Jabardasth
జబర్దస్త్ బిగినింగ్ నుండి నాగబాబు, రోజా జడ్జెస్ గా ఉన్నారు. జబర్దస్త్ కి వారిద్దరూ ప్రధాన ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏళ్ల తరబడి జబర్దస్త్ తో వాళ్ళ జర్నీ సాగింది. 2019లో నాగబాబు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. వస్తూ వస్తూ మల్లెమాల సంస్థపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. దోచుకోవడమే కానీ కనీసం మంచి ఆహారం కూడా పెట్టరంటూ పలు ఆరోపణలు చేశారు.
Jabardasth
నాగబాబు స్థానంలోకి ఎవరి తేవాలనే చర్చ నడిచింది. యాక్టర్ అలీతో పాటు పలువురు జబర్దస్త్ జడ్జెస్ గా వ్యవహరించారు. సింగర్ మనో పర్మినెంట్ గా సెటిల్ అయ్యారు. మనో టైమింగ్, కామెడీ పంచెస్ నచ్చడంతో మల్లెమాల ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. చాలా కాలం సింగర్ మనో, రోజా జబర్దస్త్ జడ్జెస్ గా చేశారు.
Jabardasth
రోజాను మంత్రి పదవి వరించడంతో ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. నిబంధనల రీత్యా మంత్రి పదవిలో ఉన్నవారు ఇతర వృత్తుల్లో కొనసాగకూడదు. అలాగే ప్రజాప్రతినిధిగా మంత్రి హోదాలో ఆమె బాధ్యతలు మరింత పెరిగాయి. దీంతో జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోయారు. పలువురు ఆమె ప్లేస్ లోకి వచ్చారు. ఇంద్రజ అందరికంటే మెప్పించి సెటిల్ అయ్యారు.
Jabardasth
సింగర్ మనో-ఇంద్రజ చాలా ఎపిసోడ్స్ లో జడ్జెస్ గా కనిపించారు. మెల్లగా సింగర్ మనో కూడా దూరమయ్యాడు. కొన్ని నెలల నుండి మనో జబర్దస్త్ లో కనిపించడం లేదు. సీనియర్ కమెడియన్ కృష్ణభగవాన్ ని రంగంలోకి దించారు. టైమింగ్ కామెడీకి, అడల్ట్ జోక్స్ కి ఆయన ఫేమస్. జబర్దస్త్ కి ఆయన బాగా సెట్ అయ్యారు.
Jabardasth
సింగర్ మను జబర్దస్త్ ఎందుకు మానేశారనే చర్చ నడిచింది. మల్లెమాలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. అందుకే షో నుండి వెళ్లిపోయాడంటూ కథనాలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలకు ఆయన స్పష్టత ఇచ్చారు.
Jabardasth
కోవిడ్ కారణంగా నేను ఒప్పుకున్న కొన్ని షోలు పెండింగ్ లో ఉన్నాయి. ఇళయరాజా, ఏ ఆర్ రెహమాన్ తో కొన్ని షోలు చేయాల్సి ఉంది. ముందుగా ఒప్పుకున్న ఈవెంట్స్, పెండింగ్ లో ఉన్న షోలను పూర్తి చేయడానికే జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చాను. అంతకు మించిన కారణం ఏమీ లేదని సింగర్ మనో వివరణ ఇచ్చారు.