ఇప్పుడు వసుధార రిషి సార్ కు నా మీద ప్రేమ ఉంటే వెనక్కి తిరిగి చూడాలి అని అనుకుంటుండగా అప్పుడు రిషి వెనక్కి తిరిగి చూడడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు మహేంద్ర దంపతులు ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో దేవయాని,రిషి అక్కడికి వస్తారు. రిషిని చూసి జగతి మహేంద్ర సంతోష పడతారు. అప్పుడు దేవయాని కావాలనే తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు రిషి ఎలా వచ్చారని అనుకుంటున్నారా మీకు అసలు పేగు బంధమే తెలియదు కదా అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది దేవయాని. అప్పుడు మహేంద్ర ఎందుకు వదిన ఇలా మాట్లాడుతున్నారు అనగా అయ్యో నేనేమన్నాను మహేంద్ర అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది దేవయాని.