సినిమా ప్రముఖులకు గుర్తింపునిచ్చేవి అవార్డులే. అందులోనూ భారతీయ సినీ ప్రముఖులు అందరూ గెలుచుకోవాలని కలలు కనేే అవార్డు ఏదైనా ఉందంటే.. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ అవార్డు. ఇంతటి విలువైన ఈ జాతీయ అవార్డును ఒక్కసారి కూడా గెలుచుకోని దిగ్గజాలు కూడా చాలా మంది ఉన్నారు.
ముఖ్యంగా చిరంజీవి, రజనీకాంత్ లాంటి స్టార్స్ కూడా ఇంత వరకూ ఒక్క జాతీయ అవార్డు కూడా గెలుచుకోలేదు. హీరోలు మాత్రమే కాదు దర్శకులు, సంగీత దర్శకుల్లో కూడా చాలామంది దిగ్గజాలు ఈ అవార్డ్ ను అందుకోలేదు. ఇక ఇప్పటి వరకు సంగీత ప్రపంచంలో అత్యధిక జాతీయ అవార్డులు గెలుచుకున్న సంగీత దర్శకులు ఇద్దరే. ఒకరు ఇళయరాజా, మరొకరు ఏ.ఆర్.రెహమాన్.
24
ఇళయరాజా vs ఏ.ఆర్.రెహమాన్
ఇళయరాజా ఇప్పటివరకు 5 సార్లు, ఏ.ఆర్.రెహమాన్ 7 సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఏ.ఆర్.రెహమాన్ గెలుచుకున్న తొలి జాతీయ అవార్డు వెనుక ఒక చిన్న కథ ఉంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడిగా పరిచయమైన సినిమా రోజా. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు.
చేసిన మొదటి సినిమాకే జాతీయ అవార్డ్ అందుకున్నారు రెహమాన్. ఈ చిత్రంలోని అన్ని పాటలూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పటి వరకు ఇళయరాజాపైనే ఆధారపడిన దర్శకులకు రోజా చిత్రం ద్వారా కొత్త దారి చూపించారు ఏ.ఆర్.రెహమాన్.
34
జాతీయ అవార్డు కోసం రెహమాన్ తో పోటీ పడ్డ ఇళయరాజా
రోజా చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ జాతీయ అవార్డుకు నామినేట్ అయిన సమయంలోనే ఇళయరాజా సంగీతం అందించిన క్లాసిక్ మూవీ దేవర్ మగన్ కూడా పోటీలో ఉంది. రెండు సినిమాలు పాటల పరంగా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎవరికి జాతీయ అవార్డు ఇవ్వాలనేది నిర్ణయించాల్సిన జ్యూరీ సభ్యులు కూడా తికమక పడ్డారు.
ఇందులో జ్యూరీ సభ్యులు రెండు సినిమాలకు చెరో 6 ఓట్లు వేశారట. చివరగా విజేతను నిర్ణయించే ఒక ఓటును అప్పటి జ్యూరీ సభ్యుడైన ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర వేయాల్సి వచ్చింది. ఆ ఒక్క ఓటును ఆయన ఏ.ఆర్.రెహమాన్‌కు వేయడంతో, ఒక్క ఓటు తేడాతో ఇళయరాజా జాతీయ అవార్డును కోల్పోయారు. ఈ విషయాన్ని బాలు మహేంద్ర ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పారు.