BrahmaMudi 21st February Episode:రాజ్ కి చుక్కలు చూపిస్తున్న బావ, రుద్రాణి గాలి తీసేసిన స్వప్న..!

First Published | Feb 21, 2024, 10:37 AM IST

పక్కనుంచి శ్వేత... తెగేదాక లాగొద్దని పర్మిషన్ ఇవ్వమని చెబుతుంది. దీంతో రాజ్ సరే అంటాడు. ఇక.. కావ్య, వాళ్ల బావ ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిపోతారు. రాజ్ కి అది చూసి మండిపోతుంది.
 

Brahmamudi

BrahmaMudi 21st February Episode: రాజ్ లోని ప్రేమను బయటకు తీయడానికి కావ్య తన బావను సీన్ లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  తనకన్నా అందంగా ఉన్నాడని కావ్య వాళ్ల బావను చూసి రాజ్ అసూయపడుతూ ఉంటాడు. వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్నా, మాట్లాడుకుంటున్నా కూడా చూసి ఓర్వలేడు. ఇక, ఆఫీసులో కావ్యను ఏడిపించాలని శ్వేత విడాకులను సెలబ్రేట్ చేసుకోవాలని రాజ్ కేక్ తెప్పిస్తాడు. అయితే.. అక్కడ కూడా కావ్య దానిని చూసి ఎలాంటి జెలస్ ఫీలవ్వకుండా వాళ్ల బావతో సరదాగా ఉండటం చూసి  మరింత ఉడుక్కుంటాడు.

Brahmamudi


ఇక అది  చూడలేక వాళ్ల డిస్కషన్ ఆపేసి రాజ్.. శ్వేతకి కేక్ తినిపిస్తాడు. తినిపిస్తూ.. నీకు మంచి దారి చూపిస్తాను అంటాడు. అది విని కావ్య.. అవును మా ఆయన నీ భవిష్యత్తుకు సిమెంట్ రోడ్డు వేయిస్తాడు అని కౌంటర్ వేస్తుంది. ఇక రాజ్, కావ్యల మధ్య శ్వేత ఇరుక్కొని ఇబ్బంది పడుతూ ఉంటుంది.  మధ్యలో వాళ్ల బావ దూరిపోయి.. కావ్యకు కేక్ తినిపిస్తాడు. కావ్య కూడా వాళ్ల బావకు తినిపిస్తుంది. ముఖానికి కేక్ కూడా రాస్తుంది. ఇద్దరూ కలిసి వాళ్ల చిన్నప్పటి విషయాలు గుర్తు తెచ్చుకోవడం.. వాళ్ల బావ ముఖానికి అంటిన కేక్ ని కావ్య తుడవడం చూసి రాజ్ కి మండిపోతుంది. తర్వాత..  తన బావతో బయటకు వెళ్లాలని.. రెండు గంటలు పర్మిషన్ కావాలని అంటుంది. ఇవ్వను అని రాజ్ అంటే... హాలీడే పెడతాను అని చెబుతుంది. తన పర్మిషన్ లేకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అని రాజ్ అంటే.. మా బావ కోసం ఏదైనా పర్వాలేదు అని అంటుంది. తర్వాత రాజ్ ని ఇరికించి 4గంటలు పర్మిషన్ అడిగాను అని చెబుతుంది. పక్కనుంచి శ్వేత... తెగేదాక లాగొద్దని పర్మిషన్ ఇవ్వమని చెబుతుంది. దీంతో రాజ్ సరే అంటాడు. ఇక.. కావ్య, వాళ్ల బావ ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిపోతారు. రాజ్ కి అది చూసి మండిపోతుంది.

Latest Videos


Brahmamudi

సీన్ కట్ చేస్తే.. ఇంట్లో అనామిక, ధాన్యలక్ష్మి డల్ గా కూర్చొని ఉంటారు. ఇక వాళ్లిద్దరినీ రెచ్చగొట్టడానికి రుద్రాణి వస్తుంది. అపర్ణను మీరు ఎదిరించలేరని.. మీ జీవితం మొత్తం ఇంట్లో పనులకే సరిపోతుంది అని ఏవేవో ఎక్కిస్తుంది. అయితే ధాన్యలక్ష్మి వెంటనే.. తెగేదాక లాగకూడదని ఆగానని, లేకపోతే వాటాల గురించి అడిగేదాన్ని అని అంటుంది. అయితే.. నిజంగా వాటాలు తీసుకొని వెళితే.. నాలుగు రోజుల్లో ఇదే ఇంట్లో మళ్లీ పనికి చేరాల్సి వస్తుందని భయపెడుతుంది. మీ ఆయన మతి మరుపుకు ఏమీ చేయలేడని,  ఇక.. కళ్యాన్ కవితలు రాయడం తప్ప వ్యాపారాలు చేయలేడని, ఇచ్చిన ఆస్తి మొత్తం కరిగించుకొని ఈ ఇంటికే చేరాల్సి వస్తుందని ఫ్యూచర్ చెబుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అని ధాన్యం అడుగుతుంది.

Brahmamudi

వెంటనే రుద్రాణి రెచ్చిపోయి ఐడియాలు ఇవ్వడం మొదలుపెడుతుంది. మా అమ్మకీ, అపర్ణ వదినకు మధ్య గొడవ పెట్టమని, మరోవైపు అపర్ణ వదినకీ కావ్యకు మధ్య గొడవ పెట్టమని సలహా ఇస్తుంది. అప్పుడే స్వప్న వస్తుంది. ఇంక.. ఇంకేం చేయాలి అని అంటుంది. కలిసి ఉండమని సలహా ఇవ్వాల్సిందపోయి.. ఇలా గొడవలు పెట్టమని చెబుతావా అని తన అత్తకు గడ్డిపెడుతుంది. తర్వాత.. తనకు తొందరగా జ్యూస్ తీసుకురమ్మని ఆర్డర్ వేస్తుంది. స్వప్న వెళ్లిన తర్వాత.. ముందు నీ కోడలిని నువ్వు కంట్రోల్ లో పెట్టుకో... తర్వాత మా మధ్య గొడవలు పెడుదువు కానీ అనేసి ధాన్యం కూడా అనామికను తీసుకొని వెళ్లిపోతుంది.

Brahmamudi

ఇక, కావ్య వాళ్ల బావ కారులో బయటకు వెళుతూ ఉంటారు. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ ఆట ఎలా కట్టించాలి..? అసలు ఏం జరిగింది..? శ్వేతకీ రాజ్ ఉన్న సంబంధం అన్నీ కావ్య వివరిస్తుంది. అయితే.. మరీ ఎక్కువ చేయకుండా చూసుకోవాలని ఇద్దరూ అనుకుంటారు. మనం డ్రైవర్ ని కూడా తీసుకొని రాకపోవడంతో రాజ్ కి మండిపోతూ ఉంటుంది అని కావ్య వాళ్ల బావ అంటాడు.

Brahmamudi

నెక్ట్స్ సీన్ లో రాజ్ ని చూపిస్తారు. రాజ్ కూడా శ్వేతతో అదే చెబుతాడు. డ్రైవర్ కూడా లేకుండా బయటకు వెళ్లారు అని అంటాడు. తప్పేంటి అని శ్వేత అంటుంది. నా కళ్ల ముందే వాళ్ల బావతో అలా బయటకు తిరగడానికి వెళ్లొచ్చా అని రాజ్ అంటే.. నువ్వు కావ్య ముందే నాతో తిరగలేదా అని శ్వేత అంటుంది. మనం స్నేహితులం అని రాజ్.. వాళ్లు బంధువులు అని శ్వేత అంటుంది. ఏది ఏమైనా అలా వెళ్లకూడదు అని రాజ్ గింజుకుంటాడు. మా దుగ్గిరాల పరువు ఏమైపోవాలి అని అంటాడు. ఏ తప్పు చేయని భార్యను వదిలేస్తే మీ దుగ్గిరాల వంశం పరువు పోదా అని  శ్వేత రివర్స్ లో అడుగుతుంది. అంతేకాదు.. నీకు కావ్య పై ప్రేమ ఉందని ఒప్పుకోవడానికి నీకు అహం అడ్డొస్తుందని చెబుతుంది. లేదని వాదించిన రాజ్.. ఇంటికి వెళ్లి.. కావ్య వాళ్ల బావతో తిరగడానికి వెళ్లిందని చెబుతానని.. తనపై నింద పడేలా చేస్తాను అని అంటాడు. శ్వేత వద్దని చెబుతున్నా వినిపించుకోకుండా ఇంటికి బయలుదేరతాడు.

Brahmamudi

మరోవైపు కనకం, మూర్తి... తమ కూతురి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమెరికా నుంచి అల్లుడు వచ్చాడని, తమ ప్లాన్ మొత్తం వివరించామని మూర్తి చెబుతాడు. తన కూతురి జీవితం కోసం.. రాజ్ ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువల నీళ్లు తాగించేస్తానని, తాను కూడా రంగం లోకి దిగుతాను అంటూ.. సినిమా రేంజ్ లో డైలాగులు చెబుతాడు.

Brahmamudi

ఇక రాజ్.. వీరావేశంగా ఇంటికి వస్తాడు. ఇందిరాదేవి కనపడే సరికి ఆమెకు చెప్పాలని డిసైడ్ అయ్యి వెళ్లి మొదలుపెడతాడు. మొత్తం నాటకానికి ఆవిడే సూత్రదారి కావడంతో.. రాజ్ చెప్పకముందే ఈవిడే సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇక నెమ్మదిగా ఫారిన్ నుంచి వాళ్ల బావ వచ్చాడని పని వదిలేసి.. వాళ్ల బావతో షికారుకు వెళ్లిందని చెబుతాడు. ఇలా చేస్తే మన ఇంటి పరువు పోతుంది కదా అని కూడా చెబుతాడు. దానికి ఆవిడ అవును అందుకే అలా చేయకుండా.. వాళ్ల బావను ఇంటికి తీసుకువచ్చింది అని చెబుతుంది. తన ప్లాన్ మొత్తం ప్లాప్ అయ్యిందని రాజ్  అప్ సెట్ అవుతాడు. ఇంట్లో భోజనం చేస్తున్నారని కూడా చెబుతాడు. లోపల ఉన్నాడా.. వాడి సంగతి చెబుతా అని రాజ్ సీరియస్ గా లోపలికి వెళతాడు. అయితే..  తమ ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు ఇందిరాదేవి మాత్రం సంబరపడిపోతుంది.

click me!