నటి శోభిత హైదరాబాద్‌లో ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే పెళ్లి, కన్నీళ్లు పెట్టిస్తున్న ఫోటోలు

First Published | Dec 1, 2024, 8:53 PM IST

తెలుగు, కన్నడ సీరియల్స్, సినిమాల్లో నటించిన కన్నడ నటి  శోభిత శివన్న హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన షాక్‌కి గురి చేస్తుంది. 

కన్నడ, తెలుగు సీరియల్‌, సినిమాల్లో నటించిన శోభిత ఆత్మహత్య చేసుకుంది. `ఎరడొంద్ల మూరు`, `ఏటీఎం`, `ఒంద్ కథే హేళ్ల` `జాక్‌పాట్`, `అపార్ట్‌మెంట్ టూ మర్డర్`, `వందన` సినిమాల్లో నటించింది.

బ్రహ్మగంటె, నిన్నిందలే  వంటి సీరియల్స్ లో నటించింది. తెలుగు సినిమాల్లో నటిస్తూ హైదరాబాద్‌లో స్థిరపడింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే ఉంటుంది. 


గతేడాది వివాహం చేసుకున్న శోభిత హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కానీ ఆమె మరణ వార్త టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 

హాసన జిల్లా, సకలేశపురకు చెందిన శోభిత `ఫస్ట్ డే ఫస్ట్ షో` తెలుగు సినిమాలో నటించింది. ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో శోభితకి అంతగా గుర్తింపు రాలేదు. 

రెండేళ్ల క్రితం వివాహం తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడింది శోభిత. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ఇప్పుడు హఠాన్మరణానికి కారణాలేంటనేది తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో పోస్ట్‌మార్టం అనంతరం బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. శోభిత మృతి పట్ల టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శోభిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

read more: అవినాష్‌ గ్రాండ్‌ ఫినాలేకి అర్హుడు కాడా? కొత్త చిచ్చు పెట్టిన బిగ్‌ బాస్‌.. కమెడియన్లని తొక్కేస్తారా?

Latest Videos

click me!