లావణ్య గుట్టు బయటపెట్టిన నిహారిక, వదిన ఇంట్లో చేసేసి ఇదే, నాకైతే పిచ్చెక్కుతుంది అంటూ!

First Published | Sep 24, 2024, 8:28 AM IST

వదిన లావణ్య త్రిపాఠి పర్సనల్ మేటర్ లీక్ చేసింది నిహారిక. వరుణ్ తేజ్ భార్య ఇంట్లో ఏం చేస్తుందో పబ్లిక్ గా చెప్పేసింది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన లావణ్య త్రిపాఠి అనతి కాలంతో ఫేమ్ తెచ్చుకుంది. సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. 

Lavanya Tripathi

ఈ యూపీ భామ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది. మిస్టర్ మూవీలో వరుణ్-లావణ్య మొదటిసారి జతకట్టారు. ఆ మూవీ సెట్స్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఐదేళ్లకు పైగా వీరిద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. వరుణ్-లావణ్య రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు వచ్చినప్పటికీ ఖండించారు. 

గత ఏడాది నిశ్చితార్థం అంటూ సడన్ గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 2023 నవంబర్ 5న ఇటలీ దేశంలో లావణ్య-వరుణ్ తేజ్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి మెగా హీరోలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వివాహమయ్యాక లావణ్య నటనకు దూరమైంది. ప్రస్తుతం ఆమె ఇంటికే పరిమితం అవుతున్నారు. 


ఇక లావణ్య ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో లావణ్య మరదలు నిహారికను ఈ విషయం అడిగారు. సోషల్ మీడియా చాట్ లో లావణ్య సంగతులు చెప్పాలని అభిమానులు కోరగా.. ఆసక్తికర విషయాలు వెల్లడించింది. లావణ్య 24 గంటలు ఇంట్లోనే ఉంటారట. ఏదైనా పని ఉంటే తప్పితే బయటకు రారట. 

నేనైతే ఇంట్లో ఒక గంట కూడా ఉండలేను. పిచ్చి లేస్తుంది. మా వదిన లావణ్య ఇంటికే ఎలా పరిమితం అవుతుందో అర్థం కాదని నిహారిక అన్నారు. అలాగే తమ ఇంట్లో వంట చేసే బాధ్యత లావణ్యదే నట. కుటుంబ సభ్యుల కోసం రుచికరమైన భోజనం ప్రతిరోజూ లావణ్య తయారు చేస్తుందట. నిహారిక మాటలు విన్నాక.. లావణ్యను నెటిజెన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 
 

Niharika Konidela

ఇటీవల లావణ్య తల్లి అయ్యారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. దీనిపై నాగబాబు ఫ్యామిలీ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దాంతో లావణ్య గర్భం దాల్చారన్న వార్తల్లో నిజమెంతో తెలియదు. లావణ్య చివరిగా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించారు. వివాహం అనంతరం లావణ్య చేసిన ఏకైన ప్రాజెక్ట్ ఇది. 

మరోవైపు నిహారిక నిర్మాతగా, నటిగా రాణించే ప్రయత్నం చేస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు మంచి విజయం అందుకుంది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించి, భారీ లాభాలు రాబట్టింది. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక.. యంగ్ డైరెక్టర్స్, రైటర్స్, నటులతో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తుంది. 

Niharika Konidela

కాగా నిహారిక భర్త వెంకట చైతన్యతో విడిపోయింది. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. కమ్ బ్యాక్ ఇచ్చిన నిహారిక కెరీర్ పై దృష్టి పెట్టింది. గతంలో నిహారిక ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. సైరా నరసింహారెడ్డిలో గెస్ట్ రోల్ చేసింది. 

Niharika Konidela

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత సైతం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె నిర్మాతగా చిత్రాలు చేస్తుంది. చిరంజీవి-కళ్యాణ్ కృష్ణ కాంబోలో సుస్మిత నిర్మించాల్సిన ప్రాజెక్ట్ రద్దు అయ్యింది. ఇది రీమేక్ కావడంతో చిరంజీవి పక్కన పెట్టేశాడు.. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
 

Latest Videos

click me!