ఈరోజు ఎపిసోడ్ లో దివ్య నా గురించి దిగులు పడకు, ఎక్కువగా ఆలోచించకు ప్రశాంతంగా ఉండు మామ్ అని అంటుంది. మళ్లీ నీ ఒడిలో తల పెట్టుకుని పడుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏమో, నీ పక్కనే ఒక దిండు పెట్టుకొని పడుకో అది నేనే అనుకో అనడంతో తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత దివ్య తన అన్నయ్య వదినలను హత్తుకుని ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ప్రేమ్ దివ్య కి ధైర్యం చెబుతూ నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించకు నువ్వు నీ లక్ష్యం గురించి మాత్రమే ఆలోచించు. అమ్మ మీరందరూ రావద్దు నేను అన్నయ్య వెళ్లి దివ్యని ఫ్లైట్ ఎక్కించి వస్తాము అని అంటాడు ప్రేమ్. ఆ తర్వాత దివ్య అందరికీ సెండాఫ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తులసి పడుకోగా పదేపదే దివ్య మాట్లాడిన మాటలే గుర్తుకు రావడంతో బాధపడుతూ ఉంటుంది.