ప్రియాంక, శోభ శెట్టిలకు బిగ్ బాస్ తీరని అన్యాయం...  ఇక యూట్యూబ్ వీడియోలు చేసుకోవాల్సిందేనా?

Published : Jan 11, 2024, 10:19 AM IST

బిగ్ బాస్ షో కొందరికి మేలు చేస్తే మరికొందరికి కీడు చేస్తుంది. నటుల పట్ల ఉండే అభిప్రాయం మార్చేసే అవకాశం కలదు. బిగ్ బాస్ షోతో ప్రియాంక జైన్, శోభ శెట్టిల రియల్ బిహేవియర్ బయటపడ్డ నేపథ్యంలో వారికి ఆఫర్స్ కష్టమే అంటున్నారు.   

PREV
17
ప్రియాంక, శోభ శెట్టిలకు బిగ్ బాస్ తీరని అన్యాయం...  ఇక యూట్యూబ్ వీడియోలు చేసుకోవాల్సిందేనా?
Priyanka Jain

బిగ్ బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్స్ రియల్ క్యారెక్టర్స్ బయటకు తీస్తుంది. మంచి చెడును ఎలా చూస్తారు. తోటి కంటెస్టెంట్స్ గురించి ఎలా మాట్లాడతారు. ఎమోషన్స్ ఎంత వరకు అదుపులో ఉంచుకుంటారు. అబద్దాలు ఆడతారా? ఇలా అనేక కోణాల్లో పరీక్షలు ఎదురవుతాయి. 
 

 

Pic Credit: Never endig tales 

27
Bigg Boss Telugu 7

కంటెస్టెంట్స్ కి తెలియకుండానే వాళ్ళ నిజస్వరూపం బయటకు వస్తుంది. అది స్క్రీన్ మీద వాళ్ళను ఊహించుకున్న దానికంటే భిన్నంగా ఉంటే ప్రేక్షకులు తీసుకోలేరు. ప్రియాంక జైన్, శోభ శెట్టిల పరిస్థితి ఇప్పుడు అలానే తయారైంది. వీరిద్దరి రియల్ క్యారెక్టర్స్ బిగ్ బాస్ వేదికగా బయటపడ్డాయి.

37
Bigg Boss Telugu 7

ప్రియాంక జైన్ జానకి కలగనలేదు సీరియల్ లో చాలా సాఫ్ట్, హోమ్లీ రోల్ చేసింది. గతంలో కూడా ఆమె పాజిటివ్ రోల్స్ చేశారు. హౌస్లో ఆమె అగ్రెషన్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. భోలే షావలిని నామినేట్ చేస్తూ థూ అని ఊచింది. నేను అదే పని చేస్తే నీ పరిస్థితి ఏంటని భోలే అన్నాడు. 
 

47
Bigg Boss Telugu 7


ఇక శోభ శెట్టి గురించి చెప్పాల్సిన పనిలేదు. మోనితగా లేడీ విలన్ రోల్ చేసిన శోభా శెట్టి రియల్ లైఫ్ లో కూడా విలనే అన్నట్లు బిహేవ్ చేసింది. తలపొగరు, రెచ్చగొట్టే మాటలు, ఎక్స్ప్రెషన్స్ తో చిరాకు తెప్పించింది. శోభను ఎలిమినేట్ చేయండి బాబోయ్ అని నెటిజెన్స్ కామెంట్స్ పెట్టారు. బిగ్ బాస్ ఆమెను కాపాడుతూ వచ్చాడనే వాదన ఉంది. 

57
Bigg Boss Telugu 7

ప్రియాంక, శోభ ఇంత నెగిటివిటీ మూటగట్టుకున్న నేపథ్యంలో వీరిని ప్రేక్షకులు ఎలాంటి పాత్రలోనైనా ఊహించుకోలేరని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ప్రియాంక, శోభలకు ఆఫర్స్ రావడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. వీరు కర్ణాటక వెళ్లి కన్నడ సీరియల్స్ చేసుకోవాల్సిందే. తెలుగులో కష్టం అనే వాదన తెరపైకి వచ్చింది. 
 

67
Bigg Boss Telugu 7

సీరియల్ ఆఫర్స్ రాని పక్షంలో యూట్యూబ్ వీడియోలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే యూట్యూబ్ కూడా మంచి ఆదాయమార్గంగా ఉంది. ప్రియాంక, శోభ శెట్టి చెరో యూట్యూబ్ ఛానల్ మైంటైన్ చేస్తున్నారు. ఈ వాదనల నేపథ్యంలో బిగ్ బాస్ షో ప్రియాంక, శోభ శెట్టి కెరీర్ దెబ్బతీసిందన్న వాదన వినిపిస్తోంది.

77
Bigg Boss Telugu 7

మరోవైపు ప్రియాంక, శోభ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నారట. ప్రియాంక తన ప్రియుడు శివ కుమార్ తో ఏడడుగులు వేయనుంది. శోభ శెట్టి కి కూడా లవర్ ఉన్నాడు. అతని పేరు యస్వంత్ రెడ్డి. అతన్ని వివాహం చేసుకోనుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories