Intinti Gruhalakshmi: అసలు మీరు ఎవరు మిస్టర్.. నన్ను ప్రశ్నిస్తున్నారు.. నందు పరువు తీసిన తులసి!

Published : May 03, 2022, 12:15 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Intinti Gruhalakshmi: అసలు మీరు ఎవరు మిస్టర్.. నన్ను ప్రశ్నిస్తున్నారు.. నందు పరువు తీసిన తులసి!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే తులసి (Tulasi) తనకు ప్రవళిక డ్రస్సులు కొనిపెట్టింది అని చెబుతుంది. అంతేకాకుండా మేమిద్దరం చిన్నప్పటి లాగా చాలా అల్లరి చేసాం అని తన ఫ్యామిలీ తో పంచుకుంటుంది. తులసి ఆనందాన్ని చూసిన అనసూయ (Anasuya) దంపతులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు.
 

26

ఇక దివ్య (Divya) తులసి ప్రవళిక లు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని వెళుతుంది. మరోవైపు ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసిన లాస్య కు తులసి వాళ్ళ సెల్ఫీలు కనబడతాయి. దాంతో లాస్య ఆశ్చర్యపోతుంది. ఆ ఫోటోలు నందు (Nandhu) కు  చూపించి లాస్య మరిన్ని మాటలు నూరి పోస్తుంది.
 

36

ఆ తర్వాత నందు (Nandhu) కు తన ఫ్రెండ్ కాల్ చేసి ఏరా నిన్ను వదిలేశాక నీ భార్య బాగానే ఇంప్రూవ్ అయ్యింది అని అంటాడు. ఇప్పుడే సోషల్ మీడియాలో పోస్ట్ చూసాను అని అంటాడు. దాంతో నందు కి మరింత తల తీసేసినట్టు గా అవుతుంది. మరోవైపు తులసి (Tulasi) తన ఆనందాన్ని ప్రేమగా గులాబీ చెట్టు తో షేర్ చేసుకుంటుంది.
 

46

మరోవైపు ప్రేమ్ (Prem) శృతికి తానే స్వయంగా చేతి తో గోరు ముద్దలు పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత శృతి కాళ్లు పట్టుకుంటూ.. తనకు టాబ్లెట్ లు కూడా ప్రేమ గా వేస్తాడు. ఇక శృతి (Shruthi) ఆడదాని మనసు ఇంత గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరు అని ప్రేమ్ గుండెల పై నిద్ర పోతుంది.
 

56

దాంతో ప్రేమ్ (Prem) మా అమ్మ 20 సంవత్సరాలకు పైగా మా నాన్నతో నరకయాతన పడింది అని అంటాడు. ఆ క్రమంలో తన తల్లి.. తండ్రి విషయంలో ఎంత గౌరవంగా ఉందో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ఆ మాటలు విన్న శృతి (Shruthi) కంట కన్నీరు పెడుతుంది.
 

66

ఇక తరువాయి భాగంలో తులసి (Tulasi) ను వర్క్ అవుట్ కాస్ట్యూమ్స్ లో చూసిన నందు (Nandhu) తన పెద్దరికాన్ని అవమాన పరుస్తూ తులసి ను ఒక మాట అంటాడు. దాంతో తులసి మీరెవరో తెలుసుకోవచ్చా? అని అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories