Intinti Gruhalakshmi: తులసి మాటలకు ఇంప్రెస్ అయిన సామ్రాట్.. ఒక్కటైన లాస్య దివ్య?

First Published Jan 18, 2023, 10:55 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో నందు ఇన్నేళ్ల క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు జాబు రాకపోవడం ఎంటో అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి నా ఎడమ కన్నా అదురుతుంది ఏం జరుగుతోంది అనుకుంటూ వెళ్తుండగా ఇంతలోనే ఒక కారు వచ్చి ఆపుతుంది. ఎవరు మీరు కారు వచ్చి అడ్డంగా ఆపుతున్నారు తెలివి ఉందా అని అనగా వాళ్ళు వచ్చి కారు కీస్ తీసుకోవడంతో ఎవరు మీరు కారు కీస్ తీసుకుంటున్నారు తప్పు కదా అని అందు అనడంతో అప్పుడు వాళ్ళు ఐడి కార్డు చూపించగా బ్యాంకు లోన్ తీసుకొని జల్సాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. ఈఏంఐ కట్టమని చెప్పి ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడం లేదు అని నందుని నడిరోడ్లో నిలదీస్తూ ఉంటారు.
 

ఈఎంఐ కట్టలేనిది నీకెందుకు కారు మర్యాదగా ఇకనుంచి వెళ్ళు అని అనగా సార్ మీరు మర్యాద తప్పి మాట్లాడుతున్నారు అని అంటాడు నందు. నేను సంఘంలో గౌరవం ఉన్న మనిషిని అనడంతో ఇక్కడ ఎలా ఉంటే మాకెందుకు మా ఈఎంఐ కట్టు అనగా ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను సార్ అనగా నువ్వు ఎక్కడికి వెళ్తే నాకెందుకు అని అంటారు బ్యాంక్ మేనేజర్స్. అప్పుడు నందుని నడిరోడ్డుపై అవమానించి కారు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు నందు పబ్లిక్ లో అలా జరగడంతో అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. డబ్బులు కూడా లేవు ఇంటర్వ్యూ కి ఎలా వెళ్లాలి అనుకుంటూ ఉంటాడు. ఒక వైపు తులసి ఫైల్స్ చూస్తూ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండే సామ్రాట్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది.

మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పా పెట్టకుండా మానేస్తే ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉంటుంది. చాలా అన్యాయం సర్ నాకు చాలా టెన్షన్ పెడుతున్నారు టెన్షన్ ఎందుకు ధైర్యంగా ఎదుర్కొండి అని అంటాడు సామ్రాట్. మీరు సీఈఓ గారు నేను జనరల్ మేనేజర్ ని అనడంతో అయినా పర్లేదు తులసి గారు మీరు వెళ్లి మీటింగ్ కి అటెంప్ట్ అవ్వండి అని అంటాడు సామ్రాట్. నోట్స్ రెడీ చేశాను సామ్రాట్ గారు అనడంతో నోట్స్ స్టడీ చేయడం కాదు బోర్డ్ ఆఫ్ మీరు కాంప్రమైజ్ చేయాలి ఓపెన్ చేయాలి అని అంటాడు. అప్పుడు తులసికి ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సామ్రాట్. ఆ తర్వాత మీటింగ్ మొదలవడంతో కలిసి ముందు మా సీఈఓ గారు మీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతారు. సారీ నేను అర్జెంట్ పని వల్ల రాలేకపోయాను. మా జనరల్ మేనేజర్ తులసి మీరు ఆమెను ప్రశ్నలు అడగవచ్చు అనడంతో అక్కడున్న బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇంగ్లీష్ లో అడగగా తులసి బిక్క మొహం వేస్తుంది.

అప్పుడు తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా నవ్వుతూ ఉండడంతో ఏంటి మేడం ఇది మేము సీరియస్ గా క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు నవ్వుతున్నారు ఏంటి అని అడుగుతారు వాళ్ళు. మీకు కోపం వస్తే కానీ తెలుగులో మాట్లాడరా ఇక్కడ మనమందరము తెలుగు వాళ్ళమే తెలుగు బాగా వచ్చిన వాళ్ళము అలాంటప్పుడు తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎందుకు అని అంటుంది తులసి. మనమే మన తెలుగు భాషకు గౌరవం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు అనడంతో సామ్రాట్ ఆలోచిస్తూ ఉంటాడు. మన మాతృభాషని గౌరవించుకోవడం అంటే మన తల్లిని గౌరవించుకోవడమే అంటూ తెలుగు భాష గొప్పదనం గురించి వివరించడంతో అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ ఇంప్రెస్ అయ్యి తులసికి చెప్పట్లు కొడతారు.
 

 ఆ తర్వాత మీటింగ్ గురించి మొత్తం తెలుగులో వివరిస్తుంది తులసి. తులసి ప్రాజెక్టు గురించి గొప్పగా వివరించడంతో బోర్డు మెంబర్స్ ఆ ప్రాజెక్టును ఓకే చెప్పి వెళ్లిపోతారు. ఆ తర్వాత సామ్రాట్ చూశారు కదా తులసి గారు మీ స్టామినా ఏంటో బోర్డు మెంబర్స్ ని మీరు ఒప్పించగలిగారు అనడంతో లేసి నవ్వుకుంటూ ఉంటుంది. మీరు రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అనగా నాలుగు రోజులు సమయం పడుతుంది. మీరు నాలుగు రోజుల వరకు ఇక్కడ అంతా చూసుకోవాలి అనడంతో బాస్ ఆర్డర్ వేసాక తప్పుతుందా అని అంటుంది తులసి. మరొకవైపు దివ్య తులసి అన్న మాట తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ల్యాప్టాప్ విషయం గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలోనే అక్కడికి లాస్య వస్తుంది.
 

అప్పుడు కావాలనే లాస్య దివ్యని రెచ్చగొడుతూ దివ్య మనసు మార్చి తులసి మీదికి రెచ్చగొట్టి పంపించాలని చూస్తూ ఉంటుంది. ఉన్నాను మీ అమ్మ మాట్లాడే విధానం అది కాదు కరెక్ట్ కాదు అంటూ దివ్య మనసుని మార్చి ప్రయత్నం చేస్తూ దివ్య మనసులో తులసిని విలన్ లా మారుస్తూ ఉంటుంది లాస్య. అప్పుడు లాస్య మాటలు నిజం అని నమ్మిన దివ్య సారీ అంటే మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇకమీదట నేను మీతో చనువుగా ఉంటాను అని లాస్య మాయ మాటలకు లొంగిపోతుంది. ఇప్పుడు లాస్య లాప్టాప్ నేను కొనిస్తాను అనడంతో దివ్య సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు లాప్టాప్ ఖరీదు ఎంత అనడంతో లక్ష ఐదు వేలు అనగా లాస్య షాక్ అవుతుంది. అనవసరంగా మాట ఇచ్చి బుక్ అయిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటుంది లాస్య.
 

ఏ లాప్టాప్ కొనాలి డిటెల్స్ అన్ని మీ మొబైల్ కి  పంపిస్తాను అనగా థాంక్యూ ఆంటీ అని ముద్దు పెట్టగా లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు తులసి మీటింగ్లో జరిగే ఉన్న విషయాలు తలుచుకొని నాకు ఇప్పటికీ షాకింగ్ గానే ఉంది. నేను బోర్డుని మెంబర్స్ ని నమ్మించాను మాట్లాడాను అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు అందరూ సంతోషపడుతూ సామ్రాట్ నింపబడుతూ ఉంటారు. ప్రేమ్ చెప్పింది నిజమే సామ్రాట్ కాదు లేకపోతే నాకు ఈ రోజు ఈ అవకాశం వచ్చేది కాదు ఆయన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అని తులసి కూడా సామ్రాట్ ని పొగుడుతూ ఉంటుంది. అందరూ సంతోష పడుతూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో నందు అక్కడికి వస్తాడు.

click me!