బిగ్ బాస్ డబుల్ గేమ్.. సుమన్ కోసం దివ్య ను బలి చేశారా..? రసవత్తరంగా మారిన రియాల్టీషో..

Published : Nov 30, 2025, 11:48 PM IST

Bigg Boss Double Game : బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడంలేదు.. డబుల్ ఎలిమినేషన్ అని వారం అంతా ఊరించి.. చివరకు ఒక్కరినే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న దివ్యను ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటి?

PREV
14
చివరిదశకు బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. వారం వారం గడిచేకొద్ది పరిస్థితి మరీ టైట్ గా మారిపోతోంది. బిగ్ బాస్ హౌస్ లో వాతావరణ రోజు రోజుకి హీటెక్కుతోంది. ఈవారం ఎలిమినేషన్ చాలా ఉత్కంఠగా కొనసాగింది. ముఖ్యంగా డబుల్ ఎలిమినేషన్ అంటూ ప్రాచారం జరగడంతో.. ఆడియన్స్ అంతా చాలా ఇంట్రెస్ట్ గా ఎలిమినేషన్ ను గమనించారు. గత వారం ఎలిమినేషన్ జరగకపోవడంతో ఈ వారం తప్పకుండా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ గేమ్ మూమూలుగా ఉండదు కదా.. ఆడియన్స్ తో డబుల్ గేమ్ ఆడిన బిగ్ బాస్.. హౌస్ నుంచి మాత్రం సింగిల్ కంటెస్టెంట్ ను మాత్రమే ఎలిమినేట్ చేసి బయటకు పంపించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ వారం ఎలిమినేషన్ రౌండ్లో చివరికి దివ్య హౌస్ నుండి బయటకు వచ్చేసింది. గతవారం ఇమ్మాన్యుయోల్ పవర్ తో సేవ్ అయిన దివ్యా.. ఈసారి కూడా తక్కువ ఓటింగ్ శాతం కారణంగా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

24
అగ్నిపర్వతం టాస్క్ తో ఎలిమినేషన్..

అయితే ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లో తక్కువ ఓట్లు వచ్చిన దివ్య, సుమన్ చివరిగా మిగిలారు. దాంతో ఆడియన్స్ లో చాలా ఆసక్తి పెరిగిపోయింది. లాస్ట్ వీక్ దివ్య సేవ్ అయ్యింది కాబట్టి.. ఈసారి సుమన్ ను పంపిస్తారని అంతా అనుకున్నారు. ఇద్దరికి కాస్త తేడాతో తక్కువ ఓట్లు రావడంతో డేంజర్ జోన్ లో పడ్డారు. వీరిద్దరిని యాక్టివిటీ ఏరియాకు తీసుకెళ్లి.. హోస్ట్ నాగార్జున. అక్కడ వారికి ప్రత్యేకంగా రూపొందించిన 'అగ్నిపర్వతం' సెటప్ లో నిలుచోబెట్టారు. అక్కడే ఉన్న ఓ లిక్విడ్ ను చూపించి.. అది ఆ పర్వతంలో పోయాలి.. అగ్నిపర్వతంలో పూర్తిగా పోసిన తరువాత అందులోంచి ఎరుపు రంగు వస్తే మీరు ఎలిమినేట్ అయినట్టు, ఆకుపచ్చ వస్తే మీరు సేఫ్ అయినట్టు అని ప్రకటించారు.

34
సమన్ కోసం దివ్యను బలి చేశారా?

చివరి నిమిషం వరకూ.. సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడనే అంతా అనుకున్నారు. అగ్నిపర్వతంలో ద్రవాన్ని పోయగానే సుమన్ కు ఆకుపుచ్చ రంగు రావడం, దివ్య పోసిన వెంటనే ఎరుపు రంగు రావడంతో ఎలిమినేట్ అయినట్టు నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అసలు దివ్య గత వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్లో సంజన, దివ్య డేంజర్ జోన్లో ఉంది. అయితే అనూహ్యంగా ఇమ్మాన్యూయోల్ తన పవన్ ఉపయోగించి దివ్యను కాపాడారు. అయితే ఈ వారం సుమన్ ఎలిమినేషన్ అవ్వాల్సి ఉందని.. కావాలనే సుమన్ ను కాపాడటం కోసం దివ్యను బలిచేసి ఉంటారని కొంత మంది ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వారం దివ్య, సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, భరణి వంటి కీలకమైన కంటెస్టంట్లు ఉంజర్ జోన్లో ఉన్నప్పటికీ, తొలి నుంచి అత్యంత తక్కువ. ఓటింగ్ దివ్యకే సమోదయినట్టు సమాచారం.

44
దివ్య ఎలిమినేషన్ కు కారణాలు ?

దివ్య ఎలిమినేషన్ కు కారణం.. భరణి తో అతిగా బాండింగ్ ఎక్కువ అవ్వడం.. తనూజతో చీటికి మాటికి గొడవలు, ఒక సారి సేవ్ అయిన తరువాత కూడా భరణిపై పెత్తనం చెలాయించడం ఆడియన్స్ లో చాలా మందికి నచ్చలేదు. అంతే కాదు భరణి తో ఎవరికైనా డిస్కర్షన్ జరిగితే చాలు దివ్య మధ్యలో దూరిపోతుంటుంది. భరణి తనూజతో మాట్లాడితే చాలు గొవడ పెట్టుకుంది. దీంతో ఆమె పై నెగిటివిటీ పెరిగింది. దివ్య డిమాండింగ్ వల్లే భరణి ఆట తగ్గిపోయిందని నెటిజన్స్ అభిప్రాయం. దీంతో దివ్య బయటకు పంపిస్తే బెటర్ అంటూ మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ పెంచి.. దివ్యకు తగ్గించినట్టు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories