సౌందర్య స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె పలు భాషల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో సౌందర్యకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందరు స్టార్ హీరోలతో ఆమె జతకట్టారు. బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ముఖ్యంగా వెంకటేష్ తో ఆమె ఎక్కువ చిత్రాలు చేసింది. వీరి కాంబోలో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. రాజా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, దేవి పుత్రుడు, జయం మనదేరా వంటి హిట్ చిత్రాల్లో జంటగా నటించారు.
కన్నడ అమ్మాయి అయిన సౌందర్యను తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. చాలా మంది సౌందర్య తెలుగమ్మాయే అనుకునేవారు. 1992లో సౌందర్య కెరీర్ కన్నడ పరిశ్రమలో మొదలైంది. ఆమె స్టార్ గా ఎదిగింది మాత్రం టాలీవుడ్ లోనే. 1993లో విడుదలైన మనవరాలి పెళ్లి ఆమె ఫస్ట్ తెలుగు మూవీ. ఆ మూవీ పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు. అనంతరం ఆమెకు వరుస హిట్స్ పడ్డాయి.
ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్యకు బ్రేక్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు చిత్రాల్లో సౌందర్య హీరోయిన్ గా నటించింది. అవి రెండు సూపర్ హిట్ అయ్యాయి. నెంబర్ వన్, హలో బ్రదర్, మేడమ్ చిత్రాలతో సౌందర్య స్టార్డమ్ తెచ్చుకుంది. అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. రెండు దశాబ్దాలు సౌందర్య స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది.
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రజినీకాంత్, అమితాబ్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. అనూహ్యంగా 2004లో కన్నుమూశారు. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య తన సోదరుడితో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగుళూరు నుండి కరీంనగర్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించింది. అప్పట్లో ఇది సంచలనమైంది.
అయితే మోహన్ బాబు ఆమెకు అనుమతి ఇవ్వకపోతే సౌందర్య మరణించేవారు కాదని శివ శంకర్ మూవీ డైరెక్టర్ వెల్లడించారు. సౌందర్య నటించిన చివరి చిత్రం శివ శంకర్ కి కాపుగంటి రాజేంద్ర దర్శకుడు. శివ శంకర్ మూవీలో మోహన్ బాబు హీరోగా నటించారు. ఆయన నిర్మాత కూడాను. శివ శంకర్ మూవీ షూటింగ్ జరుగుతుండగా... మోహన్ బాబు ఎవరికీ సెలవులు ఇచ్చేవాడు కాదట.
Soundarya
కానీ సౌందర్యకు మాత్రం ఆయన పర్మిషన్ ఇచ్చాడట. ఒకవేళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సౌందర్యకు మోహన్ బాబు సెలవులు ఇవ్వకుండా ఉండి ఉంటే ఆమె ఆ ప్రమాదం నుండి తప్పుకునేది. ఈరోజు మన మధ్య ఉండేదని కాపుగంటి రాజేంద్ర అన్నారు. మోహన్ బాబు నిర్ణయం పరోక్షంగా సౌందర్య మరణానికి కారణమైంది.
అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య మరణం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచింది. వందకు పైగా చిత్రాల్లో నటించిన సౌందర్యకు అసలు నటి కావడం ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఆమె క్లోజ్ ఫ్రెండ్ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Soundarya
ఆమనికి సౌందర్య చాలా క్లోజ్. ఇద్దరూ కన్నడ వాళ్ళు కావడంతో బాగా కలిసిపోయేవారట. ప్రతి విషయం ఆమనితో సౌందర్య షేర్ చేసుకునేదట. ఈ క్రమంలో సౌందర్య గురించి చాలా విషయాలు ఆమనికి తెలుసట. అసలు హీరోయిన్ కావడం సౌందర్యకు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న బలవంతం మీద పరిశ్రమకు వచ్చిందని ఆమని అన్నారు. తండ్రి మరణించాక అన్నయ్యను అదే స్థాయిలో ఆమె గౌరవించారని అని ఆమని వెల్లడించారు.
బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?
తండ్రి ఒత్తిడితో సినిమాల్లోకి వచ్చాక.. తర్వాత ఇంట్రెస్ట్ కలిగి చేసింది. కానీ ఆమెకు సాధారణ జీవితం ఇష్టం. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహిణిగా ఉండాలని కోరుకునేది. నటిగా ఎంతో కీర్తి గడించిన సౌందర్య ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిందని ఆమని ఆవేదన చెందారు. 2003 ఏప్రిల్ నెలలో జి రఘు అనే వ్యక్తిని సౌందర్య వివాహం చేసుకుంది. పెళ్ళైన ఏడాది లోపే మరణించింది. ఆమె కోరుకున్న జీవితం అనుభవించక ముందే ఆమె కన్నుమూశారు.