Liger: 'లైగర్' మూవీని దెబ్బతీసిన 5 కారణాలు.. ఇవన్నీ గాలికొదిలేసి ఒక్కదాని పైనే పూరి ఫోకస్..

First Published Aug 25, 2022, 11:04 AM IST

విజయ్ దేవరకొండ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాడు అంటూ ఎంతో హడావిడి నడిచింది. యూత్ లో విజయ్ దేవరకొండకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీ తెరకెక్కింది.

విజయ్ దేవరకొండ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాడు అంటూ ఎంతో హడావిడి నడిచింది. యూత్ లో విజయ్ దేవరకొండకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీ తెరకెక్కింది. ఫస్ట్ లుక్ అప్పటి నుంచి పాలన్ ఇండియా చిత్రంగా భారీ హైప్ బిల్డప్ అవుతూ వచ్చింది. దీనితో పూరి, విజయ్ కలసి ఏదో అద్భుతమే చేయబోతున్నారని సినీ ప్రేక్షకులంతా భావించారు. 

నేడు గ్రాండ్ గా లైగర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలని తారుమారు చేస్తూ తొలి షో నుంచే లైగర్ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. సినిమా తీవ్రంగా నిరాశపరిచింది అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన లైగర్ చిత్రాలు ఇలా నీరుగారడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. 

ముందుగా విజయ్ తల్లి పాత్రలో నటించిన రమ్యకృష్ణ రోల్. రమ్యకృష్ణకి పవర్ ఫుల్ లో పడితే ఆమె చించి పడేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ లైగర్ చిత్రంలో ఆమె పాత్ర గోల గోల గా ఉందని అంటున్నారు. విజయ్ దేవరకొండతో మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు అంతగా పండలేదు. ఆమె పాత్రలో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఓవర్ డోస్ అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

రెండవ కారణం హీరో పాత్రకి ఉన్న నత్తి. సూపర్ స్టైలిష్ గా ఉంటూ గలగలా మాట్లాడే విజయ్ దేవరకొండకి పూరి జగన్నాధ్ ఈ నత్తిని అంటించడం సెట్ కాలేదు. ఇటీవల చిత్రాల్లో హీరోలకి ఏదైనా లోపం ఉంటే అది స్పెషల్ అసెట్ అవుతోంది. పూరి కూడా అదే తరహాలో అలోచించి విజయ్ పాత్రకి నత్తిని పెట్టారు. అది కాస్త బెడిసికొట్టింది. విజయ్ దేవరకొండ నత్తితో మాట్లాడడం ట్రైలర్ లో సినిమాకి హైప్ పెంచడంలో వర్కౌట్ అయింది కానీ.. సిల్వర్ స్క్రీన్ పై కలసి రాలేదు. కథపై ఫోకస్ పెట్టకుండా పూరి జగన్నాధ్ అనవసరంగా జోడించిన హంగుల్లో ఇది ఒకటి. 

ఇక మూడవ కారణం గురించి చెప్పుకోవాలంటే హీరోయిన్ అనన్య పాండే. సాధారణంగానే పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర నుంచి పాటలు, రొమాన్స్ తప్ప ఏమీ ఆశించలేం. లైగర్ మూవీ ప్రమోషనల్ కంటెంట్ లో కూడా అదే అర్థం అయింది. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ కనీసం సినిమాని నడిపించే విధంగా కూడా లేకపోవడం మైనస్ గా మారింది. లైగర్ చిత్రానికి బిగ్ డ్రాబ్యాక్ లో హీరోయిన్ సీన్స్ ని ప్రధానంగా చెబుతున్నారు. 

Liger Movie

చిత్రానికి మైనస్ గా మారిన మరో కారణం అంటే మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఒకటి రెండు పాటలు యూత్ కి క్యాచీగా అనిపించేలా ఉన్నాయి. అవి కూడా రిపీట్ గా వినేంత గొప్ప సాంగ్స్ కాదు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్, విక్రమ్ ఇలా పలువురు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారు. వీరు అందించిన బిజియం పేవలంగా ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

లైగర్ చిత్రాన్ని దెబ్బ తీసిన కారణాల్లో చివరగా చెప్పుకోవాల్సింది పెరిగిన హైప్. ఊహించని విధంగా ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో హైప్ పెరిగింది. రొటీన్ పూరి స్టైల్ సినిమాకి భారీ స్థాయిలో హైప్ ఇచ్చారు. నార్త్ లో విజయ్ కి క్రేజ్ పెంచే ప్రయత్నం చేశారు. మైక్ టైసన్ ని తీసుకురావడం, ప్రమోషనల్ కంటెంట్ లో విజయ్ ని బోల్డ్ గా ప్రజెంట్ చేయడం (ఉదాహరణకి విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్) వల్ల సినిమాకి రెట్టింపు హైప్ వచ్చింది. కానీ మూవీ ఆ స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ఈ చిత్రానికి క్రేజ్ తెచ్చిపెట్టిన అంశాలు ఏవీ సిల్వర్ స్క్రీన్ పై వర్కౌట్ కాలేదు. హైప్ అనే ఒక్క అంశంపైనే పూరి స్ట్రాంగ్ గా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. 

కానీ ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టేశాడు అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ తన మేకోవర్, పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. నత్తి అంశాన్ని పక్కన పెడితే.. విజయ్ స్క్రీన్ ప్రజెన్స్ బావుందని.. ఫైటర్ గా అద్భుతంగా కనిపించాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. 

click me!