స్టెప్ ఫాదర్ పై నాగ మణికంఠ ఆరోపణలు, ఆయన అలాంటి వాడు కాదంటూ సంచలన నిజాలు బయట పెట్టిన సొంత చెల్లి!

First Published | Sep 4, 2024, 7:18 PM IST

నామినేషన్స్ ప్రక్రియలో శేఖర్ బాషా-నాగ మణికంఠ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టెప్ ఫాదర్ వలన అవమానాలు ఎదుర్కొన్నానని మణికంఠ అన్నాడు. అయితే మా నాన్న మంచివాడంటూ మణికంఠ చెల్లెలు నోట్ విడుదల చేయడం సంచలనంగా మారింది.. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదటి వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి సోమవారం మొదలయ్యే నామినేషన్స్ ప్రక్రియ చాలా కీలకం. హౌస్ నుండి ఎవరిని బయటకు పంపాలనేది కంటెస్టెంట్స్ ఓట్ల ద్వారా తెలియజేశారు. మెజారిటీ కంటెస్టెంట్స్ చేత నామినేట్ చేయబడిన కంటెస్టెంట్స్ నామినేషన్స్ లిస్ట్ లో ఉంటారు. వారిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. 

అందుకే కంటెస్టెంట్స్ నామినేట్ కాకూడదని కోరుకుంటారు. నామినేషన్స్ జరిగేటప్పుడు కంటెస్టెంట్స్ కంట్రోల్ తప్పుతుంటారు. కోపం,  ఆవేశం, ఆవేదనలు చోటు చేసుకుంటాయి. సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా మొదటి వికెట్ ఎవరిదనే చర్చ మొదలైంది. 
 

నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగుతుంది. శేఖర్ బాషా-నాగ మణికంఠ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నావని మణికంఠ పై శేఖర్ బాషా ఆరోపణలు చేశాడు. ఈ కామెంట్స్ కి హర్ట్ అయిన నాగ మణికంఠ... జీవితంలో తాను పడ్డ కష్టాలు గుర్తు చేసుకున్నాడు.


నా బాల్యంలోనే కన్న తండ్రి మరణించాడు. తల్లి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. సవతి తండ్రి వలన ఎన్నో కష్టాలు పడ్డాను. అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది. తల్లి శవాన్ని దహనం చేయడానికి కట్టెలు కొనే స్తోమత లేక డబ్బుల కోసం అడుక్కున్నాను... అంటూ నాగ మణికంఠ కన్నీరు పెట్టుకున్నాడు. నాగ మణికంఠ మాటలకు  తోటి కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అయ్యారు. 

నాగ మణికంఠ కామెంట్స్ పై ఆయన స్టెప్ సిస్టర్ స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేసింది. అమ్మ మరణం తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనేది మణికంఠ సొంత నిర్ణయం. నాన్న మాత్రం ఎప్పుడూ సపోర్టివ్ గా ఉన్నారు. నాగ మణికంఠ మాటల వెనుక ఆంతర్యం కూడా నాన్న చెడ్డవాడు అని కాదు. 

Bigg Boss Telugu 8

తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ప్రతి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. మా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని, ఎవరూ నెగిటివ్ కామెంట్స్ చేయకండి. దయచేసి మా అన్నయ్యకు సపోర్ట్ చేయండి. మణికంఠ టైటిల్ విన్నర్ అయ్యేందుకు సహకరించండి.. అని నాగ మణికంఠ చెల్లెలు కావ్య అమర్ నాథ్ రాసుకొచ్చింది. నాగ మణికంఠ సిస్టర్ ఎమోషనల్ నోట్ వైరల్ అవుతుంది.

నాగ మణికంఠ వివరాలు పరిశీలిస్తే...  నటుడు కావాలనే కోరికతో నాగ మణికంఠ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేశాడు. సోషల్ మీడియాలో నాగ మణికంఠకు మంచి ఫాలోయింగ్ ఉంది. నాగ మణికంఠ 'ప్రియ స్వాగతం కృష్ణ' అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సిరీస్ ఆడియన్స్ ని మెప్పించింది. ఇంస్టాగ్రామ్ లో నాగ మణికంఠను లక్షకు పైగా నెటిజెన్స్ ఫాలో అవుతున్నారు. 

Bigg boss telugu 8

బిగ్ బాస్ షోకి రావడం ద్వారా తనకు మరికొంత ఫేమ్ దక్కుతుందని భావిస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉన్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గా కిరాక్ సీత, బెజవాడ బేబక్క, యాష్మి గౌడ, యాక్టర్ నిఖిల్, ఆర్జే శేఖర్ బాషా, నైనిక, నటుడు అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, ప్రేరణ, నబీల్, విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చారు. వీరితో నాగ మణికంఠ జాయిన్ అయ్యాడు. 

ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!