ఐపీఎల్ రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్, నార్త్ లో రచ్చ రచ్చ చేస్తోన్న పుష్పరాజ్

Published : Jun 14, 2025, 06:14 PM IST

రిలీజ్ అయ్యి 6 నెలలు దాటినా ఇంకా పుష్ప2 మ్యానియా తగ్గలేదు. మరీ ముఖ్యంగా నార్త్ లో పుష్పరాజ్ ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నాడు. ఎంతలా ఉంటే అల్లు అర్జున్ దెబ్బకు ఐపీఎల్ రికార్డ్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి. 

PREV
16

పుష్ప, పుష్ప2 సినిమాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు, అంతే కాదు టాలీవుడ్ కు ఫస్ట్ టైమ్ హీరో కేటగిరిలో జాతీయ అవార్డ్ వచ్చింది, అంతేనా.. ఈసినిమాతో ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేశాడు బన్నీ. రిలీజ్ అప్పటి నుంచి ఏదో ఒక రికార్డ్ ఇలానే బ్రేక్ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ తాజాగా మరో ఘనత సాధించాడు.

26

పుష్ప2 సినిమాకు సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అక్కడే ఎక్కువగా ఈ సినిమాను ఆదరించారు ఆడియన్స్. ఇక హిందీ థియేటర్లలోనే కాదు, హిందీ టెలివిజన్‌లో కూడా పుష్ప సినిమా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా నార్త్ లో టెలికాస్ట్ అయ్యి సంచలన రికార్డు సృష్టించింది.

36

ఇండియా వైడ్ టీవీ రేటింగ్స్ (TVR) ప్రకారం, ఈ సినిమా మొదటి ప్రీమియర్‌లో 5.1 TVR సాధించింది, ఇది ఐపీఎల్ 2025 ఫైనల్‌కు వచ్చిన కంటే ఎక్కువ. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు 4.6 TVR రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో హిందీ బుల్లితెరపై ఐపీఎల్‌ను మించి అల్లు అర్జున్ మ్యానియా కొనసాగింది. ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

46

అలాగే, 'పుష్ప 2' టెలికాస్ట్ హిందీ టెలివిజన్‌లో 'స్త్రీ 2' వంటి భారీ హిట్ సినిమాల రికార్డులను కూడా అధిగమించింది. ఈ విజయంతో, అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌లో తన స్థాయిని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు.

56

ఈ రికార్డుతో హిందీ ఆడియన్స్ లో అల్లు అర్జున్ క్రేజ్‌ను నిరూపిస్తుంది. బన్నీకి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఇది 'పుష్ప 2' సినిమా విడుదలకు ముందు హిందీ మార్కెట్‌లో ఏర్పడిన అంచనాల ఫలితంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ నటన, స్టైల్, డైలాగ్ డెలివరీ వంటి అంశాలు ప్రేక్షకులనుద బాగా ఆకట్టుకున్నాయి.

66

అంతే కాదు అక్కడి ఆడియన్స్ పుష్ప స్టైల్ ను కూడా ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ క్రేజ్‌ అక్కడ ఎంతలా ఉందంటే.. ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగింది నార్త్ లో. పుష్ప వల్ల సౌత్ సినిమాల డిమాండ్ హిందీ టెలివిజన్‌లో మరింతగా పెరిగింది. మొత్తానికి, 'పుష్ప 2' టెలికాస్ట్ హిందీ టెలివిజన్‌లో ఐపీఎల్ 2025 రేటింగ్స్‌ను మించి సంచలన రికార్డు సృష్టించడం ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories