అదృష్టం లేకున్నా తగ్గని క్రేజ్.. వరుస ఆఫర్లతో బిజీబిజీ.. ఈ హీరోయిన్ ఎవరంటే.?

Published : Oct 23, 2025, 06:16 PM IST

Actress: బాలీవుడ్‌లో శ్రీలీల వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఆమె హిందీ డెబ్యూ చిత్రానికి ముందే రెండో సినిమా ఆఫర్‌ను అందుకుంది. ప్రస్తుతం ఆషికీ 3లో నటిస్తున్న శ్రీలీల.. దోస్తానా 2లో కూడా హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

PREV
15
బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు

శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. ఇంకా హిందీలో అరంగేట్రం చేయకముందే రెండో సినిమా ఆఫర్‌ను దక్కించుకుంది. దీన్ని బట్టి చూస్తే.. రష్మిక మందన్నా మాదిరిగా శ్రీలీల కూడా బాలీవుడ్‌లో స్థిరపడే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీలీల ఆషికీ ఫ్రాంచైజీ మూడవ భాగంలో కార్తీక్ ఆర్యన్‌ సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే.

25
మూవీ ఇంకా సెట్స్ మీద ఉన్నలోపే..

ఈ మూవీ ఇంకా సెట్స్ మీద ఉన్నలోపే దోస్తానా 2 చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు రణవీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ కలిసి నటించిన ఒక యాడ్‌ను అట్లీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

35
రూ. 150 కోట్లతో యాడ్

ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా రూ. 150 కోట్లతో నిర్మించారు. ఈ యాడ్‌లో శ్రీలీల రెడ్ డ్రెస్సులో గ్లామరస్‌గా కనిపించింది. బాలీవుడ్ స్టైల్‌కు తగ్గట్టుగా ఆమె బాడీ లాంగ్వేజ్ ఉండటంతో.. మరికొంతమంది బీ-టౌన్ నిర్మాతలను ఆమె ఆకర్షించింది.

45
పుష్ప-2 మూవీతో క్రేజ్

గతంలో కొన్ని ఫ్లాప్‌లతో ఇబ్బంది పడిన శ్రీలీల.. పుష్ప-2 మూవీలో ఐటెం సాంగ్ చేసి అందరినీ అలరించింది. పుష్ప-2 మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ కావడంతో.. శ్రీలీల పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతోనే ఆమెకు హిందీలో వరుసగా ఆఫర్లు వస్తున్నట్టు టాక్. ఇక తాజాగా విడుదలైన Chings Ad ఆమెకు బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టేలా ఉంది.

55
శ్రీలీల చేతిలో నాలుగు చిత్రాలు..

కాగా, శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రెండు, హిందీలో ఒకటి, తమిళంలో ఒక చిత్రం చేస్తోంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన 'ఆషికి 3'లో నటిస్తుండగా.. తమిళంలో 'పరాశక్తి' సినిమా చేస్తోంది. అటు తెలుగులో రవితేజతో 'మాస్ జాతర'.. పవన్ కళ్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు చేస్తోంది. ఈ రెండు చిత్రాలు హిట్ అయితే.. శ్రీలీల మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ స్టేటస్ దక్కించుకోవడం ఖాయం.

Read more Photos on
click me!

Recommended Stories