రజినీకాంత్ తో సినిమాను.. 4 సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Nov 04, 2025, 06:40 PM IST

రజినీకాంత్‌తో ఒక్క సినిమాలోనైనా నటించే అవకాశం రాదా అని చాలా మంది హీరోయిన్లు ఎదురుచూస్తుంటారు. అటువంటిది.. సూపర్ స్టార్ జోడీగా అవకాశం వస్తే.. ఏకంగా నాలుగు సినిమా ఆఫర్లను తిరస్కరించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

PREV
14
ఇండియన్ సినిమా సూపర్ స్టార్..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు రజినీకాంత్. 74 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ... వరుస విజయాలు సాధిస్తున్నాడు. అటువంటి ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో నటించడానికి ఏ హీరోయిన్ అయినా సరే ఎగిరి గంతేస్తూ.. ముందుకు రావాల్సిందే.. కానీ ఒక స్టార్ హీరోయిన్ రజినీతో నటించే అవకాశాన్ని నాలుగుసార్లు తిరస్కరించింది. రజనీకాంత్ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ఇది జరిగింది. అవును, మంగళూరుకు చెందిన ఆ ఇండియాన్ స్టార్ హీరోయిన్ ఎవరు..?

24
నరసింహా సినిమాతో ఫస్ట్ ఆఫర్ మిస్

1999లో వచ్చిన రజినీకాంత్ 'నరసింహ' (పడయప్ప) సినిమాలో మొదటగా అవకాశం ఈ స్టార్ హీరోయిన్ కే ఇచ్చారు. కనీ ఆమె ఈసినిమా చేయడానికి ఎందుకో నిరాకరించింది. బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్.. ఆటైమ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది. సరిగ్గా అప్పుడే రజినీకాంత్ 'బాబా' సినిమా కోసం కూడా ఈమెనే అడిగారు. కానీ ఆ సినిమాలో కూడా రజినీకాంత్ జోడీగా నటించడానికి ఆ హీరోయిన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ చిత్రంలో మనీషా కొయిరాలా ఆ పాత్రను పోషించింది.

34
గోల్డెన్ ఆఫర్ మిస్సైన హీరోయిన్

ఆ తర్వాత కాలంలో రజినీకాంత్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'చంద్రముఖి' కోసం కూడా మొదట ఈ హీరోయిన్ నే అనుకున్నారు. కానీ ఆమె ఆ ఆఫర్‌ను కూడా తిరస్కరించింది. దాంతో ఈ సినిమాలో జ్యోతికను తీసుకున్నారు. ఆ తర్వాత రజనీకాంత్ శంకర్ కాంబోలో వచ్చిన శివాజీ సినిమా కోసం కూడా ఈ బాలీవుడ్ బ్యూటీనే తీసుకోవాలని సంప్రదించారట. కానీ రజినీకాంత్ జోడీగా నటించడానికి మాజీ మిస్ వరల్డ్ మరోసారి అంగీకరించలేదని తెలుస్తోంది. దాంతో శ్రేయ శరణ్ ఈ చిత్రంలో రజినీకాంత్ జోడీగా నటించింది. ఇలా రజినీకాంత్ తో నాలుగు సినిమాలు మిస్ అయిన హీరోయిన్ ఎవరో కాదు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్.

44
రోబో సినిమాకు గ్రీన్ సిగ్నల్

ఇలా నాలుగు రజినీకాంత్ సినిమాలను తిరస్కరించిన హీరోయిన్ ఐశ్వర్య రాయ్. చివరకు సూపర్ స్టార్, శంకర్ కాంబినేషన్ మూవీ 'రోబో' (యంతిరన్)లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రజనీకాంత్ తో నటించడానికి ఎంత పెద్ద హీరోయిన్ అయినా కళ్లు మూసుకుని ఓకే చెపుతుంటారు. కానీ ఐశ్వర్య రాయ్ మాత్రం పలు కారణాల వల్ల నాలుగు సినిమాలు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎట్టకేలకు రోబో సినిమాలో రజినీకాంత్ తో నటించడం ద్వారా ఐశ్వర్యరాయ్ రజినీకాంత్ ఫ్యాన్స్ కోపం నుంచి తప్పించుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories