Naga panchami 10th January Episode:ఫణీంద్రకు నాగదేవత మరణశిక్ష, మోక్షను కాటు వేసిన పంచమి..!

First Published Jan 10, 2024, 3:29 PM IST

ఇక్కడ నేనేం చేస్తున్నా నా అని గమనిస్తోందని, నాగ మణి ని తెచ్చి, మోక్షను బతికించాలని మనం చేస్తున్న ప్రయత్నం ఆమెకు తెలిస్తే ఊరుకోదు అని ఫణీంద్ర అంటాడు. అయితే.. అసలు నాగ దేవతకు తెలీకుండా  నాగమణి తీసుకురావడం వీలయ్యే పనేనా అని మోక్ష అడుగుతాడు.

Naga panchami

Naga panchami 10th January Episode: పంచమి కి శక్తులు వస్తే.. పాముగా మారి, మోక్షను చంపేసి ఈరోజు రాత్రికే నాగలోకానికి వచ్చేస్తుంది అని  ఫణీంద్ర చెప్పిన మాటలను నాగ దేవత తలుచుకుంటుంది. కానీ, పంచమి మోక్షను చంపడానికి నిరాకరించదు అనే విషయం మనకు తెలిసిందే. దీంతో.. ఫణీంద్రపై నాగదేవతకు కోపం వస్తుంది. మిగిలిన నాగకన్యలు అందరితోనూ నాగదేవత మాట్లాడుతుంది. ‘ యువరాజు ఫణీంద్రకు ఓ కార్యం అప్పగించి భూలోకానికి పంపించాం. ఈరోజు రాత్రికే యువరాణిని  మన లోకానికి తీసుకువస్తాను అని చాలా నమ్మకంగా చెప్పాడు. కానీ ఇంత వరకు తన ఆచూకీ  లేదు. కనీసం కబురు కూడా పంపలేదు. ఇలా చేయడం వల్ల, అందరి మీద నాకు నమ్మకం పోతోంది.’ అని నాగదేవత అంటుంది. అయితే..తమకు అనుమతి ఇస్తే.. భూలోకం తీసుకువస్తాం అని కొందరు నాగ కన్యలు అంటారు. కానీ.. అతను మామూలు నాగరాజు కాదని యువరాజు అని  అలా చేయలేం అంటుంది. అయితే.. యువరాణితో లాలూచీ పడి, ఫణీంద్ర.. నాగలోకానికి ద్రోహం చేస్తున్నాడనే అనుమానం కలుగుతోందని ఆమె అంటారు.  ఆ విషయం కునుక్కోమని చెబుతుంది. నాగదేవత సరే అని చెబుతుంది.
యువరాజు కాబట్టి.. ఈ ఒక్కసారికి నేను మాట్లాడతాను, అతని దగ్గర నుంచి సంతృప్తికర సమాచారం రాకపోతే.. భూలోకానికి మీరే వెళ్లి.. యువరాజు చేస్తున్న పనులను మీరు కనిపెట్టి నాకు చెప్పాలి అని.. నాగదేవత.. నాగ కన్యలకు చెబుతుంది. వారు సరేనని వెళ్లిపోతారు. తనకు ఏదైనా అనుమానం ఉంటే.. ఫణీంద్రకు మరణశిక్ష వేస్తాను అని కూడా నాగదేవత అంటుంది.
 

Naga panchami

మరోవైపు మోక్ష, పంచమి, ఫణీంద్రలు..  పంచమి ఊర్లోని నాగ సాధువు ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు. మధ్యలో ఫణీంద్ర.. పాములా మారతాడు. దీంతో.. మోక్ష కారు పక్కకు ఆపుతాడు. ఏమైంది అని అడిగితే.. నాగ దేవత తనను అనుమానిస్తోందని, ఇక్కడ నేనేం చేస్తున్నా నా అని గమనిస్తోందని, నాగ మణి ని తెచ్చి, మోక్షను బతికించాలని మనం చేస్తున్న ప్రయత్నం ఆమెకు తెలిస్తే ఊరుకోదు అని ఫణీంద్ర అంటాడు. అయితే.. అసలు నాగ దేవతకు తెలీకుండా  నాగమణి తీసుకురావడం వీలయ్యే పనేనా అని మోక్ష అడుగుతాడు. నాగ దేవతతో అంత ప్రమాదం ఉందని తెలిసి, ఏం ఆశించి.. నన్ను బతికించాలని అనుకుంటన్నావ్ ఫణీంద్ర అని మోక్ష అడుగుతాడు.

Latest Videos


Naga panchami


సహాయం చేస్తానని యువరాణికి మాట ఇచ్చాను అని ఫనీంద్ర అంటాడు. ఎలాగైనా మిమ్మల్ని రక్షించమమని తాను ప్రాధేయపడ్డాను అని , నా బాధ చూడలేక, తన మనసు కరిగి ఒకప్పుకున్నాడని పంచమి చెబుతుంది. అయితే.. తన ఒక్కడి ప్రాణం కోసం మీరు బలికావద్దని మోక్ష అంటాడు. కానీ, ఫనీంద్ర.. అలాంటిదేమీ లేదని.. మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని  హామీ ఇస్తాడు. మీరిద్దరూ నాగసాధువు దగ్గరకు వెళ్లమని. తాను తర్వాత వస్తాను అని చెబుతాడు. మాతో నువ్వు ఉండాలి అని ఫణీంద్ర అంటే.. ఉంటాను అని, నాగదేవత తనతో మాట్లాడే అవకాశం ఉందని, ఆ సమయంలో మీరు పక్కన ఉండకూడదని చెబుతాడు. నాగదేవత కు కావాల్సిందల్లా, పంచమి పాముగా మారి.. మోక్ష కాటు వేయడం మాత్రమే, అది ఇంకా  ఎందుకు జరగలేదని నాగ దేవత అడుగుతుంది అని ఫణీంద్ర అంటాడు.

Naga panchami

అయితే, నన్ను కాటేసిన తర్వాత.. పంచమి నాగలోకానికి రాకపోతే.. నాగ దేవత ఊరుకుంటుందా అని, ఎలాగైనా తనను నాగలోకానికి తీసుకు వెళ్లాలి అనే కదా నాగదేవత  పట్టుదల అని మోక్ష అడుగుతాడు. అయితే.. అంతా నాగదేవత అనుకున్నట్లే జరుగుతుందని. పంచమి పాముగా మారి నిన్ను కాటు వేయడం, నేను తనను నాగలోకానికి తీసుకువెళ్లడం, నాగ దేవత నాకు అప్పగించిన పని పూర్తౌతుంది. కానీ, అక్కడి నుంచి యువరాణి నాగ మనిని తీసుకురావడం, నీకు ప్రాణం పోయడం, నేను మళ్లీ ఆ నాగ మణిని నాగలోకానికి చేర్చడం వరకు నాకు తెలీదు. అని ఫణీంద్ర చెబుతాడు.

Naga panchami

కానీ, నాగ దేవత.. పంచమిని భూలోకానికి రాకపోతే...? పంచమి తిరిగి రాకపోతే నా ప్రాణాలు పోతాయనే భయం నాకు లేదు.. ఎలాగూ పోయే ప్రాణమే కదా అని మోక్ష అంటే.. అలా అనొద్దు అని పంచమి వారిస్తుంది. అయితే.. మీ ఇద్దరి ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తానని, ఇష్టరూప నాగిణిలకు పగ, ప్రతీకారం తీర్చుకోవడమే ముఖ్యం. అది జరగకపోతే.. నాగదేవత మన విషయ ంఅంత ముఖ్యంగా పట్టించుకోదు, నేను యువరాణికి ఇచ్చిన మాటను నిలపెట్టుకుంటాను.. యువరాణిని మళ్లీ తీసుకొచ్చి మీ ప్రాణాలు కాపాడతాను. ఇది నా హామీ.. నా మీద నమ్మకం ఉంచి.. మీరు బయలుదేరి వెళ్లండి అని.. ఫనీంద్ర వాళ్లను పంపించేస్తాడు.

మోక్ష, పంచమిలను నమ్మించినందుకు ఫణీంద్ర సంతోషిస్తాడు.  ఒక్కసారి యువరాణి.. మోక్షను కాటువేసి నాగలోకానికి వచ్చేస్తే.. మళ్లీ భూలోకానికి వచ్చేది లేదని, మోక్షను కాపాడేది కూడా లేదు అని ఫణీంద్ర అనుకుంటాడు.

Naga panchami

మరోవైపు మేఘన( కరాళీ)  తనలో తానే గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది. అద్దంలో తన పాత రూపం చూసుకుంటుంది. తన పాత రూపంతో తానే మాట్లాడుకుంటుంది. ‘ నాగకన్యగా బాగా నటిస్తున్నావని, నాగ లోక యువరాజునే నమ్మించావని, పంచమి కూడా తనను నాగ కన్య అనుకుంటోంది. భర్త నీడ కూడా తాకనివ్వను అని ప్రతిజ్న చేసిన పంచమి, ఈరోజు మోక్ష రక్షణ బాధ్యతను నాకు అప్పగించబోతోంది, నాగమణి నా వశం అయిన తర్వాత నేను కరాళి అని తెలిసి... పంచమి గుండె ఆగి చావడం ఖాయం’ అని నవ్వుకుంటుంది.

Naga panchami

తర్వాత తన శక్తితో తన అన్న నంబూధ్రి ఆత్మను పిలుస్తుంది. మనం అనుకున్నది, మన కల నిజమౌతోందని చెబుతుంది. నీ చెల్లెలు నాగమణి సాధించబోతోందని గర్వంగా చెబుతుంది. అదే జరిగితే.. మనంత శక్తివంతులు ఈ లోకంలోనే ఉండమని నంబూద్రి చెబుతాడు. తనను కాటేసి చంపిన పంచమిని  చిత్ర హింసలు పెట్టి చంపేయాలి అని నంభూద్రి అంటాడు. నాగమణి తెచ్చి నిన్ను బతికించిన తర్వాత... ఆ పంచమిని తెచ్చి నీ ముందే పడేస్తానని, అప్పుడు నీ పగతీరే వరకు చంపుకోమని కరాళి చెబుతుంది. అయితే.. నాగమణి ఆలస్యం అయితే.. తన భౌతిక కాయం మళ్లీ బతికించలేం అని నంభూద్రి చెబుతాడు.  కానీ, ఈ రోజు రాత్రికే తాను నాగమణిని సాధించి తీరతాను అని కరాళి చెబుతోంది. మళ్లీ నాగమణి తోనే మళ్లీ నిన్ను కలుస్తాను అని చెప్పి.. కరాళి అక్కడి నుంచి వెళుతుంది.

Naga panchami

మోక్ష, పంచమి కనిపించడం లేదని ఇంట్లో వాళ్లంతా ఆలోచిస్తూ ఉంటారు. కానీ, మోక్ష ఇక ఇంటికి రాడు అని, పంచమి కూడా మనిషి రూపంలో ఉన్న పామే అని మోక్ష బతికి ఇంటికి రాడు అని చిత్ర, జ్వాల చెబుతారు.  పంచమి పాము కాబట్టే.. బయపడి ఇంట్లో నుంచి మోక్షను తీసుకొని వెళ్లిపోయింది అని అంటారు.  పంచమి పాము అయితే.. మోక్షకు తెలీకుండా ఉండదా అని ఇంట్లో వాళ్లు అంటే.. మోక్షకు అన్నీ తెలిసినా మనకు చెప్పడం లేదు అని చిత్ర, జ్వాల అంటారు. కానీ... ఇంట్లో వాళ్లు వాళ్ల మాటలు నమ్మకపోగా.. రివర్స్ లో తిడతారు.  వైదేహి... మాత్రం పంచమినే.. మోక్షను ఎటు అంటే అటు ఆడిస్తోందని  అంటుంది. వాళ్లు ఇంటికి వచ్చాక అడుగుదాం అని మోక్ష తండ్రి అంటే.. వాళ్లు తిరిగిరారు అని చిత్ర, జ్వాల చెబుతారు. పంచమి.. మెక్షను ప్రాణాలతో ఉండనివ్వదు  అని జ్వాల తెగేసి చెబుతుంది. నిజంగా మనిషి పాములా మారడం నేను చూశాను అని జ్వాల చెబుతుంది. తాను చెప్పినప్పుడే విని ఉంటే.. మోక్షను కాపాడుకునేవాళ్లం అని జ్వాల అంటుంది. పంచమి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే.. ఈ ఇంటికి పాములు వస్తున్నాయని చిత్ర కూడా అంటుంది. మోక్ష నాగ గండానికీ, పంచమికి ఏదో సంబంధం ఉందని.. మీరు అనుకున్నట్లు పంచమి మామూలు మనిషి కాదు అని  జ్వాల అంటుంది. 

Naga panchami

మరోవైపు  పంచమి, మోక్ష లు నాగసాధు ఆశ్రమానికి చేరుకుంటారు. కమింగ్ అప్ లో పంచమి పాముగా మారి... మోక్షను కాటు వేస్తుంది. మోక్ష నొప్పితో అల్లాడుతూ ఉంటాడు. 

click me!