కృష్ణుడిగా నన్ను జనం చూస్తారా? అనుమానంతో ఎన్టీఆర్‌ ఏం చేశాడో తెలుసా? రాజమౌళిని మించిన స్ట్రాటజీ?

First Published | Dec 1, 2024, 5:55 PM IST

ఎన్టీ రామారావు ఎన్నో పౌరాణిక పాత్రలు పోషించారు. కానీ ఆయనకు ప్రారంభంలో ఓ డౌట్‌ ఉండేది. కృష్ణుడిగా తనని జనం ఆదరిస్తారా? లేదా అనే డౌట్‌ ఉండేది. 
 

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) ఏ పాత్ర వేసినా జనం జేజేలు పలికారు. ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. విజయాలు అందించారు. తెలుగు సినిమా తెరపై రాముడు అయినా, కృష్ణుడు అయినా ఎన్టీఆరే అనేంతగా ఆయన పాత్రలతో రక్తికట్టించారు. పాత్రల్లో జీవించారు. రాముడంటే జనాలకు తెలియదు. కృష్ణుడంటే ఎలా ఉంటాడో తెలియదు. రామరావు పోషించిన పాత్రలతో రాముడు ఇలానే ఉంటాడేమో అనే ఒక ఆలోచనకు వచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

అయితే ఎన్టీఆర్‌ ఫస్ట్ టైమ్‌ `మాయా బజార్‌`లో కృష్ణుడు పాత్ర పోషించాడు. అయితే తనని కృష్ణుడిగా జనం చూస్తారా అనే డౌట్‌ కలిగింది. అంతకు ముందు రెండు మూడు మైథలాజికల్‌ సినిమాల్లో పౌరాణిక పాత్రలు పోషించారు,కానీ అవి పెద్దగా పేరున్న పాత్రలు కాదు, పెద్దగా హిట్‌ కూడా కాలేదు.

దీంతో కృష్ణుడిగా తనని రిసీవ్‌ చేసుకుంటారా? ఆదరిస్తారా? చేసే తేడా కొడుతుందా అనే డౌట్‌ ఉండేది. దీంతో తనకు తానే చెక్‌ చేసుకోవాలనుకున్నారు ఎన్టీఆర్‌. ఓ పెద్ద మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. 


`మాయాబజార్‌`సినిమాకి నిర్మాత విజయ వాహిని స్టూడియో అధినేత నాగి రెడ్డి. ఆయనతో ఎన్టీఆర్‌ తన అభిప్రాయం చెప్పారు. దీంతో జనంలోకి వెళ్లే ప్లాన్‌ చేశారు. ముందుగానే కృష్ణుడు గెటప్‌లో ఫోటోలు తీయించి దాన్ని క్యాలెండర్‌గా ప్రింట్‌ చేయించారు. జనాలకు ఫ్రీగా పంచారు.

ఆ  క్యాలెండర్‌ చాలా మంది జనాల్లోకి వెళ్లింది. రెస్పాన్స్ అదిరిపోయింది. కృష్ణుడిగా ఎన్టీఆర్‌ బాగా ఉన్నాడని, లుక్‌ బాగుందని అంతా ప్రశంసించారు. దీంతో ఆ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న ఎన్టీఆర్‌, దర్శక నిర్మాతలు ఇక సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేశారు. 
 

అలా `మాయా బజార్‌`(1957) సినిమాలో ఎన్టీఆర్‌ కృష్ణుడిగా నటించి మెప్పించారు. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీని నాగిరెడ్డి నిర్మించారు. ఆయనతోపాటు చక్రపాణి మరో నిర్మాత. విజయవాహిని స్టూడియోలో చక్రపాణి కూడా పార్టనర్‌. గ్రాండ్‌గా ఈ మూవీని రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్‌ కృష్ణుడిగా నటించారు.

అక్కినేని నాగేశ్వరరావు అభిమాన్యుగా ఎస్వీ రంగారావు ఘటోత్కచుడిగా, సావిత్రి శశిరేఖగా నటించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు `బాహుబలి` రేంజ్‌ మూవీగా చెప్పొచ్చు.
 

ఇక అప్పట్నుంచి పౌరాణిక పాత్రలతో రెచ్చిపోయారు ఎన్టీఆర్‌. `వినాయక చవితి` సినిమాలో మరోసారి కృష్ణుడిగా మెప్పించారు. రాముడు, కర్నుడు, అర్జునుడు, అభిమాన్యుడు, దుర్యోధనుడు, కౌశికుడు, రావణుడిగా, విష్ణువుగా, వెంకటేశ్వర స్వామిగా, భిష్ముణిగా, శివుడిగా, శ్రీకృష్ణ దేవరాయగా, భీముడు, హరిశ్చంద్రుడు, దుశ్యంతుడిగా, యముడు, కీచకుడు, విశ్వామిత్రుడు ఇలా అనేక రకాలు పౌరాణిక పాత్రలతో మెప్పించారు. అలాగే హిస్టారికల్‌ రోల్స్ కూడా చేసి మెప్పించారు. కానీ రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోదనుడిగా ఎన్టీఆర్‌ని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమంటే అతిశయోక్తి కాదు. 

read more:సావిత్రి హీరోయిన్ అయితే నేను పాటలు పాడను.. తెగేసి చెప్పిన స్టార్‌ సింగర్‌, ఇద్దరికి గొడవేంటి?

also read: మహేష్‌ పైలట్‌, ఎన్టీఆర్‌ బిజినెస్‌ అడ్వైజర్‌, హీరోలు కాకపోతే సెట్‌ అయ్యే జాబులు.. హీరోయిన్‌ క్రేజీ కామెంట్‌
 

Latest Videos

click me!