బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో రోజుకో రచ్చ జరుగుతోంది. ప్రతీ ఎపిసోడ్ చాలా ఉత్కంఠ కలిగేలా ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఈక్రమంలో నామినేషన్లు రచ్చ అయిపోయిన వెంటనే కెప్టెన్సీ టాస్క్ ను స్టార్ట్ చేశాడు బిగ్ బా.. ఈ టాస్క్ లో రెబల్స్ తో రచ్చ చేయిస్తున్నాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 .. ప్రతీ రోజు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో.. ఆడియన్స్ కు థిల్లింగ్ కంటెంట్ ను అందిస్తున్నారు. ప్రతీ రోజు పక్కా ప్లానింగ్ తో.. ఎంటర్టైన్ మెంట్ ను అందిస్తున్నారు టీమ్. వీకెండ్ హడావిడి అయిపోయిన తరువాత, నామినేషన్స్.. ఆతరువాత, కెప్టెన్సీ టాస్క్ లతో అదరగొట్టేస్తున్నారు. ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ కు సంబంధించి హడావిడి నడుస్తుంది బిగ్ బాస్ లో.. అందుకోసం మూడు టీమ్ లను ఫామ్ చేయగా.. అందులో సభ్యులను ఎంచుకునే అవకాశం వారికే ఇచ్చాడు బిగ్ బాస్. బ్లూ, పింక్, ఆరెంజ్ టీమ్స్ మధ్య కంటెండర్ పోటీ రసవత్తరంగా సాగుతోంది. అందులో ఇద్దరిని రెబల్స్ గా మార్చి.. సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈమూడు టీమ్ లకు డిఫరెంట్ టాస్క్ లు ఇస్తూ.. రెబల్స్ తో వారి పని వారిని చేయిస్తున్నాడు. బిగ్ బాస్ లో ఫస్ట్ రెబల్ గా సుమన్ శెట్టి ఉండగా.. రెండో రెబల్ గా దివ్యాను నియమించాడు.
24
పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు
రెబల్స్ గా మారిన సుమన్ శెట్టి, దివ్యలకు డిఫరెంట్ సీక్రేట్ టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. అందులో దివ్య తన టాస్క్ ను కంప్లీట్ చేయడంతో.. ఒకరిని కంటెడర్ రేస్ నుంచి తప్పించే అవకాశం ఆమెకు వచ్చింది. దాంతో దివ్య, సుమన్ మాట్లాడుకొని.. పవన్ కళ్యాణ్ ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించాలని బిగ్ బాస్ కు సీక్రేట్ గా చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ ఈ టాస్క్ నుంచి తప్పుకోవాలని.. ఫోన్ ద్వారా బిగ్ బాస్ ఆదేశించారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ విషయం విని.. నవ్వుతూ కనిపించినా.. అతనిలో ప్రెస్టేషన్ బాగా తెలిసింది. నా బొంద, శార్ధం అంటూ.. పెద్ద మాటలు మాట్లాడాడు కళ్యాణ్. ఇక హౌస్ లో అందరికోసం తెచ్చిన పాలను తాగాలని, ఫ్రిడ్జ్ లోని పాల పాకెట్లను స్టోర్ రూమ్ లో ఎవరు చూడకుండా పెట్టాలని సుమన్, దివ్వాలకు బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా.. ఈమధ్యలో పవన్ కళ్యాణ్ కు కాస్త అనుమానం వచ్చింది. కానీ దివ్య కవర్ చేయడంతో.. టాస్క్ ను ఇద్దరు సక్సెస్ చేశారు.
34
పవన్, రీతూ..మధ్యలో దివ్య
బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ప్రకారం పవన్ , రీతూ మాట్లాడుకోకూడదు. కానీ డిన్నర్ టైమ్ లో వారు మాట్లాడుకునే ప్రయత్నం చేయగా.. దివ్య వారిని అడ్డుకుంది. మీరు మాట్లాడకూడదు.. అది చూసే బాధ్యత నాకు అప్పగించారు.. అని స్ట్రిక్ట్ గా చెప్పడంతో.. దివ్య మీద కోపంతో ఊగిపోయింది రీతూ. టాస్క్ గురించి మాట్లాడుతున్నాం.. అన్నం తింటున్నాం.. ఇలా రకరకాల కారణాలు చెపుతూ.. రీతూ వాదించే ప్రయత్నంచేసింది. ఇక రీతూను ఓదార్చేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఆమెకు విషయం వివరంగా చెప్పే ప్రయత్నం చేశాడు. నీకు ఇచ్చింది టాస్క్ కాదు.. పనిష్మెంట్.. అలాంటప్పుడు నువ్వు పవన్ తో ఎలా మాట్లాడతావు.. అని పవన్ రీతూను ప్రశ్నించాడు. దాంతో పవన్ పై ఆమె ఫైర్ అయ్యింది. అక్కడ చిన్న గొడవ జరిగింది.
ఇక టీమ్ లో అందరు సెట్ అయ్యారు కానీ.. సంజనాను ఏవరు తీసుకోకపోవడంతో.. ఆమె ఒంటరిగానే మిగిలిపోయింది. దాంతో ఆమెను సంచాలక్ గా నియమించారు బిగ్ బాస్. కెప్టెన్సీ కంటెండర్ మొదటి టాస్క్ ను చాలా సింపుల్ గా ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో ఆరెంజ్ టీమ్ గెలిచింది. దాంతో వారికి ఇమ్యూన్ పవర్ ఉన్న గ్రీన్ బాడ్జ్ ను బిగ్ బాస్ గిఫ్ట్ గా ఇచ్చారు. టీమ్ అంతా మాట్లాడుకుని.. ఆ బ్యాడ్జ్ ను ఇమ్మాన్యూయెల్ కు ఇచ్చారు. ఇక ఏ టీమ్ కు ఆ టీమ్.. తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగానై ఈసారి కెప్టెన్సీని కొట్టేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్సీ టాస్క్ లు మరో రెండు రోజులు జరుగుతాయి. మరి అప్పటి వరకూ ఎవరు విన్ అవుతారు.. 9 వీక్ కెప్టెన్ గా ఎవరు గెటుస్తారో చూడాలి.