ఇక, ప్రోగ్రామ్ మొదలౌతుంది. ఒకరి తర్వాత మరొకరు మాట్లాడుతూ ఉంటారు. అనుపమ వంతు వస్తుంది. ‘ ఇలా అందరూ కలవడానికి కారణం తానే అయినా, అందరూ స్పందించి రావడం సంతోషంగా ఉంది. మీ అందరినీ చూస్తుంటే, కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి. ఫ్రెండ్స్ దూరంగా ఉన్నా, మనసులు మాత్రం దగ్గరగానే ఉంటాయి.’ అని అనుపమ చెబుతుంది. వెంటనే ఫ్రెండ్స్ లో ఒకరు జగతి, మహేంద్ర నీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా అంటారు. దానికి అనుపమ కూడా స్పందిస్తుంది. ‘ నిజంగానే జగతి, నేను, మహేంద్ర మంచి ఫ్రెండ్స్ అని చెబుతుంది. క్యాంటీన్ కి వెళ్లాలన్నా, లైబ్రరీకి వెళ్లాలన్నా, కాలేజీ బంక్ కొట్టాలన్నా, ముగ్గురం కలిసే ఉండేవాళ్లం అని అనుపమ గుర్తు చేసుకుంటుంది. ఆ రోజులు మళ్లీ తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది. ’ అని అనుపమ అంటుంది. వెంటనే, మహేంద్ర మనసులో మాట్లాడుకుంటాడు. కాలం వెనక్కి వెళ్లి, జగతి మళ్లీ బతికి వస్తే బాగుండు అని అనుకుంటాడు.