Janaki Kalaganaledu: నా చెల్లి డిగ్రీ చదివింది.. నువ్వు ఆరో తరగతి పాస్ అవ్వలేదు.. రామచంద్రను అవమానించిన యోగి!

Published : May 03, 2022, 11:08 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu ) సీరియల్ మంచి పరువుగల కుటుంబం అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Janaki Kalaganaledu: నా చెల్లి డిగ్రీ చదివింది.. నువ్వు ఆరో తరగతి పాస్ అవ్వలేదు.. రామచంద్రను అవమానించిన యోగి!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జానకి (Janaki) రుక్మిణిని కౌగిలించుకొని నువ్వు నిజంగా దేవతలా వచ్చావు ఆ సంతోషానికి కారణం నువ్వే అని అంటుంది. ఇక రుక్మిణి (Rukmini) త్వరలో నువ్వు ఐపీఎస్ అవ్వాలి మా దోస్తు ఐపీఎస్ అయ్యిందని మేము గర్వంగా చెప్పుకోవాలని జానకితో అంటుంది.
 

26

ఇక యోగి (Yogi) ఫ్రెండ్ అయినటువంటి లాయర్ విడాకుల ప్రస్తావన తెస్తాడు. దాంతో యోగి ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నారు అవసరం లేదని అంటాడు. ఇక లాయర్ మాటలు విన్న మల్లిక (Mallika) రామచంద్ర దగ్గరికి వెళ్లి సీతారాముల లాంటి మిమ్మల్ని శాశ్వతంగా విడదీసే కుట్ర జరుగుతుంది అని యోగి గురించి తప్పుగా చెబుతుంది.
 

36

అంతేకాకుండా నల్లకోటు వేసుకునే లాయర్లు కోర్టుకు వెళతారు ఇలాంటి ఫంక్షన్ లకు ఎందుకు వస్తారు చెప్పండి అని మల్లిక (Mallika) అంటుంది. ఇక దాంతో యోగి గురించి అపార్థం చేసుకున్న రామచంద్ర యోగి దగ్గరకు వెళ్లి నానా రకాలుగా విరుచుకుపడతాడు. ఆ క్రమంలో యోగి (Yogi) ఎంత చెప్పిన వినకుండా రామచంద్ర కోపంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
 

46

ఇక రామచంద్ర (Ramachandra) మాటలకు అసహనం వ్యక్తం చేసిన యోగి (Yogi) రామచంద్ర పై తిరగబడతాడు. అంతేకాకుండా నా చెల్లెలు డిగ్రీ చదివింది. నువ్వు ఆరో తరగతి కూడా పాస్ అవ్వలేదని రామచంద్ర ను అవమానిస్తాడు. చూస్తూ చూస్తూ వంటలు చేసుకునే అబ్బాయికి డిగ్రీ చదివిన అమ్మాయిని ఎవరైనా ఇస్తారా అని అంటాడు.
 

56

దాంతో నా భర్తను ఇంకొక మాట అన్నావంటే చంపేస్తానని జానకి (Janaki) యోగి తో అంటుంది. ఇక యోగి అన్న మాటలకు రామచంద్ర సిగ్గుతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు. జానకి యోగిని అనేక మాటలు అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఫంక్షన్ కు వచ్చాను కాబట్టి నిన్ను వదిలిపెట్టి వెళుతున్నాను అని జ్ఞానాంబ (Jnanamba) యోగి తో చెప్పి వెళుతుంది.
 

66

ఇక తరువాయి భాగం లో జ్ఞానాంబ (Jnanaamba) వీటన్నిటికి నువ్వే కారణం అని అంటుంది. నా కొడుకు వంట వాడని మీ అన్నయ్య అనడానికి నీ చదివే కారణం అని జానకి (Janaki) ను అంటుంది. ఆ తర్వాత మల్లిక ఈ విషయం లో మరింత పుల్లలు పెడుతుంది. ఇక రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories