Guppedantha Manasu
Guppedantha Manasu 22nd February Episode:శైలేంద్ర.. రాజీవ్ ని బాగా రెచ్చగొడతాడు. మా మమ్మీ నీ గురించి చాలా చెప్పింది.. అదంతా నిజం కాదా.. నువ్వు ఆ వసుధారను తెచ్చుకోలేవా అని రెచ్చగొడతాడు. దీంతో.. రాజీవ్ నా సంగతి నీకు బాగా తెలీదని.. ఇప్పుడే వెళ్లి.. వసుధారను తీసుకువస్తాను అంటాడు. అప్పుడు శైలేంద్ర నువ్వు వసుధార సంగతి చూసుకో.. నేను ఆ మను గాడి సంగతి చూసుకుంటాను అని శైలేంద్ర అంటాడు. ఇక రాజీవ్ వసుధార కోసం బయలుదేరి వస్తూ ఉంటాడు.
Guppedantha Manasu
మరోవైపు ఇంట్లో అనుపమ డల్ గా కూర్చొని ఉంటుంది. మహేంద్ర వచ్చి వంట చేయడం అయ్యిందా అని అడుగుతాడు. లేదని, ఇఫ్పుడు చేయాలి అని అనుపమ అంటుంది. అయితే.. వసుధార వచ్చి నేను చేస్తాను లే మేడమ్ అంటుంది. నీకు కాలేజీ వర్క్ ఉంది కదా నువ్వు అది చూసుకో నేను చేస్తాను అని అనుపమ అంటుంది. ఎవరు చేసినా.. ఒక మనిషికి ఎక్స్ ట్రా చేయమని, ఇంటికి గెస్ట్ వస్తున్నారు అని మహేంద్ర చెబుతాడు. గెస్ట్ అంటే ఎవరు మినిస్టర్ గారిని పిలిచిరా అని చాలా మంది పేర్లు వసు, అనుపమ చెబుతారు. అయితే.. వాళ్లెవరు కాదని సర్ ప్రైజ్ అని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
ఈలోగా మను ఎంట్రీ ఇస్తాడు. మనుని చూసి అనుపమ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మను, అనుపమల గతం తెలుసుకోవడానికి అతనిని భోజనానికి పిలిచనట్లు మహేంద్ర మనసులో అనుకుంటాడు. మనుకి, మహేంద్ర, వసుధార పలకరిస్తారు. అనుపమ పలకరించకపోవడంతో మహేంద్ర సైగ చేస్తాడు. దీంతో హలో అని అంటుంది. హలో మేడమ్ అని మను కూడా పలకరిస్తాడు. తర్వాత నేను రావడం ఇష్టం లేదనుకుంట అని మను అంటే... గెస్ట్ ఎవరో మామయ్య చెప్పలేదని.. మీరని అనుకోలేదని.. ఇంటికి ఎవరు వచ్చినా గౌరవిస్తామని, అతిథి దేవోభవ ను తాము ఫాలో అవుతాం అని వసుధార అంటుంది. అయితే.. మరి కూర్చోమని ఇంకా ఎందుకు చెప్పలేదు అని మను అడుగుతాడు. షాక్ లో ఉన్నామని.. కూర్చోమని వసు చెబుతుంది. తర్వాత.. అనుపమ వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడే మను కొంచెం వాటర్ తెమ్మని అడుగుతాడు. వసు తేవడానికి వెళ్తుంది. అనుపమ మాత్రం వీడెందుకు ఇంటికి వచ్చాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
Guppedantha Manasu
మరోవైపు రాజీవ్.. వసుధార కోసం వస్తూ ఉంటాడు. మరదలు పిల్లా నీ కోసం వస్తున్నాను అని, నిన్ను ఈ రోజు నా నుంచి ఎవరూ కాపాడలేరు. ఈ వెన్నెల రాత్రి నీ మెడలో నేను తాళి కడతాను. నా చిటికెన వేలు పట్టుకొని నిన్ను ఈ ఇంటి నుంచి నా ఇంటికి తీసుకువెళతాను. నా ప్రేమ నీకు తెలిసేలా చేస్తాను అనుకుంటూ వేగంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు.
Guppedantha Manasu
ఇక.. అనుపమ ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని మను అడిగితే.. మహేంద్ర చెబుతూ ఉంటాడు. అనుపమ అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటుందని, మేం ఇద్దరమే ఉండేది అని, అంతకముందు రిషి ఉండేవాడని ఇఫ్పుడు లేడని ఫీలౌతూ ఉంటాడు. వెంటనే వసు.. సర్ మళ్లీ వస్తారని.. మనం మళ్లీ సంతోషంగా ఉంటామని చెబుతుంది.
Guppedantha Manasu
ఇక్కడ కిచెన్ లో వంట చేస్తున్న అనుపమ..అక్కడ వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారా? మను నిజాలు బయటపెడతాడేమో, ఎలాగోలా డైవర్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా మహేంద్ర.. మను గురించి చెప్పమని అడుగుతాడు. మీ అమ్మనాన్న ఎవరు అని అడుగుతాడు. కానీ.. మను ఏమీ మాట్లాడడు. మహేంద్ర మాత్రం ఆగకుండా అడుగుతూనే ఉంటాడు. అప్పుడే అనుపమ వచ్చి.. బలవంతంగా అడగొద్దని, అది పద్దతి కాదు అని చెబుతుంది. తానేమీ బలవంత పెట్టడం లేదని, మామూలుగానే అడుగుతున్నాను అని మహేంద్ర అంటాడు. మను సైలెంట్ గా ఉన్నాడంటే.. చెప్పడం ఇష్టంలేదనే కదా అని అనుపమ అంటుంది. అసలు వంట చేయకుండా నువ్వు ఎందుకు వచ్చావ్ అంటే కాఫీ తాగుతారేమో అని అనుపమ అంటుంది. ఈ టైమ్ లో ఎవరు తాగుతారు అని మహేంద్ర అంటే.. ఒకప్పుడు నేను తాగేవాడినని, ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అని మను చెబుతాడు.
మను అలవాట్లు బాగానే గుర్తించావ్.. తనకు నచ్చిన డిష్ కూడా చెయ్యి అని మహేంద్ర అంటాడు. మను ఫేవరేట్ ఫుడ్స్ మహేంద్ర అడుగుతుంటే.. అనుపమ తొందరపడి చెప్పేస్తుంది. ఎలా కనిపెట్టావ్ అని మహేంద్ర అంటే... ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో మహేంద్రకు అనుమానం మరింత పెరుగుతుంది. వసు కూడా అనుపమకు హెల్ప్ చేయడానికి లోపలికి వెళ్తుంది. మనుకి ఇల్లు చూపించడానికి మహేంద్ర లోపలికి తీసుకువెళతాడు.
Guppedantha Manasu
ఈలోగా.. రాజీవ్ వచ్చి రచ్చ చేయడం మొదలుపెడతాడు. డార్లింగ్ వసుధార , నా మరదలు పిల్లా అని అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులకు అనుపమ వచ్చి.. ఎవరు అని అడుగుతుంది. రాజీవ్ అని, వసుకి బావ అని చెబుతాడు. వసుధారను పిలవమని చెబుతాడు. అసలు...నీకు , ఈ ఇంటికి సంబంధం ఏంటి అని అడుగుతాడు. జగతి ఫ్రెండ్ అని అనుపమ చెబుతుంది. అయితే... జగతి మేడమ్ ని తానే చంపాలని అనుకున్నానని రాజీవ్ చెప్పడంతో అనుపమకు కోపం వచ్చి కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. అప్పుడే వసు కూడా వస్తుంది.
Guppedantha Manasu
వసు రాగానే రాజీవ్.. మరదలు పిల్లా దా అని పిలుస్తాడు. వసు వెంటనే రాజీవ్ ని తిడుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. రాజీవ్ వినకుండా.. వసుని తీసుకువెళ్లడానికి వచ్చానని.. లాక్కెళ్లతాడు. అనుపమ అడ్డువస్తున్నా వినిపించుకోడు. ఆ రోజంటే వాడెవడో వచ్చి కాపాడాలని చూశాడని.. ఇప్పుడు ఎవరు వచ్చి కాపడతారు అని లాక్కొని వెళుతూ ఉంటాడు. అప్పుడే మను వెనక నుంచి వచ్చి చిటికెలు వేస్తాడు. ఆ ఇంట్లో మనుని చూసి రాజీవ్ కి తడిచిపోతుంది. వెంటనే వసు చెయ్యి వదిలేస్తాడు.
Guppedantha Manasu
ఏంటి భయ్యా నువ్వు ఇక్కడ..? ఇంటికి కూడా వచ్చేస్తావా? కాలేజీ అంటే ఒకే.. ఇంట్లో కూడా ఉంటావా? అసలు ఇంట్లో నీకు ఏం పని భయ్యా..? మమ్మల్ని బతకనివ్వరా? విలన్స్ ని బతకనివ్వరా అని రాజీవ్ అడుగుతాడు. అసలు ఎందుకు వచ్చావ్ రా నువ్వు అని మను అడిగితే... ఇది తన మరదలు ఇల్లు అని చెబుతాడు. వెంటనే మహేంద్ర సీరియస్ అవుతాడు. వసుధార వాళ్ల నాన్న ముఖం చూసి వదిలేస్తున్నానని.. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లమని మహేంద్ర వార్నింగ్ ఇస్తాడు. కానీ.. రాజీవ్ పెద్దగా పట్టించుకోడు. బాబాయ్ అంటూ వరస కలుపుతూ మాట్లాడతాడు. కానీ మను కి మాత్రం భయపడతాడు. నువ్వు ఇక్కడ ఉన్నావ్ అంటే అసలు వచ్చే వాడిని కాదని.. తాను వేరేది ఏదో ప్లాన్ చేసుకొని ఉండేవాడినని.. తన టైమ్ అంతా వేస్ట్ అయ్యిందని చెబుతాడు. కానీ.. మను సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. లాస్ట్ టైమ్ గన్ మాత్రమే చూపించానని.. ఈ సారి బులెట్స్ కూడా చూస్తావ్ అని వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.