Guppedantha Manasu 11th January Episode: శైలేంద్రకు కుర్చీ మడతపెట్టిన పెద్దయ్య, అదిరిపోయిన ఎపిసోడ్..!

First Published Jan 11, 2024, 8:19 AM IST

మీ ఫ్రస్టేషన్ నా మీద చూపించే బదులు... ఆయనకు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా  అని ధరని సలహా ఇస్తుంది. ఆ విషయం నాకు తెలుసులే అని.. దేవయాని ఫోన్ అందుకుంటుంది.
 

Guppedantha Manasu

Guppedantha Manasu 11th January Episode: రిషి ఆచూకీ తెలుసుకునేందుకు శైలేంద్ర రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. రౌడీలు ఇచ్చిన సమాచారంతో.. రిషికి వైద్యం చేసిన పెద్దయ్య ఇంటికి వెళతాడు. అక్కడ.. తనకు నడుము నొప్పి అనే వంకతో రిషి కూపీ లాగాలి అనుకుంటాడు. కానీ, అతను కావాలి అనుకున్న సమాచారం చెప్పకుండా...  నడుము విరిగేలా కొడతారు. వైద్యం వద్దు అని శైలేంద్ర చెప్పినా పెద్దయ్య వినడు. వైద్యం చేయించుకోకపోతే.. నువ్వు మంచానికే అతుక్కుపోతావ్.. నడవలేవు.. కూర్చోలేవు అని చెబుతాడు. అయినా సరే.. నాకు వైద్యం వద్దు అని శైలేంద్ర చెబుతున్నా అతను వినిపించుకోడు. తన దగ్గరకు వచ్చిన వాళ్లకు పూర్తి వైద్యం చేసేంత వరకు మేం వదిలిపెట్టం అని.., నడుము మీద గట్టిగా కొడుతూనే ఉంటాడు. నొప్పితో శైలేంద్ర అరుస్తూ ఉంటాడు.

Guppedantha Manasu

తనకు వద్దు అని చెప్పినా వినకుండా.. పిచ్చి కొట్టుడు కొడతారు.  ఆ సీన్ మాత్రం చూసే ప్రేక్షకులకు చాలా ఫన్నీగా ఉంటుంది. ఇదేం వైద్యం.. నేను ఇప్పటి వరకు చూడలేదు అని శైలేంద్ర అంటే..  వైద్యంలో చాలా రకాలు ఉంటాయని, ఇదో రకం అని ఆపకుండా కొడుతూనే ఉంటారు.  దొంగ సచ్చినోడిని బాగా కొట్టమని ముసలమ్మ అంటుంది.. రిషి కోసం వచ్చి.. వీళ్లకు అడ్డంగా  దొరికిపోయాను అని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు. దెబ్బలు కొట్టిన తర్వాత.. తైలం రాస్తారు. అది సమ్మగా ఉందని రాయించుకుంటాడు.

Latest Videos


Guppedantha Manasu

ఇంట్లో దేవయాణి చాలా టెన్షన్ గా తిరుగుతూ ఉంటుంది. శైలేంద్ర కనిపించడం లేదని.. ఎక్కడికి వెళ్లాడా అని చూస్తూ ఉంటుంది. మరోవైపు పెద్దాయన.. ఒంటికి  నూనె రాసిన తర్వాత.. మరో కర్రతో కొట్టడానికి రెడీ అవుతాడు. దేవయాణి ఏమో.. శైలేంద్ర కోసం.. ధరణిని పిలిచి అడుగుతుంది. తనకు తెలీదని ధరని చెబితే.. నీ భర్త ఎక్కడ ఉన్నాడో నీకు తెలీదా అంటుంది. ఆయన ఎప్పుడైనా బయటకు వెళుతుంటే.. ఎక్కడికి వెళ్తున్నారు అని నేను అడగగానే.. నీకు ఎందుకు.. ఎందుకు అడుగుతున్నావ్ అని మీరే అంటారు కదా అత్తయ్య అని ధరణి తెలివిగా సమాధానం చెబుతుంది. బయటుక వెళ్లేవాళ్లను అడగకూడదని మీరే అంటారు కదా అత్తయ.. అందుకే అడగడం మానేశాను. అలా కాదని.. నేను అడిగినా.. ఆయన నాకు చెప్పరు. అని ధరణి అంటుంది. ఏంటి ధరణి ఈ మధ్య బాగా నోరు లేస్తోంది అని దేవయాణి అంటే...  మీ ఫ్రస్టేషన్ నా మీద చూపించే బదులు... ఆయనకు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా  అని ధరని సలహా ఇస్తుంది. ఆ విషయం నాకు తెలుసులే అని.. దేవయాని ఫోన్ అందుకుంటుంది.

Guppedantha Manasu

మరోవైపు పెద్దయ్య తన వైద్యం ఇంకా ఆపడు. కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాడు అప్పుడే దేవయాని ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ని పెద్దమ్మ ఎత్తుతుంది.  నీ కొడుక్కి నడుము జారిపోయిందని, వెన్నుపూస అరిగిపోయిందని, వైద్యం చేస్తున్నాం అని చెబుతుంది. అది విని... దేవయాణి షాకౌతుంది. మంచిగా ఉన్న తన కొడుక్కి లేనిపోని రోగాలు అంటగడుతున్నారని దేవయాణి అంటే.. రోగం లేకుంటే.. మీ కొడుకు మా దగ్గరకు ఎందుకు వస్తాడు అని పెద్దమ్మ అంటుంది. తర్వాత ఫోన్ శైలేంద్ర తీసుకొని.. తాను పని మీద బయటకు వచ్చానని.తర్వాత మాట్లాడతాను అని చెబుతాడు. ఏం పని నాన్న అని దేవయాణి అంటే.. తర్వాత చెబుతాను అంటాడు. మరోవైపు పెద్దయ్య మాత్రం.. చితకబాదుతూనే ఉంటాడు. నొప్పితో అమ్మా.. అని అరుస్తాడు.  ఎప్పుడూ మమ్మీ అంటావ్.. ఈ సారి అమ్మ అన్నావ్ ఏంటి  అని దేవయాని అడుగుతుంది. ఆ అమ్మ కాదు మమ్మీ అని శైలేంద్ర చెబుతూ ఉంటాడు. పెద్దాయన మాత్రం.. వైద్యం పేరిట చితకబాదుతూనే ఉంటాడు.

ఫోన్ పెట్టేసిన తర్వాత..ఆయన ఎక్కడ ఉన్నారు అని ధరని అడిగితే. పనిమీద బయటకు వెళ్లాడు అని చెబుతాడు. ఆయన గొంతు ఏదోలా వినపడింది అంటే.... ఏమీలేదు అని దేవయాణి  అంటుంది. మరోవైపు..పెద్దయ్య మాత్రం.. ఇంకా.. శైలేంద్ర ట్రీట్మెంట్ అయిపోలేదని.. కుర్చీ మడత పెట్టి... అని భయపెడతారు. శైలేంద్ర భయంతో పైకి లేస్తాడు.
 

Guppedantha Manasu

తర్వాత.. శైలేంద్ర.. రిషి, వసుల గురించి అడగాలి అంటే.. అడగనివ్వకుండా మళ్లీ  నొప్పి వస్తే.. రమ్మని.. మళ్లీ ట్రీట్మెంట్ చేస్తాం అని చెబుతారు. తర్వాత.. రిషి గురించి శైలేంద్ర అడుగుతాడు.  కానీ, వాళ్లు తమకు ఆ పేరు తెలీదు అని చెబుతారు. అయితే.. ఫోటో చూపించి మరీ అడుగుతాడు. తాము చూడలేదని వాళ్లు చెబుతారు. బాగా గుర్తు చేసుకోమని మరీ అడుగుతాడు. అయినా, గుర్తు రావడం  లేదు అని, అసలు చూడలేదని చెబుతారు.
 

Guppedantha Manasu

వచ్చిన పని అవ్వలేదు కానీ, ఒళ్లు హూనం అయ్యిందని.. శైలేంద్ర అనుకుంటుంటే.. వసు ఎంట్రీ ఇస్తుంది. ప్రాబ్లం లేకుండా వచ్చి వైద్యం చేయించుకుంటే.. ఇలానే ఉంటుంది అని వసు కౌంటర్ ఇస్తుంది. వసు, ముకుల్ ని చూసి  శైలేంద్ర షాకౌతాడు. మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. అదే ప్రశ్న.. మేము మిమ్మల్ని అడుగుతున్నాం.. నువ్వేంటి ఇక్కడ అని వసు అడగుతుంది. తనకు హెల్త్ ప్రాబ్లం ఉందని వచ్చాను అని చెబుతాడు. సిటీ లో అన్ని హాస్పిటల్స్ ఉన్నా.. ఇక్కడికే ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.

పెద్దయ్య మంచి వైద్యం చేస్తాడని పబ్లిక్ లో టాక్ ఉందని, అందుకే వచ్చాను అని చెబుతాడు. మరి ట్రీట్మెంట్ బాగా చేశారా అని అడిగితే...  చేశారు అని చెబుతాడు. మరి వైద్యం అయిపోయాక.. రిషి సర్ గురించి ఎందుకు అడుగుతున్నావ్ అని వసు అడుగుతుంది. రిషి కనిపించడం లేదు కదా.. అందుకే.. కనుక్కుంటున్నాను అని చెబుతాడు.
 

Guppedantha Manasu

తర్వాత.. ముకుల్ ని  మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగితే.. రిషి సర్ ఎంక్వైరీ చేస్తూ వచ్చాను అని చెబుతాడు. కాసేపు ముకుల్, శైలేంద్ర మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో.. ఆరోజు నా వాయిస్ బలే మ్యానేజ్ చేశావ్ అని ముకుల్ అంటే... మీరు వినిపించింది కూడా నా వాయిస్ కాదు అని శైలేంద్ర అంటాడు. మళ్లీ ముకుల్ తన వాయిస్ నీ దగ్గరకు ఎలా వచ్చింది అని అడుగుతాడు. ఏదో తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అని  శైలేంద్ర అంటాడు. తర్వాత.. శైలేంద్రను ముకుల్ పై నుంచి కింద దాకా చూసి.. వసుని తీసుకొని వెళ్లిపోతాడు. శైలేంద్ర కూడా.. పెద్దయ్య, పెద్దమ్మలకు వెళతాను అని చెప్పి వెళ్లిపోతాడు. వాళ్లు.. మళ్లీ ఏదైనా సమస్య ఉంటే రమ్మని చెప్పి పంపించేస్తారు.

Guppedantha Manasu

ఎక్కువ దెబ్బలు తగలడంతో.. శైైలేంద్ర నడవలేక, నడవలేక నడుస్తూ ఉంటాడు. ఇదేం వైద్యం రా బాబు అని   నొప్పులకు విలవిలలాడిపోతూ ఉంటాడు. తర్వాత.. రిషి ఇక్కడ లేకపోతే.. వసు ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుమానిస్తాడు. తనను వసుధార ఫాలో అవుతుందా అనే డౌట్ వస్తుంది.  రిషి మాత్రం ఇక్కడ లేడని, మరి ఎక్కడ ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. వసు ముఖంలో బాధ కనిపించడం లేదంటే.. రిషి.. వసు వాళ్ల నాన్న ఇంట్లో ఉన్నాడా అనే డౌట్ కూడా శైలేంద్రలో వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!