అతడిపై మనసు పడ్డ విష్ణుప్రియ, ప్రేమించమని వేడుకున్న స్టార్ యాంకర్!

First Published | Sep 4, 2024, 5:14 PM IST

మొదటి వారం కూడా ముగియలేదు. విష్ణుప్రియ హౌస్లో లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది. ఆ మేల్ కంటెస్టెంట్ కి సేవలు చేస్తూ ప్రేమించమని వేడుకుంటుంది.

Vishnupriya Bhimeneni


విష్ణుప్రియ భీమినేని బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టాప్ సెలబ్రిటీ. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ఆమెకు భారీ ఫేమ్, పాపులారిటీ ఉంది. ఈ సీజన్ కి ఆమె హైయెస్ట్ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందట. విష్ణుప్రియకు వారానికి రూ. 4 లక్షలు చెల్లిస్తున్నారని అంచనా. విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరు అనడంలో సందేహం లేదు. 

విష్ణుప్రియ యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె కామెడీ వీడియోస్,షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఈటీవీలో ప్రసారమైన పోవే పోరా షోతో యాంకర్ గా ఫేమ్ రాబట్టింది. ఈ యూత్ఫుల్ గేమ్ షోలో సుడిగాలి సుధీర్ తో పాటు ఆమె సందడి చేసింది. 

బిగ్ బాస్ తెలుగు 8 ఏసియానెట్ పోల్
 

Vishnupriya Bhimeneni

విష్ణుప్రియ-రీతూ చౌదరి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి ఎంపికయ్యారంటూ ప్రచారం జరిగింది. రీతూ చౌదరి పేరు ప్రముఖంగా వినిపించింది. విష్ణుప్రియ మాత్రమే బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది. విష్ణుప్రియ టైటిల్ కోసం ప్రణాళికాబద్ధంగా వెళుతుంది. వారం గడవక ముందే ప్రేమకథ షురూ చేసింది. 

మేల్ కంటెస్టెంట్స్ తో విష్ణుప్రియ సన్నిహితంగా ఉంటుంది. నాగ మణికంఠతో పులిహోర కలిపిన విష్ణుప్రియ... తాజాగా సీరియల్ నటుడు పృథ్విరాజ్ కి నేరుగా వల విసిరింది. పృథ్విరాజ్ కి సేవలు చేస్తుంది. కిచెన్ లో పృథ్విరాజ్ కి కాఫీ తయారు చేసి ఇచ్చిన విష్ణుప్రియ ''నీకు సేవలు చేస్తున్నాను .. నన్ను ప్రేమించొచ్చుగా'' అని అడిగింది. ''ఏంటి కాఫీ ఇచ్చినందుకు ప్రేమించేస్తారా?'' అని పృథ్విరాజ్ అన్నాడు. 
 


Vishnupriya Bhimeneni


ఓ అబ్బాయిని ప్రేమించమని నేరుగా అడిగిన విష్ణుప్రియ తీరు చర్చకు దారి తీసింది. బిగ్ బాస్ షోలో ప్రేమజంటలకు మంచి మైలేజ్ ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఆ సీజన్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ నటి పునర్నవి భూపాళంతో లవ్ ట్రాక్ నడిపాడు. వీరిద్దరి రొమాంటిక్ డ్రామా సూపర్ హిట్. ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. 
 

సీజన్ 4లో అఖిల్ సార్థక్-మోనాల్ గజ్జర్ సీరియస్ గా ప్రేమలో పడ్డారు. మోనాల్ అయితే అఖిల్ కోసం త్యాగాలు చేసింది. ఆ సీజన్ విన్నర్ అభిజీత్ మొదట్లో మోనాల్ కి ట్రై చేశాడు. కానీ ఆమె అఖిల్ కి కనెక్ట్ అయ్యింది. దాంతో అలేఖ్య తో సరిపెట్టుకున్నాడు. అభిజీత్ పై అలేఖ్య చాలా ఇంట్రెస్ట్ చూపింది.

Bigg Boss Telugu 7

సీజన్ 5లో షణ్ముఖ్ జస్వంత్-సిరి హన్మంత్ స్నేహం ముసుగులో ప్రేమాయణం సాగించారు. ఇద్దరి మధ్య ముద్దులు, హగ్గులు, గిల్లికజ్జాలు తరచుగా చోటు చేసుకునేవి. సీజన్ 6లో ఇనాయ సుల్తానా-ఆర్జే సూర్య లవ్ ట్రాక్ సైతం హైలెట్ అయ్యింది. బిగ్ బాస్ షోలో జంటలుగా మారిన కంటెస్టెంట్స్, పది వారాలకు పైగా హౌస్లో ఉన్నారు. కొందరు ఫైనల్ కి వెళ్లారు. టైటిల్స్ కొట్టారు. 

Vishnupriya Bhimeneni

అయితే బిగ్ బాస్ షోలో ప్రేమలో పడ్డ ఏ జంట బయటకు వచ్చాక దాన్ని కొనసాగించలేడు. కేవలం సెన్సేషన్ కోసమే ప్రేమికులుగా నటించారేమో అనే భావన కలుగుతుంది.   ప్రస్తుతం విష్ణుప్రియ సైతం ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది. విష్ణుప్రియ-పృథ్విరాజ్ బిగ్ బాస్ తెలుగు 8 లవర్స్ గా అవతరిస్తారేమో చూడాలి.. 

Latest Videos

click me!