Bigg Boss Telugu 7: నామినేషన్స్ లో పీక్స్ చేరిన అమర్-యావర్ గొడవ... శివాజీ రాకుంటే!

నామినేషన్స్ డే వచ్చిందంటే కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి వాదనలు చోటు చేసుకుంటాయి. 11వ వారానికి నామినేషన్స్ జరుగుతుండగా అమర్ -యావర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 
 

Bigg Boss Telugu 7


సోమవారం నామినేషన్స్ మొదలయ్యాయి. 11వ వారం ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్లాలో తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. శివాజీ హౌస్ కెప్టెన్ కాగా అతన్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదన్నారు. రతిక... ప్రియాంక, శోభ శెట్టిలను నామినేట్ చేసింది. వారిద్దరితో రతిక సీరియస్ గా వాదించింది... 

Bigg Boss Telugu 7

అనంతరం అర్జున్... శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ లను నామినేట్ చేశాడు. కెప్టెన్ గా ఆమె ఏమీ చేయలేదని ఆరోపించాడు. ప్రియాంక... రతిక, అశ్వినిలను నామినేట్ చేసింది. గౌతమ్... అర్జున్, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. సోమవారం ఎపిసోడ్ ముగియగా... మంగళవారం నామినేషన్స్ మొదలయ్యాయి. 


Bigg Boss Telugu 7


అశ్విని.. అమర్, ప్రియాంకలను నామినేట్ చేసింది. అమర్ ఆమెది సిల్లీ రీజన్ అన్నాడు కానీ ప్రతిఘటించలేదు. ఇది కొంచెం ఫన్నీగా సాగింది. ప్రియాంకతో మాత్రం అశ్వినికి వాగ్వాదం అయ్యింది. మధ్యలో శోభ కూడా ప్రియాంకకు సపోర్ట్ గా జోక్యం చేసుకుంది.  పల్లవి ప్రశాంత్ ని అర్జున్ నామినేట్ చేసిన క్రమంలో అతడు తిరిగి నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

Also Read Bigg Boss Telugu 7: హౌజ్‌లో ఉన్న టాప్‌-10 కంటెస్టెంట్లలో ఎవరి స్థానం ఎంత?

Bigg Boss Telugu 7

కాగా యావర్.. అమర్ ని నామినేట్ చేయగా ఇద్దరూ గొడవకు దిగాడు. కేవలం స్ప్రైట్ కోసం నన్ను యావర్ నామినేట్ చేశాడని అన్నాడు. నీ బిహేవియర్ కి చేశానని యావర్ బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. కెప్టెన్ శివాజీ కలుగ చేసుకుని గొడవ ఆపే ప్రయత్నం చేశాడు. 

Bigg Boss Telugu 7

నేటితో నామినేషన్స్ ప్రక్రియ ముగియనుంది. ఒకరు వచ్చే ఆదివారం ఎలిమినేట్ అవుతారు. 10వ వారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్లో 10 మంది మాత్రమే ఉన్నారు. టాప్ 10 నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూడాలి. గత మూడు వారాలుగా మేల్ కంటెస్టెంట్స్ ఇంటిని వీడుతున్న విషయం తెలిసిందే... 

Also Read Bigg Boss Telugu 7: రతిక మైండ్ ట్యూన్ చేసి గేమ్ మార్చేసిన శివాజీ... వలలో పడింది, బలి కానుందా?

Latest Videos

click me!