 

మెజారిటీ మీడియా సంస్థల అనధికారిక పోల్స్ ప్రకారం.. నబీల్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాడట. ఆయనకు ఎక్కువ ఓట్లు పడ్డాయట. నబీల్ కేవలం సోషల్ మీడియా సెలబ్రిటీ. హౌస్లో అడుగుపెట్టే వరకు నబీల్ ఎవరో బుల్లితెర ఆడియన్స్ కి తెలిసింది లేదు. అయినప్పటికీ ప్రేక్షకులు అతడికి ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది.
 

నబీల్ తర్వాత రెండో స్థానంలో నాగ మణికంఠ ఉన్నాడట. మొదట్లో నాగ మణికంఠ సింపతీ గేమ్ ఆడుతున్నాడనే అపవాదు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురయ్యాడు. నాగ మణికంఠలో కొన్ని లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ ఫిజికల్ టాస్క్ లలో గట్టిగా పోరాడుతున్నాడు.  స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడుతూ.. డిపెండ్ చేసుకుంటున్నాడు. 

ఆదిత్య ఓం మూడో స్థానంలో, ప్రేరణ నాలుగో స్థానంలో ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో పృథ్విరాజ్, సోనియా ఉన్నారట. తాజా సమీకరణాల ప్రకారం ఈ వారం సోనియా ఎలిమినేట్ కానుంది. సోనియా పై ప్రేక్షకుల్లో అత్యంత నెగిటివిటీ ఉంది. నిఖిల్, పృథ్విరాజ్ లతో ఆమె ప్రవర్తన తీరు నచ్చడం లేదు. ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్న భావన ప్రేక్షకుల్లో ఉంది. 
 

Bigg boss telugu 8

మొదటి వారం నామినేషన్స్ లో ఉన్న సోనియా.. రెండు, మూడు వారాల్లో నామినేషన్స్ లో లేదు. నాలుగో వారం ఆమె నామినేట్ అయ్యింది. ఈసారి ప్రేక్షకులు ఆమెను ఇంటి నుండి బయటకు పంపాలని డిసైడ్ అయ్యారు. సోనియా కాంట్రవర్సీ కంటెస్టెంట్ అయినప్పటికీ.. కంటెంట్ ఇస్తుంది. కాబట్టి ఆమె ఎలిమినేట్ అవుతుందని చెప్పలేం. 

అనధికారిక ఓటింగ్ లో సోనియా వెనకబడింది. అధికారిక ఓటింగ్ స్టార్ మా వెల్లడించదు. అనధికారిక ఓటింగ్ ఫలితాలు చాలా సందర్భాల్లో ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఈ వారం సోనియా ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని చెప్పలేం. ప్రత్యేక చాటుకోవడం లో విఫలం చెందిన ఆదిత్య ఓం ని ఇంటికి పంపుతారనే వాదన కూడా ఉంది. 

కాబట్టి నాలుగో వారం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్ళేది ఎవరనేది సస్పెన్సు. ప్రస్తుతం హౌస్లో 11 మంది ఉన్నారు. 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో చెప్పారు. టాస్క్ లలో విజయం సాధించడం ద్వారా ఇంటి సభ్యులు వైల్డ్ కార్డు ఎంట్రీల సంఖ్య తగ్గించవచ్చు. బిగ్ బాస్ ఫిట్టింగ్ తో వైల్డ్ కార్డు ఎంట్రీల వ్యవహారం ఆసక్తికరంగా మారింది.. 

బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్స్, పోల్స్ ఇక్కడ చూడండి

Latest Videos

click me!