Bigg Boss Telugu 7: గౌతమ్ రెమ్యూనరేషన్ లీక్... 13 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా!

Published : Dec 04, 2023, 11:10 AM IST

గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ షో జర్నీ ముగిసింది. 13 వారాలు హౌస్లో ఉన్న గౌతమ్ గుడ్ బై చెప్పేశాడు. గౌతమ్ రెమ్యూనరేషన్ లీక్ అయ్యింది. ఆయన ఎన్నికలు తీసుకున్నారో చూద్దాం...   

PREV
17
Bigg Boss Telugu 7: గౌతమ్ రెమ్యూనరేషన్ లీక్... 13 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా!
Bigg Boss Telugu 7

గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరు. గౌతమ్ యాక్టర్ కమ్ డాక్టర్. అతని జర్నీని గమనిస్తే... గౌతమ్ తోటి కంటెస్టెంట్ యావర్ పై చేసిన పర్సనల్ కామెంట్స్ విమర్శల పాలయ్యాయి. యావర్ బాడీ స్టెరాయిడ్స్ తో వచ్చింది, నాది నాచురల్ బాడీ అని గౌతమ్ కామెంట్ చేశాడు. ఈ విషయంలో నాగార్జున సారీ చెప్పించడంతో పాటు చివాట్లు పెట్టాడు. 

 

27
Bigg Boss Telugu 7

గౌతమ్ హౌస్లో లవ్ ట్రాక్ నడిపే ప్రయత్నం చేశాడు. శుభశ్రీతో పులిహోర కలిపి లైన్లో పెట్టాలని చూశాడు. శుభశ్రీ కూడా గౌతమ్ అంటే ఇంట్రెస్ట్ చూపింది. అయితే ఆమె ఎప్పుడూ బయటపడలేదు. గౌతమ్ తో రిలేషన్ ముందుకు తీసుకెళ్లలేదు. రిలేషన్ డెవలప్ అవుతుందనుకునే లోపు 5వ వారం శుభశ్రీ ఎలిమినేట్ అయ్యింది. 

37
Bigg Boss Telugu 7

అదే వారం గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. అయితే నాగార్జున సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. గౌతమ్ ని సీక్రెట్ రూమ్ కి పంపాడు. దాదాపు 30 గంటలకు పైగా గౌతమ్ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. నామినేషన్స్ డే రోజు సప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. అశ్వద్ధామ 2.0 అంటూ భారీ డైలాగ్స్ కొట్టాడు.
 

 

47

రీ ఎంట్రీ అనంతరం తానేమిటో చూపుతాను అన్నాడు. ప్రియాంకతో గౌతమ్ సిస్టర్ రిలేషన్ మైంటైన్ చేశాడు. సీరియల్ బ్యాచ్ తో సన్నిహితంగా ఉండేవాడు. శివాజీ బ్యాచ్ అంటే పెద్దగా పడదు. నామినేషన్స్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ లతో ఫైట్స్ అవుతూ ఉండేవి. 

57

ప్రియాంక కారణంగా గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. ఫినాలే అస్త్ర రేసు నుండి తప్పుకున్న గౌతమ్ తన పాయింట్స్ పల్లవి ప్రశాంత్, అర్జున్, అమర్ లలో ఒకరికి ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అమర్ కే ఇవ్వాలని ప్రియాంక అతని నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఈ విషయంలో నాగార్జున క్లాస్ పీకాడు. 

 

67

మొత్తంగా గౌతమ్ జర్నీ 13వ వారం ముగిసింది. శోభ, గౌతమ్ డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిలో గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. గౌతమ్ స్టేజ్ పైకి వెళ్ళిపోయాడు. కాగా గౌతమ్ రెమ్యూనరేషన్ లీకైంది. అతడు ఎంత తీసుకున్నాడో తెలియజేస్తూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 

77
Bigg Boss Telugu 7

గౌతమ్ వారానికి రూ.1.5 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టారట. ఆ లెక్కన గౌతమ్ రూ. 19.5 లక్షలు తీసుకున్నాడట. గౌతమ్ కి రెమ్యూనరేషన్ గట్టిగానే దక్కింది. రెమ్యునరేషన్ అటుంచితే... గౌతమ్ కి మంచి ఫేమ్ దక్కింది. అతడు నటుడిగా బిజీ అయ్యే సూచనలు కలవు... 
 

Read more Photos on
click me!

Recommended Stories