Shanmukh Jaswanth : షణ్ముణ్ జస్వంత్ అరెస్ట్.. ఆ అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టారో తెలుసా?

First Published | Feb 22, 2024, 4:13 PM IST

బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth)  గంజాయా కేసులో తాజాగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల దర్యాప్తు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 

షణ్ముఖ్ జస్వంత్.... యూట్యూబర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా అందరికీ పరిచయమే.... ఇక ఆయన పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అందుకు కారణంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడమే..

గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అన్న సంపత్ (Sampath)తో కలిసి గంజాయి సేవిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. 


అయితే మౌనికా (Mounika)  అనే యువతి సంపత్ తనను ప్రేమించి, మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో సంపత్ కోసం వెళ్లగా షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు. 

ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది...  సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.... ‘సంపత్ వినయ్ ని షణ్ముఖ్ జస్వంతే మౌనికాకు పరిచయం చేశాడంట. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 

ప్రేమ సాకుతో మౌనికపై సంపత్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడంట. ఓసారి గర్భం కూడా వచ్చిందని... అబార్షన్ చేయించాడని ఆమె వాగ్మూలంలో పేర్కొంది. 

ఇక షణ్ముఖ్ కూడా తనకు యూట్యూబ్ లో అవకాశం ఇస్తానని మోసం చేశాడంది. సంపత్ కు మరో అమ్మాయితో పెళ్లి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె వెల్లడించింది. దీంతో అన్నదమ్ముల నీచపు బుద్ధిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. 

Latest Videos

click me!