23 ఏళ్లకే 250 కోట్లకు పైగా ఆస్తి.. ఈ సీరియల్ బ్యూటీకి షారుఖ్ ఖాన్ ను మించి ఫాలోయింగ్..

Published : Nov 05, 2025, 06:03 AM IST

ఈ మధ్య సినిమా హీరోయిన్లే కాదు, సీరియల్  తారలు కూడా బాగా ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించి క్రేజ్ సంపాదిస్తున్నారు. అవును. ఈ మధ్య ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో క్రేజ్ తో పాటు 23 ఏళ్ల వయస్సులో 250 కోట్లు ఆస్తులు కూడా సంపాదించింది. 

PREV
17
సినిమాలపై సీరియళ్ల డామినేషన్

సినిమాలను మించి సీరియళ్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సీరియళ్లు చూడకుండా తిండి కూడా తినని వారు ఉన్నారు. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ తర్వాత సీరియళ్లు చూసేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. చాలా సీరియళ్లు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి. సీరియళ్లలో నటించిన చాలామంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు పొందుతున్నారు.

27
హీరోయిన్ల క్రేజ్

ఇప్పుడు చాలామంది హీరోయిన్లు హీరోల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది యంగ్  హీరోయిన్లు  తక్కువ టైంలోనే స్టార్‌డమ్ అందుకుంటున్నారు. హీరోయిన్ల కోసమే సినిమాలకు వెళ్లేవాళ్లు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది అందగత్తెలు రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.

37
సీరియల్ హీరోయిన్ల క్రేజ్

కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య సినిమా హీరోయిన్లే కాదు, సీరియల్ తారలు  కూడా ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించి క్రేజ్ సంపాదిస్తున్నారు. అవును… ఈ మధ్య ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది. క్రేజ్ లో స్టార్ హీరోలను మించిపోయింది. 

47
హీరోలకంటే ఎక్కువ ఫాలోవర్స్

ఆ సీరియల్ నటి ఎవరో కాదు జన్నత్ జుబైర్. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోవర్లు, ఎక్కువ ఆస్తులను సంపాదించింది జన్నత్. కేవలం  23 ఏళ్ల వయసులో 250 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించుకుంది బ్యూటీ. ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటిగా రికార్డు సాధించింది.  

57
షారుఖ్ ఖాన్‌ను కూడా దాటేసింది

జన్నత్ జుబైర్ చిన్న వయసులోనే స్టార్‌డమ్ సంపాదించింది. సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నటిని లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. ఫాలోవర్ల విషయంలో షారుఖ్ ఖాన్‌ను కూడా దాటేసింది.

67
బాలనటిగా కెరీర్ ప్రారంభించి

జన్నత్ జుబైర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 49.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. బాలనటిగా బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ,  ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హోదా పొందింది. చాలా సీరియళ్లలో నటించింది. రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన 'హిచ్కి'లో కూడా యాక్ట్ చేసింది.

77
సీరియల్స్ తో పాటు టీవీ షోస్

సీరియళ్లతో పాటు జన్నత్ జుబైర్ చాలా టీవీ షోలలో కూడా కనిపించింది. జన్నత్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఒక్క ఫోటో షేర్ చేసినా చాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. బాలీవుడ్ లో ఈ రేంజ్ ఇమేజ్.. మరే సీరియల్ నటికి లేదనే చెప్పాలి. 

Read more Photos on
click me!

Recommended Stories