Bigg Boss Telugu 7: చివరి నామినేషన్స్... ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఫైనల్ కి వెళ్ళేది ఎవరు?

Published : Dec 04, 2023, 01:53 PM IST

బిగ్ బాస్ షో మరో రెండు వారాల్లో ముగియనుంది. 14వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.   

PREV
17
Bigg Boss Telugu 7: చివరి నామినేషన్స్... ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఫైనల్ కి వెళ్ళేది ఎవరు?
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 7 మరింత ఆసక్తికరంగా మారింది.  హౌస్లో టాప్ 7 ఉన్నారు. గౌతమ్ కృష్ణ ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు. శివాజీ, అమర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక శోభ, యావర్ హౌస్లో ఉన్నారు. 
 

27
Bigg Boss Telugu 7

వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగతా ఇద్దరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. 14వ వారం నామినేషన్స్ చాలా కీలకం. నామినేషన్స్ లో లేని కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి వెళతాడు. నామినేట్ అయినవారిలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. 

37
Bigg Boss Telugu 7

అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా అర్హత సాధించాడు. కాబట్టి అతడిని నామినేట్ చేయడానికి వీల్లేదు. అమర్ బిగ్ బాస్ సీజన్ 7 లాస్ట్ కెప్టెన్ అయ్యాడు. అయినప్పటికీ అతడికి ఇమ్యూనిటీ ఉండదు. కనుక అమర్ ని కూడా నామినేట్ చేసే అవకాశం ఇంటి సభ్యులకు ఉంది. 

 

47
Bigg Boss Telugu 7

సోమవారం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు. ప్రతి ఇంటి సభ్యులు ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ఫోటో స్టాంప్ ఒక టైల్ పై ముద్రించి దాన్ని బ్రేక్ చేయాలి. ఈ నామినేషన్స్ ప్రక్రియ వేడివేడిగా సాగింది. 

57
Bigg Boss Telugu 7

శోభ-శివాజీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ టాస్క్ లో మీరు ఎఫర్ట్ పెట్టకుండా వదిలేశారని శివాజీని శోభ అన్నది. నేను కావాలని ఎందుకు పట్టు వదిలేస్తాను. గెలవాలనే అనుకుంటాను. నువ్వు అమర్ ని ఫౌల్ గేమ్ ఆడాడన్న రీజన్ పై నామినేట్ చేయాలి కదా... అని నిలదీశాడు. 

67
Bigg Boss Telugu 7

అలాగే యావర్ తో ప్రియాంక, శోభ గొడవ పడ్డారు. కిచెన్ లో యావర్ పని చేయడం లేదని వాళ్ళ ప్రధాన ఆరోపణ. డిన్నర్ అయ్యే టైమ్ కి వచ్చి తిని హ్యాపీగా కూర్చుంటున్నావని యావర్ పై శోభ గట్టిగా అరిచింది. ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. 

 

77
Bigg Boss Telugu 7

ఇక ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు? అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం అర్జున్ మినహా అందరూ నామినేట్ అయ్యారని తెలుస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories