Bigg boss telugu 8
బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ 13వారాలు పూర్తి కావస్తున్నాయి. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ షో పూర్తి కాబోతుంది. ఈ 8వ సీజన్ విన్నర్ ఎవరో తేలబోతుంది. ఈ క్రమంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విన్నర్ అతనే అని, ఆయనకే ఛాన్స్ ఉందని ఎవరికి వారు ప్రిడిక్షన్ చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్లు హౌజ్‌లో ఉన్నారు. వీరిలో ఆదివారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకా ఏడుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లో ఉంటారు. 14వ వారంలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. మరి ఒక్కరినే ఎలిమినేట్ చేస్తారా? ఇద్దరిని చేస్తారా అనేది సస్పెన్స్. అయితే ఒక్కరిని ఎలిమినేట్ చేస్తే ఇంకా ఆరుగురు ఉంటారు. ఆరుగురు ఫైనల్‌కి వెళ్తారు. అలా ఆరుగురిని ఫైనల్‌కి పంపిస్తారా? లేక వారిలో ఒకరిని మిడిల్ ఎలిమినేషన్ చేస్తారా అనేది చూడాలి. కానీ ఏదైనా జరగొచ్చు. సాధారణంగా ఫైనల్‌కి 5 మంది కంటెస్టెంట్లే పంపిస్తుంటారు. ఈ సారి ఏం చేస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే స్టార్ కమెడియన్ అవినాష్ ఇప్పటికే ఫైనలిస్ట్ అయ్యారు. బిగ్ బాస్ షోలో మోస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు ఎవరూ దీన్ని ఊహించలేదు. కమెడియన్లు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కే పరిమితం, కప్ గెలవడానికి పనికిరారు అనే భావన ఉండేది. కానీ ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేశాడు అవినాష్. ఫస్ట్ ఫైనలిస్ట్ గా మారి సంచలనం సృష్టించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అవినాష్ విషయంలో కొత్త రచ్చకి తెరలేపాడు బిగ్ బాస్. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా అర్హుడేనా అంటూ సరికొత్త చిచ్చు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. తాజాగా స్టార్ మా ఈషోకి పార్టనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తోపాటు స్టార్ మాలో ఈ షో టెలికాస్ట్ అవుతుంది.
అయితే అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కి అర్హుడేనా అంటూ పోల్ నిర్వహించింది స్టార్ మా. దీనికి స్పందించిన నెటిజన్లు అర్హుడు కాదంటూ ఎక్కుగా కామెంట్లు వస్తున్నాయి. అవినాష్ ఇప్పటికే ఎలిమినేట్ కావాల్సి ఉందని, నబీల్ కారణంగా సేవ్ అయ్యాడని అంటున్నారు. ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ ఫైనలిస్ట్ ఎలా అవుతాడని అంటున్నారు.