ఎపిసోడ్ ప్రారంభంలో కేసు రీ ఓపెన్ చేయిస్తాను లాస్య ఆంటీ చెప్పినవన్నీ అబద్ధాలు అని నిరూపిస్తాను అంటూ ఎమోషనల్ అవుతుంది దివ్య. ఆ మాటలు విన్న తులసి దివ్య ఎక్కువగా రియాక్ట్ అవుతుంది ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తుందో అని భయపడుతూ భర్తకి ఏదో సైగ చేస్తుంది. అర్థం చేసుకున్న నందు నాకు ఒక మాట ఇవ్వు దివ్య అని విషయం చెప్పకుండా మాట తీసుకుంటాడు.