ఇప్పుడు ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు అని వాళ్ళు అడగగా ఒక అమ్మాయికి తన పేరుకు విలువ ఇవ్వడం లేదు. పుట్టిన వెంటనే మంచి పేరు పెట్టినా సరే పలానా వారి భర్తగానూ, పలానా వారి కూతురుగాను, పలానా వారి అమ్మగానూ, మిగిలిపోతుంది తప్ప తన పేరు ఎప్పటికీ నిలవడం లేదు ఆఖరికి ఇంటి బయట బోర్డ్ లో కూడా తన పేరు ఉండడం లేదు. నా పేరు, నా గౌరవం దక్కించినందుకు ధన్యవాదాలు సామ్రాట్ గారు అని తులసి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!