బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి మాజీ కంటెస్టెంట్లు, శోభా శెట్టి యాంకర్‌ రవి పేర్లు తెరపైకి ?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో మరో సర్‌ప్రైజ్‌ చోటు చేసుకోబోతుంది. ఈ సారి వైల్డ్ కార్డ్ ద్వారా మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. ఒక్కో సీజన్‌ నుంచి ఒక్కరు రాబోతున్నారని టాక్‌.  
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్లతో ఈ సీజన్‌ గ్రాండ్‌గానే ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఈ సారి ట్విస్ట్ లు, టర్న్ లు చాలానే ఉన్నాయి.

దాన్ని షో ప్రారంభం నుంచే చూపించారు. ఈ సారి హౌజ్‌ని ప్రకృతిని ప్రతిబింబించేలా రూపొందించారు. హౌజ్‌లోని ప్రతిదీ ఓ కాన్సెప్ట్ ప్రకారం డిజైన్‌ చేయడం విశేషం. 
 

అంతేకాదు చాలా ట్విస్ట్ లు కూడా పెట్టారు. అదే సందర్భంలో మూడు బ్యాడ్ న్యూస్‌లు కూడా చెప్పారు. ఈ సారి హౌజ్‌లో కెప్టెన్ ఉండడని చెప్పారు నాగ్‌. దానికి బదులు చీఫ్‌లను తీసుకొచ్చారు. ముగ్గురు చీఫ్‌లను చేశారు. రెండోది రేషన్‌ ఉండదని. అంటే దాన్ని గెలుచుకోవాలి.

అన్‌లిమిటెడ్‌గా గెలుచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు విన్నర్‌కి ప్రైజ్‌ మనీ జీరో అని. అంటే దాన్ని కూడా గెలుచుకోవాలి. యాభై లక్షల వరకు ఎంత అయినా గెలుచుకోవచ్చు అనేది ఈ సీజన్‌లో చేసిన మార్పులు. 

దీంతోపాటు మరో మార్పు ఉంది. ఈ సారి కంటెస్టెంట్లని జంటలుగా తీసుకొచ్చారు. పరిచయం చేయడం ఒక్కరిగానే చేసి, హౌజ్‌లోకి మాత్రం జంటలుగానే పంపించారు. ఆట మాత్రం కలిసే ఆడారు. నామినేషన్ విషయంలో మాత్రం రెగ్యూలర్‌గానే సాగుతుంది.

అయితే నామినేషన్స్ వేసిన వారిలో ఎవరిని నామినేషన్‌లో ఉంచాలి, ఎవరిని ఉంచొద్దు అనేది ముగ్గురు చీఫ్‌లు నిర్ణయిస్తారు. అదేలా అనేది నేడు తేలనుంది. 
 


ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే వచ్చారు. మిగిలిన వాళ్లు వైల్డ్ కార్డ్ ద్వారా మధ్యలో ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సారి ఏడుగురుని హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట.

ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే వారిలో మాజీ కంటెస్టెంట్లు ఉంటారని తెలుస్తుంది. ఒక్కో సీజన్‌ నుంచి ఒక్కొక్కరిని మళ్లీ ఈ సీజన్‌ని తీసుకురావాలనేది బిగ్‌ బాస్‌ నిర్వహకులు ప్లాన్‌. వాళ్లు ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 
 

Shobha shetty

వీరిలో ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి. గత సీజన్‌లో రచ్చ చేసిన శోభా శెట్టిని మరోసారి హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట. సీనియల్స్ ద్వారా ఫేమస్‌ అయిన శోభా శెట్టి గత సీజన్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా నిలిచింది. ఆల్మోస్ట్ ఫైనల్‌ వరకు ఉంది.

ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ టీమ్‌ ఆమెని అప్రోచ్‌ అయినట్టు సమాచారం. ఆమె నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందా అనేది తెలియాల్సి ఉంది. 

Bigg Boss Telugu

ఆమెతోపాటు యాంకర్‌ రవి పేరు కూడా వినిపిస్తుంది. యాంకర్ గా పాపులర్‌ అయిన రవి.. బిగ్‌ బాస్‌ తెలుగు 6 లో కంటెస్టెంట్‌గా వచ్చి ఆకట్టుకున్నాడు. అయితే బిగ్‌ బాస్‌కి వచ్చాక రవి కెరీర్‌ అంత బాగా సాగలేదు. చిన్న చిన్న షోస్‌ చేస్తూ నెట్టుకొస్తున్నాడు.

ఈ నేపథ్యంలో బీబీ టీమ్‌ ఆయన్ని మరోసారి అప్రోచ్‌ అయ్యారట. కానీ రవి తిరస్కరించినట్టు తెలుస్తుంది. సోషల్‌ మీడియాలో ఈ విషయం చక్కర్లు కొడుతుంది. 
 

వీరితోపాటు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వారిలో రీతూ చైదరి కూడా ఉందట. అలాగే సీరియల్‌ నటుడు ముకేష్‌ కూడా రాబోతున్నాడని సమాచారం. మరి ఎవరెవరు వస్తారనేది తెలియాల్సి ఉంది. నాలుగైదు వారాల తర్వాత ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని, దీనికి సెపరేట్‌గా ఓ ఈవెంట్‌ కూడా ఉంటుందని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. 

ప్రస్తుతం హౌజ్‌లో యష్మి గౌడ, ప్రేరణ, నైనికా, కిర్రాక్‌ సీత, బెజవాడ బేబక్క, నిఖిల్‌, నాగ మణికంఠ, పృథ్వీరాజ్‌, అభయ్‌ నవీన్‌, అఫ్రిదీ, శేఖర్‌ బాషా, ఆదిత్య ఓం ఉన్నారు. 

Latest Videos

click me!