Bigg Boss Telugu 7 Top 5 : బిగ్ బాస్ తెలుగు 7 టాప్ 5 వీళ్ళే... ఆ లీక్ తో ఫుల్ క్లారిటీ!

First Published | Dec 4, 2023, 6:26 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఫైనల్ కి వెళ్ళేది ఎవరు? టైటిల్ కొట్టేది ఎవరు? అనే చర్చ మొదలైంది. ఈ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్ కాగా ఫైనల్ కంటెస్టెంట్స్ పై అవగాహన వచ్చేసింది. 
 

Bigg Boss Telugu 7

ఈ వారం హౌస్ నుండి గౌతమ్ కృష్ణ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. శోభ-గౌతమ్ డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిలో శోభ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 13 వారాలు హౌస్లో ఉన్న గౌతమ్ జర్నీ ముగిసింది. 
 


ప్రస్తుతం హౌస్లో శివాజీ, అమర్, ప్రశాంత్, యావర్, అర్జున్, శోభ, ప్రియాంక ఉన్నారు. ఈ 7గురు కంటెస్టెంట్స్ లో ఐదుగురు ఫైనల్ కి వెళతారు. కాగా అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచాడు. బిగ్ బాస్ తెలుగు 7 ఫస్ట్ ఫైనలిస్ట్ గా బెర్త్ ఖరారు చేసుకున్నాడు. మిగిలిన ఆరుగురు పోటీపడాల్సి ఉంది. 


Bigg Boss Telugu 7

సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అర్జున్ ని నామినేట్ చేయడానికి వెళ్ళేదు. కాబట్టి అర్జున్ నామినేషన్స్ లో ఉండడు. ఇక వాడివేడిగా నామినేషన్స్ ముగిశాయని సమాచారం. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయ్యింది. 

Bigg Boss Telugu 7

అర్జున్ మినహాయించి మిగతా ఆరుగురు నామినేట్ అయ్యారని తెలుస్తుంది. కాబట్టి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. మిగతా నలుగురు ఫైనల్ కి వెళతారు. అర్జున్ ఫినాలే అస్త్ర గెలువకుంటే లెక్కలు వేరుగా ఉండేవి. అతడు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడు. అర్జున్ ఫైనల్ కి వెళ్లడం వలన ప్రియాంక, శోభ, యావర్ లలో ఇద్దరిపై వేటు పడనుంది. 
 

శివాజీ, పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా ఫైనల్ లో ఉంటారు. అమర్ కూడా 100 శాతం ఫైనల్ కి వెళతాడు అనడంలో సందేహం లేదు. ప్రియాంక, యావర్, శోభలలో ఇంటికి వెళ్ళేది ఎవరిని అంచనా వేయడం సులభమే. యావర్ ని వచ్చే వారం ఎలిమినేట్ చేసి, శోభను మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయవచ్చు. దాంతో ప్రియాంక ఫైనల్ కి వెళుతుంది. 

Bigg Boss Telugu 7

కాబట్టి ప్రశాంత్, శివాజీ, అమర్, అర్జున్, ప్రియాంక ఫైనల్ కి వెళ్లనున్నారు. వీరిలో టైటిల్ ఒకరి సొంతం అవుతుంది. విన్నర్ రూ. 50 లక్షల ప్రైజ్ మనీ, రూ. 15 లక్షల విలువైన జ్యువెలరీ, మారుతీ సుజుకీ బ్రీజా కారు బహుమతులుగా పొందుతారు. 

Bigg Boss Telugu 7: చివరి నామినేషన్స్... ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఫైనల్ కి వెళ్ళేది ఎవరు?

Latest Videos

click me!